మెయన్ ఫీచర్

భారమైన బాల్యం..చేష్టలుడిగిన రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దలు బడికి-పిల్లలు పనికి అని అంటే, వ్యాసకర్తకు పిచ్చెక్కిందని అనుకోవచ్చు. సర్వశిక్షా అభియాన్ 2003 నుంచి దీనికి విలోమమైన నినాదాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చింది తెలిసిందే. ఈ నినాదానికి దశాబ్దన్నరకాలం పడితే, బ్రిటీషు కాలంనుంచే పోరు సలపగా, విద్య ఓ హక్కుగా మారడానికై వంద సంవత్సరాలు పట్టింది. చట్టంగా రూపొందడానికి ఏడు సంవత్సరాలు తీసుకుంటే, అమలుకు నిర్దేశించడానికై ఏడాది పట్టింది. ఇలా అమలులోకి వచ్చిన విద్యాహక్కు చట్టానికి ఆరు సంవత్సరాలు కావస్తున్నా, దీని ఆచరణ కాని, చర్యలుగాని, సాధారణ ప్రజలకు కాదు, ఈ చట్టాన్ని చేసిన పార్లమెంటుకే పట్టని దేశంలో వున్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పిల్లల బతుకులేమన్నా మారాయా, మారే పరిస్థితి ఉందా..అంతా అగమ్యగోచరమే.
నిన్నటిదాకా బాలకార్మిక వ్యవస్థ గూర్చి, దీని నిర్మూలనగూర్చి, పిల్లకాయల రక్షణ గూర్చి బాగా మాట్లాడేవారం. జీవించే హక్కు, విద్యను పొందే హక్కు, పరిరక్షణ హక్కు, భాగస్వామ్యహక్కు, ఆరోగ్యరక్షణ హక్కు అంటూ యూనిసెఫ్ నిర్దేశించిన 42 అంతర్జాతీయ అధికరణల ఒడంబడికపై భారత ప్రభుత్వం 1993లోనే సంతకం చేసింది. మానహక్కులు విశ్వవ్యాపితమవుతున్న తరుణంలో పిల్లల హక్కులు ఓ కేంద్ర బిందువుగా నిలవడం గమనించాలి. ఇదే కాలంలో ప్రపంచంలోనే అత్యధిక బాలకార్మికులున్న దేశంగా, అధికశాతం పిల్లలు బడిముఖం చూడని పిల్లలుగల దేశంగా గుర్తించబడింది. దీంతోపాటే, దారిద్య్ర రేఖ కింద దాదాపు 40శాతం జనా భా గల రాజ్యాంగా కూడా గుర్తింపుపొందింది.
ప్రతి బడ్జెట్‌లో బడిపేరున, బాలకార్మికుల సంక్షేమం పేరున, బడుగు వర్గాల బాగుకంటూ కోట్లాది రూపాయలు కేటాయించడం జరుగుతూనే ఉన్నది. ఏ బడ్జెట్‌కూడా గతంలో మంజూరు చేసిన నిధులు ఏమేరకు ఖర్చు చేయబడినాయో, వేలెత్తి చూపినా పట్టించుకోని ప్రజాస్వామ్య వ్యవస్థ. పైగా ప్రతీ సంవత్సం జిడిపి పెరుగుతున్నదని రెండంకెలు దాటబోతున్నదని, ఆర్థికాభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో బలమైన దేశంగా రూపొందుతున్నదని ఒక్క రఘురాం రాజన్ లాంటి ఆర్‌బిఐ గవర్నర్ తప్ప మిగతా గవర్నర్లు, ఆర్థిక మంత్రులు చెప్పడం ఓ అలవాటుగా మారింది. క్షేత్రస్థాయి వాస్తవాలకు, లెక్కపెడుతున్న గణాంకాలకు లంకె ఎప్పుడూ కుదరదు. మేమే నిజమైన అభివృద్ధి కాముకులమంటూ ప్రతి పాలకులు చెప్పుకుంటున్నారు. నిజంగానే అభివృద్ధి కాముకులమంటూ ప్రతి పాలకులు చెప్పుకుంటున్నారు. నిజంగానే అభివృద్ధి జరిగితే ఉపాధి లేనివాడే కాదు, ఉన్న ఉపాధిని ఎందుకు కోల్పోతున్నారో, జీవన ప్రమాణాలు ఎందుకు దిగజారుతున్నాయో పాఠశాల ముఖం చూడని బాలలు ఇంకా ఎందుకు ఉంటున్నారో, వైద్యసేవలకు నోచుకోని ప్రజానీకం ఎందుకు చస్తున్నారో, దేశానికి వెనె్నముకలైన రైతులే ఎందుకు ఉరితాళ్లకు, పురుగు మందుల్ని వెతుక్కుంటున్నారో, చివరికి విద్యార్థులు ఆత్మహత్యలకు ఎందుకు ఒడిగడుతున్నారో జవాబు దొరకని వ్యవస్థ రోజురోజుకు ఎందుకు బలోపేతం అవుతున్నదో చెప్పలేని స్థితి.
ఓరైతు లేదా కుటుంబ ఆర్థిక ఆధారం ఉన్నఫళంగా ఆత్మహత్య చేసుకుంటే, సంబధిత కుటుంబ మానసిక స్థితి ఏమాత్రం అం చనా వేసినా అ లక్షలాది రైతుల ఆత్మహత్యలకు ఎప్పుడో అడ్డుకట్టపడేది. గత సంవత్సరం జనవరి నుంచి ఒక్క మరఠ్వాడా ప్రాంతంలోనే ఆత్మహత్య చేసుకున్న రైతు లు 1500 పైచిలుకు కాగా, వీధిన పడిన పిల్లల సంఖ్య దాదాపు 3,500 మంది. అలాగే గత రెండు సంవత్సరాలుగా తెలంగాణలో చోటు చేసుకున్న రైతు ఆత్మహత్యలు రెండు వేలకు చేరుకోగా, వీరి కుంటుంబాలు పిల్లలు దాదాపు నాలుగువేలు. ఇలాంటి స్థితిలో పిల్లలు బడికి పోగలుగుతారా, అనేది ఒక ప్రశ్న కాగా, పెరిగిన పిల్లలు విధిగా తల్లికి చేదోడుగా నిలవాల్సిందే. దేశవ్యాపితంగా ఇలాంటి పిల్లలు ప్రతీ సంవత్సరం వేలల్లో వుంటున్నా, వీటి రక్షణ, చదువు బాధ్యతను ఏ ప్రభుత్వం బాధ్యతతో పట్టించుకోలేదు. కొన్ని కేసుల్ని మాత్రం గుర్తించి నష్టపరిహారం ఇవ్వడం తప్ప, అదనంగా చేసింది ఏమీ లేదు. ఇక నష్టపరిహారం రాని కుటుంబాల పరిస్థితి ఎంతో ఊహించడం కష్టమే. ఇలా అనాథ గా మారిన మహారాష్ట్ర గ్రామంలోని ఓ కుటుంబ స్ర్తి సర్రోగసికి ఒప్పుకున్న సంఘటనమై మరాఠీలో ఓ సినిమా కూడా వచ్చింది.
బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఈ మధ్యన ఓ సివిల్ సొసైటీ జరిపిన సర్వే ప్రకారం కరువు కాటకాలకు తోడు ఉపాధి లేకపోవడంతో 24శాతం కుటుంబాలు తమ పిల్లల్ని కూలీలుగా మార్చగా, 22 శాతం కుటుంబాలు పిల్లల్ని బడిమాన్పించి పనులకు పంపించి బతుకు బండిని లాగుతున్నట్లు తేలింది. ఇలాంటి కథనాలకు ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్టల్రకు పుట్టినిల్లే. ఇక అదృశ్యమవుతున్న పిల్లలు, అమ్మబడుతున్న పెరిగిన ఆడపిల్లలు, అత్యాచారానికి గురవుతున్న పిల్లలు జాతీయ నేర పరిశోధనా సంస్థ గణాంకాల్లోకి రాని కథనాలే అనేకం.
ఈ మధ్యన బచ్‌పన్ బచావో ఆందోళన (బిబిఏ) సంస్థ, దక్షిణ బిహార్, ఉత్తర జార్ఖండ్ మైనింగ్ ప్రాంతాల్లో ఓ సర్వే నిర్వహించగా దాదాపు 500 గ్రామాల్లోని 60 వేల మంది పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి మైకా మైనింగ్‌లో పని చేసి పొట్ట నింపుకుంటున్నట్టు తేలింది. పైగా ఈ బాలలందరికి ఆస్తమా, క్షయ వ్యాధి సోకినట్లు ఈ సంస్థ గుర్తించింది. ఇలాంటి పరిస్థితే శివకాశిలో, మీరట్ కార్పెట్ పరిశ్రమల్లో, ఇటుకబట్టీ తయారీ కేంద్రాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, బీడీ పరిశ్రమల్లో సర్వసాధారణం గా కనబతుతూనే వుంటున్నది. స్వయాన రాష్టప్రతి భవన్ ముందుగల విజయపథ్‌లోని ఇండియాగేట్ దగ్గర రేపటితరం పొట్టపోసుకోవడానికి ఎలా పాటుపడతారో ఏ సాయంత్రమైనా ప్రత్యక్షంగా చూడవచ్చు. పార్లమెంటు సాక్షిగా దేశ ప్రథమ పౌరుడి సాక్షిగా, దేశ అత్యున్నత న్యాయస్థానం సాక్షిగా తరతరాలుగా ఈతంతు జరుగుతుంటే, చట్టాలను ఉటంకించి తప్పించుకునే వ్యవస్థలో బతకడం ఓ విచిత్రం కాదా!
ఇక పట్టణ ప్రాంతాల్లో 90 శాతానికి పైగా హోటళ్లలో చిల్లర కొట్టు దుకాణల్లో, బట్టల, షాపింగ్ మాల్స్‌లో పిల్లల చేతులు తగలకుండా వినియోగదారుడి చేతుల్లోకి ఏ వస్తువు రాదు. అయినా, ‘మా సంస్థలో బాల కార్మికులు లేరు..’ అంటూ బయట ప్రకటనలు కనబడతాయి. బాలకార్మిక చట్టాల్ని చూసే యంత్రాంగానికి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అని అంటున్న సర్వశిక్ష అభియాన్‌కు లోపలి విషయాలు ఏనాడూ పట్టవు.
అయ్యో, ఇలా పిల్లలంతా బాలకార్మికులుగా, రోడ్లపై కాగితాల్ని ఏరుకునే పిల్లలుగా, బిక్షాటన చేసేవారుగా అన్యాయానికి గురౌతునన్నారని భావించేయడం, భిన్నం గా పాఠశాలకు పంపబడుతున్న బాలల భవిష్యత్తు నాలుగ్గోడల మధ్యన ఎలా చిదిమివేయబడుతున్నదో ఎవరికీ పట్టడంలేదు. బడికి పోవడంతో వారు విద్యను పొందే హక్కును అనుభవిస్తున్నారని భ్రమించేయడం, బడిలోవారు పడే బాధల్ని ఏకోశానా పట్టించుకోకపోవడంలేదు. ఏ సామాజిక సర్వే ఈ కోణంలో జరగలేదు. ఓ మనసున్న సంస్థ నేపథ్యంలో సర్వే జరిపితే, బడిపట్ల, తరగతి పట్ల, ఉపాధ్యాయుల పట్ల, చివరికి తల్లిదండ్రుల పట్ల అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించమని పిల్లల్ని కోరితే, పిల్లలు ఏం చెబుతారో ఊహించడం కష్టమే అయినా, హృదయమంటూ ఉన్న వారికి మాత్రం వారు చెప్పేది ఊహించగలరు. అయినా మన పాఠకులు పాతబడిపోయిన-పెద్దల్ని గౌరవించవలెను, గురువులను పూజించవలెను..అనే గోడమీది రాతలతో నడుస్తున్నాయి తప్ప,పిల్లల్ని ప్రేమించండి, ద్వేషించకండి, వారు చెప్పేది కూడా వినండి, వారి భావాలకు ఆలోచనలకు రూపం ఇవ్వండి అనే మాటలతో నడిచే పాఠశాల దేశవ్యాపితంగా వెతికినా ఒక్కటి కానరాదు.
పిల్లల వీపులపై ఎంత బరువు మోపితే అంత బాగా చదువులు అబ్బుతాయని నమ్మే తల్లిదండ్రుల్ని సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాలు, విద్యారంగాన్ని నిర్దేశిస్తుంటే, ఇదే నిజమైన పెడగాజీ అని సూడో మేధావి వర్గం, ఉపాధ్యాయవర్గం, చివరికి ఉపాధ్యాయ సంఘాలు, ఇవేవీ పట్టని విద్యార్థి సంఘాలు నమ్ముతుంటే, పిల్లలు సమిధలుగా మారడంలో వింతలేదు. ప్రభుత్వాలది ఇదే బాట. విద్యాశాఖ మంత్రులకు, ‘కొఠారీ కమిషన్ రిపోర్టు కాని, విద్యాహక్కుల చట్టం గాని, పుస్తకాల భారం వద్దన్న యశ్‌పాల్ కమిటీ నివేదిక గాని, పుస్తకాల భారమే కాదు-అందులోని పాఠాల తీరు తెన్నుల గూర్చి వివరించిన 2005 జాతీయ కరికులం గాని తెలుసా అంటే-అన్నీ తెలవాల్సిన అవసరం వుందా, ఎన్నికల్లో గెలిచింది సరిపోదా అనే సమాధానం వస్తుంది. విద్యావిధానం గూర్చి తెలిసిన ఓ ముఖ్యమంత్రి గాని, ఓ ప్రధానమంత్రిగాని, ఇప్పటికీ ఈ దేశంలో కానరాకపోవడం ఈ దేశబాలలు చేసుకున్న నేరమే!
ఈ నేరాలకు శిక్షగా, ఇంటిపని పేరున, ఇంపోజిషన్ పేరున, గోడకుర్చీల పేరున, ఒంటికాలిపై నిలబడడం పేరున, తరగతి బయట కాపలా పేరున అనుభవిస్తూనే ఉన్నారు. ఇక ఆడపిల్లలైతే చిదమడం, శరీరాన్ని తాకి పునకడం, వెకిలిగా నవ్వడం లాంటివి రోజూ పీడకల లాంటివే. బ్రేకింగ్ త్రో అనే ఓ స్వచ్ఛంద సంస్థ కర్నాటక, యూపి, జార్ఖండ్, బిహార్, హర్యానా, ఢిల్లీలో 900 మంది విద్యార్థినుల అభిప్రాయాల్ని సేకరించగా 52 శాతం పైన పేర్కొన్న హింసకు తరగతి గదుల్లోనే గురౌతున్నట్టు చెప్పగా, 32 శాతం బడి బయట ఆవరణలో మగపిల్లలచేతే కాదు, చివరికి కొందరి మగ టీచర్ల చేతనే ఇబ్బందులకు గురౌతున్నట్టు తెలిపారు. ఇలా ఇంటా, బయటా, పాఠశాల, కళాశాల, పబ్లిక్ స్థలా ల్లో మనం గౌరవించాలనుకుంటున్న అమ్మాయిలు అవమానాల్ని ఎదుర్కొంటుంటే, మన గొంతులు మూగబోతున్నాయి.
బడి బయట పిల్లల గూర్చి పట్టించుకుంటున్న సంస్థలు బడిలోని పిల్లల హక్కుల గూర్చి, రాజ్యం యొక్క బాధ్యతల గూర్చి కూడా పట్టించుకుంటే, పాఠశాలలు, ఆనందదాయకంగా మారుతాయి. ఇవో పవిత్ర కేంద్రాలని భ్రమపడినంతకాలం విషాదాల్ని కూడా చవి చూడాల్సిందే. విషాదాలంటే కేవలం విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలే కాదు-విద్యనార్జించి, బయటి ప్రపంచంలో వీరు వచ్చి అందించే సేవల పరంగా కూడా-ఇవన్నీ జరగాలంటే, పైన పేర్కొన్నట్టు, చదవాల్సింది ముందుగా పెద్దలే

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162