సబ్ ఫీచర్

జ్ఞానానికి పునాది మాతృభాషే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థలు, ఎన్.టి.ఆర్ ట్రస్ట్ సంయుక్తంగా తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనాన్ని 2016 మే 31న విజయవాడ లబ్బిపేటలోని శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. మూడు సదస్సులు జరిగాయి. సుమారు 40 మంది వక్తలు వివిధ అంశాలపై ప్రసంగించారు. ప్రధాన అభిప్రాయాలు ఇలా వున్నాయి.
మొదటి సదస్సులో తెలుగు భాష వికాసం ప్రభుత్వ సంస్థల పనితీరు- తెలుగు భాష, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ అధికార భాషా సంఘం, పరిశోధనలకు ప్రోత్సాహం, బోధనాంశాలుగా తెలుగు మొదలగు అంశాలు చర్చించటం జరిగింది. తెలుగు భాష వచ్చినవారు ఇంగ్లీషు తేలికగా నేర్చుకొనవచ్చు. ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఇంగ్లీషు మాధ్యమే వుండవలసిన అవసరం లేదు. అయితే, ప్రస్తుతం తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి.
భాషా పండితుల కొరత బాగా వుంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే అసలైన తెలుగును ప్రజలలోనికి తీసుకొని వెళ్ళలేం. తెలుగులో అర్జీలిచ్చి తెలుగులోనే ఉత్తర్వులు తీసుకోవాలి. తెలుగు భాషపై యువతకు తగిన ఆసక్తి కలిగించాలి. పండితులు (వేమనతో సహా) తెలుగు భాషను ఎలా ఉపయోగించారో విద్యార్థులు తెలుసుకోవాలి. సాంకేతికపరమైన పుస్తకాలు ఇంకా ఎక్కువగా తెలుగులో రావాలి. తెలుగు మహా నిఘంటువు, జాతీయాలు, సామెతలు, జానపద గీతాలు, పాత చిత్రాలలోని పాటలు మొదలగు వాటిని ముద్రించాలి. తెలుగులో కంప్యూటర్ వాడకం పెరగాలి. వ్యాపార సంస్థలు, దుకాణాలన్నీ తెలుగులో బోర్డులు ఏర్పాటుచేసుకోవాలి. గ్రంథాలయోద్యమాన్ని తెలుగు విశ్వవిద్యాలయాన్ని పటిష్ఠపరచాలి. గిరిజన భాషలకు కూడా ఒక అకాడమీ వుండాలి.
రెండవ సదస్సులో తెలుగు సాంస్కృతిక వికాసం, వివిధ ప్రభుత్వ సంస్థల పనితీరు, సంగీత, నృత్య, కళాశాలలు, తెలుగు విశ్వవిద్యాలయం, భాషా, సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి, పురావస్తు శాఖ మొదలైన అంశాలు పరిశీలించడం జరిగింది. ప్రభుత్వపరంగా నాటక రంగానికి ఎటువంటి ప్రోత్సాహం లేదు. కేవలం అవార్డులతో ఈ రంగం పురోగమించదు. మంచి కళాకారులను తయారుచేయడానికి వ్యూహం అవసరం. పద్య నాటకాలపై శ్రద్ధ చూపాలి.
కళలు జానపద సాహిత్యంలోనూ చోటుచేసుకున్నాయి. అయితే క్రమేపీ వీటి ఉనికి కనుమరుగవుతున్నది. పర్వదినాలలోనైనా జానపద కళలను ప్రదర్శించడం మరువరాదు. జానపద మ్యూజియంలను జిల్లా స్థాయిలో ఏర్పరచాలి. జానపద కళలపై పరిశోధనలను ప్రోత్సహించాలి. నాట్యకళకు కూడా ఆదరణ చాలా తక్కువ. కూచిపూడికి పూర్వవైభవం తేవడానికి కృషి మొదలయ్యింది. నాట్యకళాకారులు, చరిత్రకారుల మధ్య సమన్వయం సహకారం వుండాలి. చరిత్రను పాఠశాలలోనూ, కళాశాలలోనూ తేలికగా తీసుకుంటున్నాము. చరిత్ర పాఠ్యాంశంగా వుంటుందా లేక చరిత్రలో కలిసిపోతుందో అనే భయం వుంది. విద్యార్థులు కొన్ని ప్రాచీన కట్టడాలను చూసినా మన దేశ చరిత్ర గొప్పతనాన్ని గుర్తిస్తారు.
మూడవ సదస్సులో పొరుగు రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోనూ తెలుగువారి సమస్యలను చర్చించడం జరిగింది. తెలుగు వారికి తెలుగు నేర్పించటం, తెలుగు భాషా సంస్కృతులపై ఆసక్తి పెంచడం, పాఠ్యపుస్తకాలు, తక్కువ కాల పరిమితి తెలుగు కోర్సులు, సర్ట్ఫికేట్లు ప్రదానం మొదలైన అంశాలపై జరిగాయి. ఇతర రాష్ట్రాలలో తెలుగువారు తెలుగు నేర్చుకుంటున్నారు. ఇతర పాఠ్యాంశాలు ఆంగ్లంలో నేర్చుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా ఒడిస్సాలో అధ్యాపకుల కొరత వుంది. బి.ఇడి తెలుగు లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల కు జీతాలే ఇస్తున్నారు. పాఠశాలల నిర్వహణను పట్టించుకోవడం లేదు.
ఈ సమ్మేళనం అభిప్రాయ సేకరణకే ఉపయోగపడింది. వీటిపై నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేయాలి. వీటిని అమలుపరచవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం చేపట్టాలి. కనీసం ఇంటర్మీడియట్ స్థాయి వరకైనా బోధనా భాషగా తెలుగుండాలి. తెలిసిన భాషలోనే తెలియని విజ్ఞానం పొందాలి.

- డాక్టర్ ఇమ్మానేని సత్యసుందరం