ఉత్తరాయణం

రాజధాని మార్పిడికంత తొందరేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని మార్పిడికంత తొందరెందుకు? దుర్మార్గమైన రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాదు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వుండవచ్చు కదా. మొగ్గలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దుఃఖసాగరంలో ముంచివేయాలా? ఆంధ్రా ప్రజలు పెంచి పెద్దచేసిన హైదరాబాదును కనీసం ఇంకా పది సంవత్సరాలైన వారు రాజధానిగా భావిస్తు కొద్దిగానాన్న సంతోషంగా వుండకూడదా? అతి త్వరగా హైదరాబాదును వదిలివేయించాలనే ప్రయత్నం స్వార్థ రాజకీయ నాయకుల కుట్ర. వంద సంవత్సరాలుండాల్సిన భవనాలను ఆదరా బాదరాగా కడితే ఎలా?
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ

సామాన్యుడికి వైద్యం అందాలి
ఆయుర్వేద మందులు నేడు చాలా ఖరీదైనవి. కేవలం ధనవంతులే వీటిని కొనుగోలు చేసి వాడగలరు. పేదవాడు గతి ఏమిటి? కనుక ఇంగ్లీషు జనరిక్ మందులవలే ఆయుర్వేద జనరిక్ మందులు కూడా ప్రవేశపెట్టాలి. ప్రభుత్వం వివిధ వ్యాధులకు ఉచితంగా ఆయుర్వేద మందులను రోగులకి ఇవ్వాలి. వైద్యం సామాన్యుడికి అందినప్పుడే ఆరోగ్యభద్రత ఉంటుంది.
- వి.శేషగిరిరావు, కంచరపాలెం
కానరాని పరిశుభ్రత
దేశవ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రత గురించి ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్’ కేవలం నినాదంగానే మిగిలిపోయంది. ఎక్కడా పరిశుభ్రత కానరావడంలేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పుణ్యక్షేత్రాలలో ఇది స్పష్టంగా ఉంది. జిల్లాలో ఎంతో ప్రసిద్ధి పొందిన ‘అయినివిల్లి, మురముళ్ళ’ గ్రామాల్లో చాలా దారుణంగా వుంది. ఈ రెండు క్షేత్రాలలో మోటర్ వాహనాలకు పార్కింగ్ స్థలం కేటాయించాలి. తద్వారా దేవాలయం యొక్క ఆదాయము మరింత అభివృద్ధి పరచుకోవడం ద్వారా ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య తగ్గించవచ్చు. మురముళ్ళ పారిశుద్ధ్యం చాలా దారుణంగా ఉన్నది. ఊరిలో వచ్చిన వెంటనే చెడు వాసన, చెత్త, చెదా రం, ఈగలు, పందులతో ఉంటుంది. వెంటనే మార్కెట్‌కు స్థలం కేటాయించి అక్కడకు మార్చాలి. పవిత్ర పుణ్యక్షేత్రాలకు మళ్ళీ మళ్ళీ వచ్చే విధంగా భక్తులను అభివృద్ధి చేయలి. పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటే అనేక వేల మంది సుదూర ప్రాంతాలనుండి రావడానికి సుముఖత చూపుతారు.
- సత్తినేటి వెంకటరమణ, రామచంద్రపురం

రెండు పార్టీల వ్యవస్థ రావాలి
ఈ విషయంపై అనేక చర్చలు జరిగాయి. కానీ ఆచరణకు నోచుకోలేదు. అనేక ప్రాంతీయ, జాతీయ పార్టీలవల్ల పాలనా వ్యవస్థ కుంటుపడటం చూస్తున్నాం. అమెరికా, బ్రిటన్ దేశాల మాదిరిగా రెండు లేక మూడు జాతీయ పార్టీలే ఉండేటట్టు, ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీకి సపోర్టు మాత్రమే ఇచ్చేటట్టు, రాజ్యాంగ సవరణలు చేయాలి. మన ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు. వీటివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. విశేషమైన మార్పురాకపోతే ముందుముందు మన సార్వభౌమాధికారానికీ ముప్పు రావచ్చు. ఏ పార్టీ అయినా కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని ప్రభుత్వం స్థాపిస్తే మధ్యంతర ఎన్నికలకు తావివ్వకుండా రాజకీయ నాయకులు కట్టుబడి ఉండాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

ఆంధ్రప్రదేశ్‌కి మిగిలింది మట్టి
ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా యిస్తాం, ఆదుకుంటాం అని చెప్పిన మోదీ రాజధాని నిర్మాణానికి మట్టి తెచ్చి ఇవ్వటం దారుణం. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీగారు ఎంతసేపూ విదేశీ పర్యటనలు చెయ్యటం తప్ప ఆంధ్రప్రదేశ్‌కి ఒరగబెట్టింది ఏమీ లేదు. మోదీ పరిపాలనలో ఎంతసేపు ఉత్తరాది రాష్ట్రాలు బాగుపడటం తప్ప దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అడుక్కుతినే పరిస్థితిలా మారటం శోచనీయం. మోదీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా నిధులు కేటాయించాలి.
- నాగేశ్వర్‌రెడ్డి, వలివేరు
సెల్‌ఫోన్లు నిషేధించాలి
కొన్ని దేవాలయాలలో సెల్‌ఫోన్లను భక్తులు విచ్చలవిడిగా వాడుతూ ఇతరలకు భంగం కలిగిస్తున్నారు. కావున దేవాలయాల్లో తప్పనిసరిగా నిషేధించాలి. పెద్ద పెద్ద ప్రసిద్ధ దేవాలయాల్లో సెల్‌ఫోన్స్ నిషేధించారు. జిల్లా స్థాయిలోని ప్రసిద్ధ దేవాలయాల్లో వీటిని నిషేధించాల్సి వుంది. దేవాలయాలకు ప్రశాంతతకోసం భక్త్భివంకోసం వస్తే అక్కడ పూజ సమయంలో సైతం మాట్లాడుతూ ఇబ్బంది కలిగిస్తున్నారు. లేదా సెల్‌ఫోన్‌లు పనిచేయకుండా జామర్‌లను వినియోగించాలి. ఒక దేవాలయాధికారులకు తప్ప భక్తుల చేతుల్లో సెల్స్‌ను ఉండకుండా ఉన్నా ఆఫ్ చేసే విధంగా చూడాలి. అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడంతో మరింతగా వాడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం