ఉత్తరాయణం

గణేశ్ నిమజ్జనాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఇతర పట్టణాల్లో గణేశ నిమజ్జనాలు, వూరేగింపుల వల్ల ప్రభుత్వంపై పాలనా పరంగా, ఆర్థిక, భ ద్రతా పరంగా భారం పడుతుంది. అంతేకాదు చెరువుల లో కాలుష్యం మరింత పెరిగిపోతుంది. వీధులు చెత్తగా తయారవుతాయ. చందాల వసూళ్లకోసం, బల ప్రదర్శన కోసం, రాజకీయ ప్రయోజనాలకోసం, జరుపుతున్నట్టుగా గణేశ్ వూరేగింపులు ఉంటున్నాయ తప్ప, భక్త్భివంతో జరుగుతున్నట్టు లేదు. టివి ఛానళ్లు నిమజ్జనాల తాలూకు ప్రసారాలను మానడం మంచిది. ప్రతి సంవత్సరం హైకోర్టు అభ్యంతరాలను ప్రకటించడం, ఏదోవిధంగా ప్రభుత్వం ‘‘మమ’’ అనిపించి ఆ సంవత్సరానికి గండం గడిచింది అని సంతోషించడం జరుగుతోంది. హిందువు లను సమైక్యంగా ఉంచడానికి గణేశ్ నిమజ్జనాలు దోహద కారులు కాజాలవు. ఇటువంటి ఆర్భాటాల వల్ల హిందు వుల్లో భక్తి పెరుగుతుందనుకోవడం ఒట్టి భ్రమ.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్
సంప్రదాయాన్ని మరిస్తే ఎలా?
తనని డియర్ అని ఒక మంత్రి సంబోధించడాన్ని కేం ద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పు పట్టారు. ఆంగ్లభాషతో పేచీ ఇదే. ఆంగ్లంలో ఉత్తరం రాసినా, ఉపన్యసించినా ఆడ, మగ, అందర్నీ డియర్ అని సంబోధించడం సహ జమే. కాని హిందీ లేదా తెలుగులో ఉత్తరం రాసినా ఉప న్యసించినా స్ర్తీలను డియర్ అని సంబోధించడం సరి కాదని భావిస్తారు. ముఖ్యంగా మంత్రులను గౌరవనీయ అని సంబోధించడం సంప్రదాయంగా వస్తున్నది. హిందీలో ఉత్తరం రాస్తూ ఆంగ్ల పద్ధతిలో సంబోధించడం వెకిలితనం కాక మరేంటి? అందునా సంప్రదాయాన్ని పాటించే కేంద్ర మంత్రికి ఉత్తరం రాసినప్పుడు రాసే విధానం తెలియపోతే ఎట్లా?
- సత్య, కరప, తూ.గో.జిల్లా
ధార్మిక రాజ్యంగా ప్రకటించాలి
ఉత్తర ప్రదేశ్‌లో ముస్లింలు అధికంగా ఉన్న గ్రామం నుంచి ముస్లింల దౌర్జన్యాలను భరించలేక పెద్ద సంఖ్యలో హిందువులు వలస పోతున్నట్టు వార్తలు వస్తున్నాయ. దేశంలో కూడా ముందు ముందు ముస్లింల జనాభా పెరిగిపోతే హిందువులకు ఇదే గతే పట్టవచ్చు. అందువల్ల హిందూ ధర్మరక్షణ ప్రభుత్వ బాధ్యత. రాజ్యాంగ శాసనాన్ని మార్చాలి. లేకపోతే దేశ సమైక్యతకు తిలో దకాలే. అందువల్లనే మనదేశాన్ని ధార్మిక రాజ్యంగా ప్రకటించాలి. మతమార్పిడులను నిషేధించాలి.
- ఈమని సువర్ణం, కపిలేశ్వరపురం
ఇలాంటి ప్రకటనలు అవసరమా?
కొన్ని కంపెనీల శీతల పానీయాల ప్రకటనలోనూ, కొన్ని ఇతర ప్రకటనలలోనూ ప్రముఖ హీరోలను పెట్టి వారు అసాధ్యమైన సాహసాలను చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఇవి ఎవరూ చేయలేని సాహసాలే? నిజంగా ఆ హీరోలూ చేయలేరని చాలామందికి తెలుసు. కానీ వీరాభిమానులు తామూ అలాంటివి చేయాలని హీరోలను అనుకరించబోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రకటనలు అనర్ధదాయకమని కంపెనీ యాజమాన్యం వారికి తెలియదా? ఇలాంటివి అనుకరించవద్దని చిన్నగా హెచ్చరికలు వేస్తే ఎవరైనా పట్టించుకుంటారా? ఇలాంటి ప్రకటనలను నిషేధించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
కటాఫ్ మార్కులు తగ్గించాలి
‘డిఈఈసెట్’ పరీక్షలో ఆన్‌లైన్ పద్ధతిలో గ్రామీణ విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడం, వేగం లేకపోవడం వలన ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి, సబ్జెట్‌పై మంచి పట్టువున్నా ఆన్‌లైన్ పరీక్షలో ఎక్కువ శాతం మందికి ప్రభుత్వం విధించిన కటాఫ్ మార్కులు కన్నా తక్కువ వచ్చాయ. కటాఫ్ మార్కులులో కూడా కులాల వారీగా రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం ఎంతవరకు సబబు? ఏలినవారు కటాఫ్ మార్కులను తగ్గించాలి.
- వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం