ఉత్తరాయణం

మంత్రాలకు చింతకాయలు రాలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలకు చింతకాయలు రాలేకాలం, మరణించిన వారిని బ్రతికించే యుగాలు గతించాయి. పాత యుగాలలో అవి చెల్లుబడి అయ్యాయి. మైదాస్ టచ్ అనే కథ చిన్నప్పుడే చదువుకున్నాం. నీతికి ధర్మానికి, న్యాయానికి, కట్టుబడి బతికిన రోజులవి. అంచంచలమైన, నిష్కల్మషమైన, సర్వమానవ సౌభ్రాతృత్వానికి, సర్వేజనా సుఖినోభవంతు అని నిత్యం నమ్మి కొలుస్తున్న దైవాన్ని ప్రార్థిస్తూ, మన దైనందిన కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటే, అపజయాలన్నవి పలుకరించవు. ఈ సూత్రాన్ని మరచి మోసపూరిత బాబాలను ఆశ్రయించి వంచించబడ్డవారెందరినో చూస్తు న్నాం. లైఫ్‌స్టైల్ మధుసూదన్ రెడ్డి ఇందులో ఒకరు. ఈ ఉదంతం కనువిప్పు కలిగించాలి.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
తగ్గుతున్న అడవులు
మానవ జనాభా పెరుగుతూ భూభాగాన్ని మరింత ఆక్రమించడం, మానవుని స్వార్థ కారణాలవల్ల అడవుల సంఖ్య అంతరిస్తుంది. విచక్షణా రహితంగా అడవులను నరికి వేయడంవల్ల భూతాపం పెరిగిపోతూ వాతావరణంలో మార్పులు వచ్చాయి. వానలు సరిగాలేకపోవడం, ఎల్‌నినోతో తీవ్ర ఇబ్బందులు లేదా లాన్‌నినోతో తీవ్ర నష్టం సంభవిస్తున్నాయి. వన్యప్రాణులకు నిలువనీడ కరవై పట్టణాల్లో, గ్రామాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుంటూ మానవులను భయభ్రాంతులను చేస్తున్నాయి. తరచూ చిరుత వంటి క్రూర మృగాలు దారితప్పి ఊళ్ళలో ప్రవేశించి మానవులపై, మూగజీవాలపై దాడిచేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ప్రభుత్వాలు ఈ విషయం గుర్తించి అడవుల పెంపకంపై దృష్టి సారించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
విద్యార్హత అవసరం
గ్రామస్థాయి ప్రజాప్రతినిధులల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉండటం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతం కాలేకపోతున్నాయి. కనుక 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్హతను ప్రజాప్రతినిధుల స్థాయిని బట్టి గ్రామస్థాయికి, మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయిగా నిర్ణయించి తప్పక విద్యార్హము నిబంధనలను ప్రవేశపెట్టడానికి గాను తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక చట్టం చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగారికి మనవి. గ్రామాలు, పంచాయితీరాజ్ శాఖల అభివృద్ధి సాధించడానికిగాను ప్రజాప్రతినిధులు విద్యావంతులై వుండాలి.
- ఈదునూరి వెంకటేశ్వర్లు, నెక్కొండ
బస్సుస్టేషన్లా? మురికి కూపాలా?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలోని ఆర్టీసీ బస్సుస్టేషన్‌లలో దుమ్ము, ధూళితో నిండి వుండి అపరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని పరకాల, ములుగు, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూర్ బస్‌స్టేషన్‌లలో చెత్తాచెదారం వదజల్లబడి ప్రయాణీకులకు ఇబ్బందికరంగా మారింది. బస్టాండ్ ఆవరణలోగల గోడలపై మలమూత్రాలు విసర్జించడం, పందులు, పశువులు సైతం విచ్చేసి కలుషితం చేస్తున్నాయి. చుట్టుప్రక్కల చెత్త డంపింగ్ కేంద్రాలుగా బస్‌స్టాండ్‌లలో చెత్త పేరుకొనిపోతున్నది. ప్యాన్‌లు తిరగకపోవడం, టీ.విలు పనిచేయకపోవడం జరుగుతుంది. ప్రభు త్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్‌స్టేషన్‌లలో శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, పరకాల
చదువు ఆవశ్యకతను గుర్తించాలి
చదువు ఆవశ్యకతను అందరూ గుర్తించేలా మొదట కృషి జరగాలి. సమాజం విద్యావ్యవస్థ మీద ఆధారపడి ఉంది. విద్యారంగమే లేకుంటే సమాజం ఎక్కడికెళ్తుందో తెలియదు. మానవుల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడేది విద్య మాత్రమే. విద్య రానున్న రోజుల్లో దేశ ఆర్థిక భవిష్యత్ నిర్ణయించే శక్తిగా రూపుదిద్దుకొంటుంది. విద్యను ఉపాధితోపాటు సామాజిక విలువలను పెంపొందించే పరివర్తనకు దోహదపడే ఒక ప్రక్రియగా మాత్రమే గుర్తించాలి. కాని వ్యాపార వస్తువుగా పరిగణించరాదు. ప్రపంచ బ్యాంకు ఒత్తిడితో ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేటీకరించజూస్తున్నాయ. కార్పొరేటు స్కూళ్లు రోజురోజుకూ విస్తృతంగా పెరిగిపోతున్నాయి. కోళ్ల ఫారాలను తలపించే కానె్వంట్లు, కోళ్ల వ్యానుల్లో కోళ్లను వేసినట్లు పిల్లలను తరలిస్తున్నారు. భారంతో కూడిన పుస్తకాలు. హమాలీలు వీపున మోస్తున్నట్లు మారిపోతున్నారు. బాల్యాన్ని వెంటాడి కార్పొరేట్లు కార్ఖానాల్లో బంధిస్తుంది. కార్పొరేట్ స్కూళ్లు కలవారికి ప్రైవేటు స్కూళ్లు మధ్యతరగతి వారికి ప్రభుత్వ స్కూళ్లు పేద తరగతి వారికిగా మిగిలింది.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
ఏదీ మద్దతు ధర?
రైతులవద్ద ధాన్యం ఉన్న సమయంలో మద్దతు ధర పెంపు ఉండదు. రైతుల వద్దనుండి ధాన్యం అమ్ముకున్న తరువాత మద్దతు ధర పెంచారు. ఇది సమంజమేనా? ప్రస్తుతం ఏ రైతువద్ద ధాన్యం ఎంత మాత్రం లేదు. ప్రభుత్వం ఏదైనా రైతులంటే ఇంత చులకనభావన ఉండకూడదు. పంట పండించిన రైతువద్ద ధాన్యం ఉన్న సమయంలో మద్దతు ధర పెంచితే రైతుకు ప్రయోజనం, లేకపోతే మిల్లర్లుకు లాభం.
- కొండ్రెడ్డి రామమోహనరావు, పుల్లేటికుర్రు