ఉత్తరాయణం

ఎందుకింత తాత్సారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ జనాభాలో దాదాపు సగం ఉన్న స్ర్తిలు నేడు ఉద్యోగాల్లో 24 శాతం ఉండడం హర్షదాయకం. నేడు స్ర్తిలు లేని రంగం లేదు. అయినా వారి సమస్యలు వారివే. ముఖ్యంగా వివాహిత స్ర్తిలు గర్భవతులుగా ఉన్నప్పుడు వారికి 2 సం. ప్రసూతి సెలవులు అవసరమని అందరూ ముక్తకంఠంతో అంటున్నమాటే. ఈ మధ్య కేంద్రంలోని శిశు సంక్షేమం కార్మిక శాఖామాత్యులు బండారు దత్తాత్రేయ, ఈ ప్రతిపాదన పై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలు కూడా ఆ సూచనకు తమ ఆమోదం తెలిపినా ప్రభుత్వపు నాన్చివేత ధోరణి సహింపరానిది. ముఖ్యంగా గర్భవతులైన ఉద్యోగినుల సమస్యలు ప్రభుత్వంలోని మగ మహారాజులైన అమాత్యులకు ఎలా తెలుస్తాయి. అనడం వింటున్న మాట. అన్నిటా ముందుంటామని నరేంద్ర సర్కార్ చెప్తూ ఈ తాత్సారం ఎందుకో? ప్రభుత్వ రంగంలోని స్ర్తిలకు వలే ప్రయివేటు రంగం సాఫ్ట్‌వేర్ రంగంలోని గర్భవతులకు కూడా ఆ యాజమాన్యాలు తగు వసతులు కల్పించి సమన్యాయం చేయగలవని ఆశిద్దాం!
- ఎన్.సత్యనారాయణాచార్యులు, తెనాలి

వివాదం రాజేస్తున్న కొత్త జిల్లాలు
తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో వివాదాలకు ఆజ్యం పోసే విధంగా ఉంది. కె.సి.ఆర్. చేసి పంపిన పంపనున్న ప్రకటించనున్న నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటికే కొన్ని జిల్లాలలో బంద్‌లు, నిరసన కార్యక్రమాలు జరగుతు న్నాయ. అఖిలపక్ష సమావేశాలతోపాటు పలువురి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల అంశాన్ని కేంద్రానికి పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. జిల్లాల ఏర్పాటుకు ప్రస్తుత పరిస్థితులలో స్వస్తిపలికి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించాలి. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలలో ఉద్యమాలు ఊపుఅందుకున్నాయి.
- అయినం రఘురామారావు, ఖమ్మం
చిరుతిండ్లను నిషేధించాలి
పాఠశాలల ఆవరణలో, పరిసర ప్రాంతాలలో జంక్‌ఫుడ్స్, సమోసాలు, కల్తీ నూనెలతో చేసిన చిరుతిండ్లు అమ్మకాలను నిషేధించాలి. విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో పాఠశాల వేళల్లో విరామ సమయాలలో రుచికరమైన చిరుతిండ్లు కొనడం మామూలే. అయితే వ్యాపారస్థులు దీన్ని ఇలా సొమ్ముచేసుకోవడం సబబుకాదు. వాటి స్థానంలో పిల్లలకు చక్కని ఆరోగ్యాన్నిచ్చే వివిధ రకాల పండ్లను అమ్మడం మంచిది. దీనిని ప్రోత్సహించాలి. విద్యార్థులకు జంక్‌ఫుడ్స్, అనారోగ్యకరమైన చిరుతిండ్లవలన వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
పేరుకుపోతున్న చెత్త
నాయకులు అపర రాజధానిగా తీర్చిదిద్దుతాం అంటున్నారు. సుందరీకరణ మాట దేవుడెరుగు, రోజురోజుకూ విజయవాడ చెత్త నగరంగా రూపుదిద్దుకుంటున్నది. గాలికి రాలిన ఆకులు ఇంటి ఆవరణలోకి కొట్టుకొస్తాయి. బకెట్‌లోనో, గంపలోనో పోసి చెత్త బండికోసం ఎదురుచూస్తాం. రాడు. కార్పొరేషన్‌కి ఫోను చేస్తే పంపిస్తాం అంటారు. ఈ ఫోను ఖర్చు ఎక్కువై పోయింది. చెత్త పన్ను మాత్రం అర్ధ సంవత్సరానికి రెణ్ణెల్ల ముందే కట్టించుకుంటారు. రోడ్డు ప్రక్కన ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పారబోస్తే 500 జరిమానా అని తాటికాయంత అక్షరాలతో బోర్డులు.
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ