సంపాదకీయం

ఉత్పాదకత ఇనుమడించాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టకేలకు ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా ఎడతెగని వివాదాలకు, ఉత్కంఠకు దారితీసిన జీతాల పెంపు వ్యవహారం ఓ కొలిక్కి రావడం ఆనందకరమైనదే అయినప్పటికీ దీని పర్యవసానాలను, ఆర్థిక వ్యవస్థపై దీని వల్ల పడే భారాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాదాపు లక్ష కోట్ల రూపాయలకు వేతన సంఘం సిఫార్సుల అమలు వల్ల ఖజానాపై భారం పడుతుంది. ఇప్పటి వరకూ ఎన్నో వేతన సంఘా లు వచ్చాయి. సిబ్బంది జీత భత్యాలకు సంబంధించి సిఫార్సులు చేసినప్పటికీ మోదీ ప్రభుత్వం ఎలాంటి తాత్సారానికి తావులేకుండా సిఫార్సుల అమలు విషయంలో నిర్ణయాత్మకంగానే వ్యవహరించిందని చెప్పాలి. ఏ వేతన సంఘం సిఫార్సులైనా పూర్తి స్థాయిలో అన్ని వర్గాలను సంతృప్తి పరిచే అవకాశం ఉండదు. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ..లక్ష కోట్ల భారాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ ఏడాది జనవరి నుంచే జీతాల పెంపునిర్ణయాన్ని అమలు చేయాలని సంకల్పించడం అన్నది కూడా రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న జనాకర్షక నిర్ణయంగానే కనిపిస్తోంది. అయితే గతంలో కూడా వేతన సంఘ సిఫార్సులను సమయానుకూలంగా అమలు చేసినప్పటికీ వాటి వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందినప్పటికీ రాజకీయంగా అప్పటి అధికార పార్టీలకు లబ్ధి చేకూరిన దాఖలాలు లేవన్నది వాస్త వం. వేతన సిఫార్సులు వల్ల ప్రయోజనం పొందే వారి సం ఖ్యను దృష్టిలో పెట్టుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థకు..మార్కెట్‌కు ఊతం లభిస్తుందనడంలో ఎ లాంటి సందేహం లేదు. ఇంత భారీ మొత్తం కోటికి పైగా కుటుంబాల చేతుల్లోకి రావడం అన్నది అనేక రకాలుగా మార్కె ట్ చోదక శక్తిగా పని చేయడానికి, వృద్ధి వేగం పెరగడానికి ఆస్కారం ఇచ్చేదే అవుతుంది. వస్తు సేవల వినియోగం, పొదుపు ప్రవృత్తి ఇనుమడించేందుకూ ఈ సిఫార్సులు దోహదం చేస్తాయనడంలోనూ సందే హం లేదు. పరోక్షంగా రియల్ ఎస్టేట్ కూడా ఊతాన్నందుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగాలే కాబట్టి కచ్చితంగా వృద్ధిపరమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
ఇవన్నీ సానుకూల అంశాలే అయినప్పటికీ ఇప్పటి వరకూ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చేపడుతూ వస్తున్న చర్యల సంగతేమిటన్న వాదనా వినిపిస్తోంది. లక్ష కోట్ల రూపాయలను వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా ఉద్యోగులకు అదించడమంటే..అది కచ్చితంగా ద్రవ్యోల్బణం పెచ్చరిల్లడానికి కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో వచ్చిన సిఫార్సులతో పోలిస్తే ఏడో వేతన సంఘం సిఫార్సులను అధ్యయనం చేసి కొన్ని మార్పులతో ప్రభుత్వ ప్యానల్ తెరపైకి తెచ్చిన తాజా నిర్ణయాల తీవ్రత తక్కువేనని చెప్పాలి. ఈ కారణంగానే దేశ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ద్రవ్యోల్బణం తీవ్రమవుతున్న నేపథ్యంలో వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సిఫార్సుల అమలు ద్వారా తమకు దారుణమైన అన్యాయం చేశారంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకూ సిద్ధమవుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఆర్థిక పరమైన అంశాల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి, ఏకాభిప్రాయం ఎప్పుడూ సాధ్యం కాదు కాబట్టి..తాజా సిఫార్సుల వల్ల ఇతమిత్థంగా ప్రభుత్వ పనితీరుకు, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఏ విధమైన అవకాశాలు ఉంటాయన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వం సక్రమంగా, సమర్థంగా పనిచేయాలంటే అందులో అంతర్భాగంగా ఉన్న సిబ్బందికి పనిపరంగా, జీతాల విషయంలోనూ ఎలాంటి లోటు లేని పరిస్థితులను పాదుగొలపాల్సి ఉంటుంది. అప్పుడే వారి సేవల ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ రథచక్రాలు సరైన వేగంతో పనిచేయడానికి, అన్ని రకాల పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి కావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల పనితీరు, వారి ఉత్పాదకతపై ఎలాంటి వత్తిడి లేకుండా.. అందుకు సంబంధించి పటిష్టమైన జవాబుదారీతనాన్ని పాదుగొల్పకుండా ఉదాసీన వైఖరిని అవలంబిస్తే మాత్రం ఒనగూడే ప్రయోజనం పూజ్యం. పాలనాపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది పనితీరూ వేగాన్ని పుంజుకున్నప్పుడే ఆర్థిక వ్యవస్థకు ఉద్దేశిత ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకు ఆస్కారం లేని విధానాలనే ఆనుసరిస్తే..వాటినే ప్రామాణికంగా పరిగణిస్తే మాత్రం వృధా ప్రయాసే అవుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏ అంశమైనా పాలకులకు అత్యంత సంక్లిష్టమైనదే అవుతుంది. ముఖ్యంగా వేతన సంఘం సిఫార్సుల అమలు విషయంలో తాత్సారం జరిగినా..లేదా వాటిలో కోతలు పడ్డా వీరి నుంచి వ్యక్తమయ్యే పరిణామాల చాలా తీవ్రంగానే ఉంటాయి. అందుకే ఉద్యోగుల నుంచి వచ్చే వత్తిడిని తట్టుకునే పరిస్థితి ప్రభుత్వాలకు ఉండదు కాబట్టి వేతన సంఘం సిఫార్సులను కొంత జాప్యం జరిగినా అమలు చేస్తూనే వచ్చాయి. అయితే ఏడో వేతన సంఘం సిఫార్సుల్లో ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వ పనితీరును మెరుగు పరిచేందుకు ఏ విధమైన చర్య లు తీసుకోవాలి, వాటి అమలుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలు ఏమిటన్న దానిపై స్పష్టమైన సూచనలు చేయడం. బ్యూరోక్రసీ పెత్తనాన్ని తగ్గిస్తూ ఉద్యోగుల నుంచి గరిష్ఠ స్థాయి లో పనిని రాబట్టేందుకూ కమిషన్ కొన్ని సూచనలతో మార్గ నిర్దేశన చేసింది. గతంలో వచ్చిన కమిషన్లు వేతన పెంపుదలతో పాటు ఉద్యోగుల పనితీరును మెరుగు పరిచేందుకు ఎన్నో సలహాలు ఇచ్చినా, సూచనలు చేసినా ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. సిబ్బందికి జీతాలైతే పెరిగాయి తప్ప వారి నుంచి ఆశించిన రీతిలో ఉత్పాదకతను పొందే అవకాశమే లేకుండా పోయింది. ఉద్యోగులు తగిన విధంగా పని చేయడానికి, అనుకున్న స్థాయిలో ఉత్పాదకతను వారు అందించలేక పోవడానికి దారితీస్తున్న కారణాలపై దృష్టి పెట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటి వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. అసలే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు, పనుల వేగంలో మాంద్యంతో పాటు భారీ వేతన పెంపు వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింతగా ఆర్థిక వ్యవస్థను సంక్లిష్టమయం చేసే అవకాశాలు ఉండవని చెప్పలేం. లక్ష కోట్ల భారాన్ని మోయడానికి దాదాపుగా అన్ని రకాల ఏర్పాట్లూ జరిగిపోయాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీన్ని ఎవరు మీద వేసుకున్నా..దాని తీవ్రత భరించలేనిదేననడంలో ఎలాంటి సందేహం లేదు. విత్తపరమైన లోటును గణనీయంగా తగ్గించుకోవాలంటే అందుకు వీలు కల్పించే విధంగా మూల ధన వ్యయాన్ని తగ్గించుకోవడం అత్యంత అవసరం. లేని పక్షంలో దీని వల్ల ఆర్థిక వృద్ధికే విఘాతం కలుగుతుందన్నదీ వాస్తవం. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయకుండా ఉద్యోగులకు జీతాలు పెంచినంత మాత్రాన వాటిలో ప్రధాన భాగం అధిక ధరలకు హరించుకు పోతుందన్నదీ వాస్తవమే. దీని వల్ల వృద్థిపరమైన ప్రయోజనం కలిగినా మొత్తం మీద ఆర్థిక వ్యవస్థకు ఎంత ఊతం లభిస్తుందన్నది ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపైనా, ఉద్యోగుల ఉంచి రాబట్టే ఉత్పాదకతపైనే ఆధార పడి ఉంటుంది.