ఉత్తరాయణం

మృగరాజుకు యావజ్జీవ శిక్షా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది మనుషులను చంపి తిన్నందుకు ఓ మగ సింహంపై విచారణ జరిపి, నేరం రుజువు చేసి దానికి యావజ్జీవ శిక్షగా ‘జూ’కు తరలించారట. ఈ హత్యకు తో డ్పడిన ఆడ సింహాలను, ఇతర అమాయక సింహాలను గుజరాత్‌లోని గిర్ పార్క్‌లో వదలివేశారట. మృగాలు తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో ప్రకృతే నేర్పు తుంది. ప్రాణికి ప్రాణమే ఆహారం అన్నది వేదోక్తి. సింహా లకు తెలుసా? చంపితినడం నేరమని? వదిలేసిన సింహాలు వూరుకుంటాయా తమ కంటబడ్డ ఏ ప్రాణి నైనా?మృగరాజుకు యావజ్జీవ శిక్ష అన్న పత్రికల వాఖ్యలు విచిత్రంగా ఉన్నాయ.
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
శాంతిభద్రతలు ముఖ్యం
వచ్చే ఆగస్టు 12 నుంచి పనె్నండు రోజుల పాటు నిర్విహించే కృష్ణా పుష్కరాల్లో రాష్ట్ర ప్రభుత్వం శాంతి భ ద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. గత ఏడాది గోదా వరి పుష్కారాల్లో రాజమండ్రి వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ అనుభవ పాఠాలను గ్రహించి కృష్ణా పుష్కరాల సంద ర్భంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఇం దుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్ర మత్తం కావలసిన అవసరం ఉంది. కళాశాలల్లోని ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్ల సేవలను ఉపయోగిం చుకోవాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
నిర్ణయం సరే...అమలు మాటేంటి?
నవ్యాంధ్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పదివేల ఉద్యోగాల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతించింది. అయతే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎనిమిది మంది సభ్యుల ఖాళీలున్నాయ. వీటిలో కనీసం నాలుగు ఖాళీలను తక్షణమే సమర్ధులతో భర్తీ చేయాలి. సుమారు 4,009 ఖాళీలలను ఎపిపిఎస్‌సి భర్తీ చేయాల్సి ఉంది. అయతే ఇంకా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు పూర్తి స్థాయ సిలబస్‌ను ప్రకటించాల్సి ఉంది. గత దశాబ్ద కాలంలో సరైన నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయస్సు రీత్యా 40+ వారున్నారు. ఇలాంటి వారికి వయో పరిమితిని 45కు పెంచాలి. అయతే పూర్తి స్థాయ సిలబస్ లేకుండా, సభ్యుల నియావ కాలు చేపట్టకుండా ఉద్యోగాల భర్తీ ఎలా సాధ్యం?
- టి. సురేష్ కుమార్, మందరడ
నాణ్యతలేని ఇంజినీరింగ్ విద్య
‘‘్భవిష్యత్తు యుద్ధాలు మైండ్‌తో మాత్రమే జరుగు తాయ’’ అని చర్చిల్ ఎన్నడో చెప్పారు. ప్రస్తుతం సైబర్ దాడులు సరీగ్గా అటువంటివే. ఐటిపై విపరీతంగా ఆధారపడటం పెరిగిపోతున్న నేటి రోజుల్లో సైబర్ భద్రత కోసం మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలి. దురదృష్ట వశాత్తు సామాజిక న్యాయం పేరుతో దేశంలో ఇంజనీ రింగ్, సైన్స్ విద్యల ప్రమాణాలను మనం ఎంతగానో దిగ జారుస్తున్నాం.
ఫీజు రీయంబర్స్‌మెంట్ వల్ల ఇంజినీరింగ్ విద్య నాణ్యత దారుణంగా పడిపోతున్నది. ఎందుకంటే ఆయా ప్రైవేటు కళాశాలలు రీయంబర్స్‌మెంట్ కోసం సరైన అర్హతలులేని, ఆసక్తి కనబరచని విద్యార్థులను కూడా ఎడాపెడా చేర్చుకుంటున్నాయ. నిజానికి చాలా ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రభుత్వం ఇచ్చే రీయంబర్స్ మెంట్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయ. ఇంజినీరింగ్ పాసైన వారిలో పదిశాతం వరకు ఉండే ప్రతిభా సం పన్నులు విదేశాలకు వెళ్లిపోతున్నారు. నిజానికి సరైన శిక్షణ పొందిన యువత దేశానికి ఆస్తి. రాజకీయ నాయకులు సామాజిక న్యాయం పేరుతో మానవ మేధ క్షీణించిపోవడానికి కారణమవుతున్నారు.
-డా. హనుమాన్ చౌదరి, సికిందరాబాద్
రిజర్వేషన్లకు పేదలే అర్హులు
దేశంలో రిజర్వేషన్లకై కుల పోరాటాలు సాగుతున్నా యి. కుల రిజర్వేషన్లు దేశానికి ప్రమాదకరం. వీటిని సాగనిస్తే ప్రభుత్వాలకే ముప్పు. దీనివల్ల రాజకీయాలు దెబ్బతింటాయి. కులాల కోసం పోరాడే రాజకీయవేత్తలను వెలివేయాలి. రిజర్వేషన్లనేవి కేవలం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకే నిర్దేశించబడినవని గుర్తించాలి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లోని కుల వ్యవస్థకు, ఇప్పటి కుల వ్యవస్థకు విపరీతమైన తేడా వచ్చింది. ఆరోజుల్లో కొన్ని కులాలు మాత్రమే సమాజాన్ని శాసించేవి. రోజులు పూర్తిగా మారాయి. ఆనాడు ఏ కులాలైతే ఆధిపత్యాన్ని చలాయించాయో, అవి ఈనాడు నిర్వీర్యమైపోయాయి. ఆర్థిక స్థోమతల్లో ఎనలేని మార్పులు వచ్చాయి. ఈరోజు ఏ కులానికి ఆ కులమే పెద్ద. ఎవరూ ఎవరికి లొంగి బ్రతకటం లేదు. ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ ప్రయోజనాలు అందరికి దక్కాయి. బడుగు, బలహీనవర్గాలన్ని బాగుపడ్డాయి. ధనికులు అన్ని కులాల్లోను, అన్ని వర్గాల్లోను విపరీతంగా పెరిగారు. ఈరోజు సర్వే నిర్వహిస్తే ఓసిలనే ప్రజలే పూర్తిగా అణగారిన వర్గాల్లో చేరతారు. ఈ రోజు రిజర్వేషన్లకు కులముగాదు ఆధారం కేవలం బీదరికం మాత్రమే. కావున వార్షికాదాయం ప్రాతిపదికపై కుల మత వర్గ వర్ణ భేదము లేకుండా ఆర్థికంగా వెనుకబడ్డ ప్రతి కుటుంబానికి రిజర్వేషన్లు కల్పించాలి.
- జి.శ్రీని