ఉత్తరాయణం

డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయనా ఇప్పటికీ డిఎస్‌సి పోస్టు లను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు. లక్షల మంది అభ్య ర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టెట్ ఫలితాలు విడుదలైనా ప్రయోజనం లేకుండా పోయంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని గురుకులాలు పెట్టినా, లక్షల మంది విద్యార్థులు చేరినా, డిఎస్‌సి నిర్వహించకపోతే విద్య చెప్పే ది ఎవరు? విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్నారు. పారద ర్శకత అంటూ టిపిఎస్‌సి ద్వారా నియమించడం శుద్ధదం డగ. విద్యాశాఖ అక్రమాలకు నిలయంగా మారుతుంది.
- కమ్మరి శ్రీనివాసాచారి, దౌర్తాబాద్, మెదక్
చేతబడిని అరికట్టాలి
నవ్యాంధ్ర ప్రభుత్వం పదవీస్వీకార ప్రమాణం చేసిన రోజునుంచి నేటి వరకు రాష్ట్రంలో చేతబడి, బాణామతి, చిల్లంగి పేరిట జరిగిన హత్యలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈవిధంగా చేతబడి చేస్తున్నారన్న పేరుతో రాష్ట్రంలో ఇప్పటి వరకు బలైన వారి సంఖ్య ఎంత అన్నదీ ప్రభుత్వం సర్వే జరిపి తెలుసుకోవాలి. ఇందుకోసం గ్రామ కార్యదర్శులు, ఎంపిపిలు, తహశీల్దారులు, ప్రభుత్వ వైద్యులు, మండల పరిషత్ అభివృద్ధి అధికార్ల ఆఫీసర్లతో, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో సర్వే జరిపించాలి. చేతబడి వంటి వాటిని నిరోధించేందుకు వీ లుగా ప్రభుత్వం ఒక ప్రత్యేక జి.ఒ. జారీ చేయాలి. మహా రాష్టల్రో మాదిరిగా ‘మూఢనమ్మకాల నిర్మూలనా చట్టం’ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొని రావాలి.
- శీరావు శ్రీనివాసరావు, శృంగవరపుకోట
హైకోర్టు విషయంలో జాప్యమెందుకు?
విభజన చట్టంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు భవనం తెలంగాణకు చెందిందని, అందువల్ల ఆంధ్రప్రాంతానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడాల్సి ఉన్నది. తెలంగాణ న్యాయవాదులు తరచు హైకోర్టును వెంటనే విభజించాలని ఆందోళన చేస్తున్నారు. అవసరమైతే ఏపీ హైకోర్టుకు తాత్కాలిక భవనాలను హైదరాబాద్‌లో చూపుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఎప్పటి లోగా ఆంధ్ర ప్రాంతంలో హైకోర్టు భవనాల నిర్మాణం జరుగుతుందనేది ఆరాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పరు. హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్, మంత్రుల కార్యదర్శుల నివాసాలు, తయారు కావడానికి కనీసం మూడు నాలుగేళ్లు పట్టవచ్చు. అప్పటి దాకా తాత్కాలికంగా కొన్ని భవనాలను విజయవాడ లేదా గుంటూరులో గాని చూపగలిగితే విభజన త్వరగా పూర్తి చేయవచ్చు. కేంద్రం తనవంతు సహాయం అందించవల సి ఉంటుంది. ప్రతిసారి తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేయడం దానికి ఎటువంటి స్పందన లేకపో వడం ఏమీ బాగాలేదు. ఏపీ ప్రభుత్వం హైకోర్టుకోసం తాత్కాలిక భవనాలను చూపాలి.
- కె.హెచ్. శివాజీరావు, చైతన్యపురి, హైదరాబాదు
హిందువులకు కూడా బహుమతులు ఇవ్వండి
రంజాన్ పవిత్రమాసంలో ముస్లిం సోదరులకు ఇస్తున్న ‘తోఫా’ మాదిరిగానే, వరలక్ష్మి వ్రతం రోజున హైందవ మహిళలకు (ఉద్యోగినులకు కనీసం) నూతన వస్త్రాలు, దీపావళికి టపాకాయల ప్యాకెట్లు (గిఫ్ట్‌గా), శివరాత్రి మరురోజు హైందవ ఉద్యోగులకు సెలవుదినంగా ప్రకటిం చి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సర్వమత, సకలజన సహోదరత్వాన్ని ప్రోత్సహించాలి. మన రాజ్యాంగం సర్వమత సమభావ వ్యవస్థను నిర్దేశించినందువల్ల, అన్ని మతాల వారి పట్ల సమానంగా వ్యవహరించాలి.
- కె.సుజాతా నాగరాజారావు, కావలి
ఆడంబరాలు వద్దు
వినాయక ఉత్సవాలను ఆడంబరంగా నిర్వహించాలన్న ఉత్సాహంతో, రసాయనాలు కలిపిన విగ్రహాలను వాడు తున్నారు. ఈ విగ్రహాలు నీటిలో నిమజ్జ్జనం కాక, నీరు కలుషితమవుతోంది. వినాయక ఉత్సవాలు భక్త్భివం తో కాక ఆడంబరాలకు, గొప్పతనం చూపుకోవడానికి అ న్నట్టుగా నిర్వహిస్తున్నారు. అందువల పర్యావరణ శాఖవారు తక్షణమే మేల్కొని అట్టహాసాలకు అడ్డుకట్ట వేయాలి. మట్టి వినాయకుళ్లను వాడేవిధంగా ఇప్పటి నుంచే ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు అమలు చేయాలి. రసాయనాలతో వినాయక విగ్రహాల తయారీపై చర్యలు తీసుకోవాలి.
- కోవూరు వెంకటేశ్వరరావు, కందుకూరు, ప్రకాశం జిల్లా
విలీనం తగదు
గ్రూప్-1లో గ్రూప్-2 పోస్టులను విలీనం చేయరాదు. ఎపిపిఎస్‌సి ఆలోచనలు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే మాదిరిగా ఉన్నాయ. నిరుద్యోగులు, ఎపిపిఎస్‌సి తీసుకునే చర్యలను ఖండించాలి. ఈ రెండు గ్రూపులను విడివిడిగానే ఉంచాలని కోరుతున్నాం.
- కుడెర జాహ్నవి, అనంతపురం