సబ్ ఫీచర్

లక్ష్యం కన్నా మార్గమే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంధరికి లక్ష్యంకన్నా ఫలితమేప్రధానం.
మరికొంతమందికి లక్ష్యంకన్నా మార్గమే ప్రధానం.
ప్రాసెస్‌కు ప్రాధాన్యమిచ్చేవాడు లక్ష్యసాధనలో ఫలితాల గురించి ఆలోచించడు. లక్ష్యసాధన కొన్ని సంవత్సరాల తర్వాత కనపడుతుంది.
సాగర్‌లో ఎ.పి.రెసిడెన్షియల్ కాలేజీ పెట్టినప్పుడు కేవలం సైన్స్ సెక్షన్ పెడితే చాలుననుకున్నారు. ఆనాడు ప్రతిభగల విద్యార్థులందరు కూడా సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల వైపుకు మొగ్గుచూపేవారు. కానీ ఆనాడున్నటువంటి రాజగోపాల్ లాంటి అనుభవంగల అధికారులు సైన్స్ విద్యార్థికి కామర్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులు తెలియాలనే వారు. అదే విధంగా కామర్స్ విద్యార్థికి సైన్స్, హ్యుమానిటీస్ తెలియాలి. హ్యుమానిటీస్ చదివే వారికి సైన్స్, కామర్స్ తెలియాలి. ఈ లక్ష్యంతో మూడు బ్రాంచీలను సాగర్ ఎ.పి. రెసిడెన్షియల్ కాలేజీలో ప్రారంభించారు. సమర్థులైన ఉపాధ్యాయులను తీసుకువచ్చారు. కేవలం 150 మంది విద్యార్థుల కోసమై ఇంత డబ్బును ప్రభుత్వం ఎందుకు ఖర్చుచేస్తుందని ఆశ్చర్యపోయాం. ఈనాడు అదే సైన్స్ విద్యార్థులు ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. కామర్స్ చదివిన విద్యార్థులు పత్రికారంగం రచయితలయ్యారు. అదే హ్యుమానిటీస్ విద్యార్థులు గ్రూప్ 2 విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సంస్థలో పనిచేయటం చూస్తున్నారు.
ఉపాధ్యాయుడు ఫలితం గురించి ఆలోచించడు. అతనికి ప్రాసెస్ ముఖ్యం. ఉపాధ్యాయునికి అధికారం చెలాయించే సమాజంకన్నా ప్రజాస్వామిక సమాజానికై తరగతి గదిలో మార్గం వేస్తుంటాడు. పిల్లలు అల్లరిచేస్తే ఓపికతో బుజ్జగించి, వారి సమస్యలు పరిష్కరించి సన్మార్గంలో పెడతాడు. పిల్లలతో మాట్లాడటంకన్నా పిల్లలు చెప్పిన దానికే ప్రాధాన్యమిస్తాడు. విజయంకన్నా విజయ సాధనలో మెట్లు ఎక్కించటమే ప్రధానం. పైనున్న విద్యార్థిని ప్రేరేపిస్తాడు. విజయం సాధించిన వారిని భేష్ అం టాడు. చివరకు విజయం పిల్లలదేనంటాడు. పిల్లల అపజయానికి ఉపాధ్యాయుడు బాధ్యత వహిస్తాడు.
ఉపాధ్యాయుడిని ఫలితాలతో కొలమానం చేయరు. చేయకూడదు. ఉపాధ్యాయులు వేసిన మార్గాలే ఆ వర్గానికి గౌరవం తీసుకువస్తుంది. మహనీయులు చేసిన పనులు గొప్పవైనప్పటికినీ, వారు చేసిన అన్ని పనులు గొప్పవి కావల్సిన పనిలేదు. సామాన్య టీచర్ చేసిన పని 30 ఏళ్ల తర్వాత అదో గొప్ప పనిగా కనపడుతుంది. ఓ.యు. వి.సి. అలీ అవర్‌జంగ్, కెమిస్ట్రీ హెడ్ సుబ్బారావు, ఎకనామిక్స్ ప్రొ.ఖాదర్‌లు వారు వేసిన బీజాలే ముప్పయి సంవత్సరాల తర్వాత ఓ.యు. విశ్వవిద్యాలయానికి కీర్తి తెచ్చిపెట్టాయి. కొందరు ఉపాధ్యాయులు చేసే పని, కొందరిలో వున్న విలువలు, కొందరిలో నైతికత దీర్ఘకాలం తర్వాత దాని ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని చెట్లు, కొన్ని తెగలు రెండుమూడు మాసాల్లోనే ఫలితాలిస్తాయి. ఉపాధ్యాయుడు వేసిన శిల్పం దీర్ఘకాలం తర్వాత ప్రకాశిస్తుంది.

- చుక్కా రామయ్య