మెయన్ ఫీచర్

ఉగ్రవాదుల గుప్పిట్లో ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నగరం ఐసిస్ గుప్పెట్లోకి వెళ్లిందనే విషయం ఇవ్వాళ కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వచ్చిందని అనుకోవటం పొరపాటు. 2015వ సంవత్సరం నిక్కీ జోసఫ్ అనే ఐసిస్ ఉగ్రవాద నాయకురాలిని అరెస్టుచేసినప్పుడే ఈ విషయం బహిర్గతమయింది. ఇంటిలిజెన్స్ వర్గాలు హైదరాబాద్ పాతబస్తీలో ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ సెంటర్ ఉందని హెచ్చరించినా కాంగ్రెసు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కారణం పాతబస్తీలోని ముప్పది లక్షల మంది ఓట్లు చేజారిపోతాయని భయం. 29 జూన్ 2016లో ఎన్‌ఐఎ- ఐ.జి. సంజీవ్‌కుమార్ ఐఎస్‌ఐ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీరి సంఖ్య 13. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫైరింగ్ శిక్షణా శిబిరం ఉంది. అక్కడ వీరు ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. తలాబ్‌కట్ట, భవానీనగర్, బాబానగర్, మొగల్‌పుర, మీర్‌చౌక్, చాంద్రాయణగుట్ట, బార్‌కాస్ వంటి ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో నిర్వహించిన సోదాలల్లో ఆయుధాలతో సహా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. మహమ్మద్ ఇలియాస్ ఎస్థాని, మహమ్మద్ ఇబ్రహీం ఎస్థాని, ఆల్మోడి అబ్దుల్లా బిన్‌మహమ్మద్, అల్‌మదాని, అబిక్, ఇర్ఫాన్ ముజఫర్ ప్రభృతులు ఐసిస్ క్రియాశీల కార్యకర్తలు. వీరిలో ఇలియాస్, ఇబ్రహీం అన్నదమ్ములు. అంటే ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు బిటెక్ చదివి ఇంటర్‌నెట్ కేఫ్ నడుపుతున్నారు. ఇర్ఫాన్ కర్ణాటకకు చెందిన ఉగ్రవాది.
పాతబస్తీలోని పంచమహల్‌కు చెందిన అహ్మద్ ఓ బట్టల షాపులో గుమాస్తా. ముజఫర్ హుస్సేన్ మోటార్ మెకానిక్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని పని ఫేస్‌బుక్‌లో ఐసిస్ జెండాలను రెపరెపలాడించటం. గణేశ ఉత్సవాలు వంటి భారీ ఊరేగింపులపై దాడిచేసి విధ్వంసాన్ని సృష్టించాలని వీరు కుట్ర పన్నినట్లు ఆరోపణలు. దీనికి ఇత్తెహాదుల్ మజ్లీస్ రజాకార్ నాయకులు అక్బరుద్దీన్, అసదుద్దీన్‌లు ఏం సమాధానం చెపుతారు? మెడమీద కత్తి పెట్టినాసరే నేను భారత్ మాతాకీ జై అనను- అని అసదుద్దీన్ ప్రకటించాడు. ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ లక్ష్మీదేవి ఎవరు? హిందువులకు పూటకొక కొత్త దేవత పుట్టుకొస్తున్నది అని అక్బరుద్దీన్ చేసిన చరిత్రాత్మక ప్రసంగం గుర్తుండే ఉంటుంది. 1948నాటి పరిస్థితులు తెలంగాణలో పునరావృత్తం అవుతున్నాయని అనిపిస్తున్నది. అప్పుడు దొరలు- కాశిం రజ్వీ సైనికులు ఒకటి అయినారు. సామాన్య ప్రజలు కాందిశీకులై పారిపోయారు. పాకిస్తాన్‌లో 300 మిలియన్ డాలర్లతో జీహాదీ యూనివర్సిటీ నడుస్తున్న సంగతి ఎందరికి తెలుసు? తిరుపతి సమీపంలో ఇస్లామిక్ యూనివర్సిటీ నెలకొల్పే ప్రయత్నం జరిగింది. దీనిని తిరుపతి ప్రజలు ప్రతిఘటించారు. కాశ్మీరులోని శ్రీనగర్ సమీపంలోని ఉగ్రవాద స్థావరాలనుండి 28 జూన్ 2016నాడు సిఆర్‌పిఎఫ్ జవాన్ల వాహనంపై జరిగిన దాడిలో 8 మంది జవాన్లు హతులైనారు. ఈ పని చేసింది తామేనని లష్కరే తోయిబా ప్రకటించింది. ఇదే సంఘటనలు జరుగుతున్న సమయంలో టర్కీలోని ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో యాభైమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ పని చేసింది తామేనని ఐసిస్ సంస్థ గర్వంగా ప్రకటించుకుంది. దీనికి సోనియాగాంధీ నరేంద్రమోదీలు ఏం సమాధానం చెపుతారు? పత్రికా విలేఖరులు ఇండియాలోని పాక్ రాయబారి ఖాసిన్‌ను కలిసి శ్రీనగర్‌పై దాడి ప్రస్తావిస్తే ఇది రంజాన్ విందు ఇఫ్తార్‌ను ఆస్వాదించవలసిన సమయం.. ఇలాంటివేళ రాజకీయాలు మాట్లాడుకోవటం ఎందుకు? అని చిరునవ్వుతో సమాధానం చెప్పారు. పాకిస్తాన్ అనే దేశాన్ని సృష్టించింది కాంగ్రెసువారే. విభజన అనంతరం 54 కోట్లు పాకిస్తాన్‌కు నష్టపరిహారం ఇవ్వాలని మహాత్మాగాంధీ నిరశన వ్రతం చేయటం గుర్తుండే ఉంటుంది. మత విశ్వాసాల దృష్ట్యా నేను ముస్లిమును అని నెహ్రూ ప్రకటించారు. ఇండియాలో హిందువుగా పుట్టడంకన్నా గాడిదగా పుట్టడం మంచిది అని మోతీలాల్ నెహ్రూ అన్నారు. 1975లో 18 హిందూ సంస్థలను ఇందిరాగాంధీ నిర్ధాక్షిణ్యంగా నిషేధించింది. హిందూ ఉగ్రవాదాన్ని అరికట్టండి అంటూ సుశీల్‌కుమార్ షిండే అనే షోలాపూర్ కాంగ్రెసు నాయకుడు ఒక కొత్త పదాన్ని సృష్టించాడు. కారణం ముస్లిం ఓట్లు హోల్‌సేల్‌గా తమకు పడుతాయనే కోరిక. అమెరికాలోని ఓర్ల్లాండ్‌లోని గే క్లబ్‌పై దాడిచేసి ముప్పై మందిని చంపిన ఉగ్రవాది ఇస్లామాబాదుకు చెందినవాడు. అంటే పాకిస్తాన్ ఒక ఉగ్రవాదం దేశంగా మారింది. దానికి చైనానుండి సంపూర్ణ మద్ధతు లభిస్తున్నది. అంటే ఇండియా చక్రబంధంలో ఇరుక్కొన్నది. దక్షిణాన హైదరాబాద్ ఉత్తరాన నేపాల్ పడమట ఇస్లామాబాద్ తూర్పున ఢాకాలనుండి ఏకకాలంలో భారత్ పై దండయాత్ర చేయాలని పాక్ వ్యూహరచన చేసింది. అందుకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఐసిస్,ఐఎస్‌ఐ ఇత్తేహాదుల్ మజ్లీస్, సిమీ వంటి అనేక పేర్లతో ఉగ్రవాదులు దాడికి సిద్ధంగా ఉన్నారు.
హైదరాబాద్‌లో దొరికిన ఉగ్రవాదుల నుండి 9 ఎంఎం పిస్టల్స్, ఎయిర్‌గన్స్, నగదు, బుల్లెట్లతోబాటు 3 లాప్‌టాప్‌లు, 23 సెల్‌ఫోన్లు, హైడ్రోజన్ పెరాక్సయిడ్ యూరియా బాంబులు తయారీకి ఉపయోగించే ఇతర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలాంటి బాంబుల తయారీ కేంద్రం ఇదొక్కటే కాదు. హైదరాబాద్‌లో వీరు నడిపే సైబర్‌కేఫ్‌లకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవు. ఇక్కడ సిసి కెమెరాలు లేవు. కస్టమర్లు తమ ఐడికార్డుల వివరాలు రిజిష్టర్‌లో వ్రాయనక్కరలేదు. ఇక్కడినుండి ఈ ఉగ్రవాదులకు అంతర్జాతీయ ఉగ్రవాదులతో ఇంటర్‌నెట్ ద్వారా ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సైబర్‌కేఫ్‌కు వచ్చే ప్రతి కస్టమర్ పేరు - అడ్రసు వచ్చిన పని అతడు దర్శించబోయే స్థలాల వంటివి రిజిస్టర్‌లో వ్రాయాలి. అనుమానితుడు ఎవరైనా ఉంటే ఆ సంగతి వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ఈ మార్గదర్శకాలు 2008-2013లలో హోంశాఖ జారీచేసింది. ఐతే వీటిని ఈ హైదరాబాద్ సైఫర్ కేఫ్‌లు పట్టించుకోవటం లేదు. కారణం ఇవి ఉగ్రవాద స్థావవరాలు కాబట్టి- తెలంగాణలోను హైదరాబాద్‌లోను ఉన్న ప్రముఖ దేవాలయాలను టార్గెట్ చేయాలని వీరికి ఐసిస్ హెడ్ క్వార్టర్స్‌నుండి ఆదేశాలు వచ్చాయి. ముఖ్యంగా చార్మినార్ దగ్గర ఉన్న మహాలక్ష్మీ దేవాలయాన్ని నిర్మూలించాలని అనుకున్నారు. అలాగే బోనాల పండుగల సందర్భంగా విధ్వంసం సృష్టించాలని నిర్ణయించారు. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ విధ్వంసానికి రెక్కీ నిర్వహించినట్లు అరెస్టయిన ఉగ్రవాదులు చర్లపల్లి జైలులో చెప్పారు. ఇంటరాగేషన్‌లో వారి నుండి విలువైన సమాచారం లభించింది. 2015లో ఆయుధాలు కొనుగోలుకోసం హబీబ్- ఇబ్రహీంలు, అజ్మీర్ వెళ్లారు. ఇటీవల నందన్ నుండి ఆయుధాలు సేకరించారు.
ఇస్లాంబుల్‌లో జరిగిన ఐసిస్ దాడిలో మృతిచెందిన వారిలో ఉజ్బెకిస్తాన్, సౌదీఅరేబియా, టునీషిమా, ఉక్రెయిన్, జోర్డాన్, చైనావంటి వివిధ దేశాలకు చెందిన పౌరులున్నారు. అంటే ఈ దేశాలన్నింటికీ ఇప్పుడు ఉగ్రవాద వేడి ఏమిటో తెలిసి వచ్చింది. చైనా పౌరులు మరణించినా చైనా పాక్ ఉగ్రవాదులకు మద్ధతునిస్తూనే ఉంటుంది. చనిపోయిన వారిలో కుర్దులు, ఇజ్రాయిలీలు, యూదులు ఉంటే ఐసిస్‌కు సంతోషం. కాని ముస్లిములు పెద్ద సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్ మక్కా మసీదు, గోకుల్ ఛాట్ భండార్, దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయాలవద్ద చనిపోయిన వారంతా అట్టడుగు వర్గాలకు చెందినవారే. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు పట్టుబడినప్పుడు రాష్ట్ర హోంమంత్రి అమెరికాలో ఉన్నారు. ‘్భయపడవద్దు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని వారు అక్కడి నుండి సందేశం పంపారు. ఈవే కాదు పుకార్లను నమ్మవద్దు అంటూ కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రజలను కోరారు. చర్యలు తీసుకొని ప్రజల మానప్రాణాలు కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు పట్టుబడింది జైలులో ఉన్నది ఐదుగురు మాత్రమే. మిగిలిన వారి సంగతి ఏమిటి?
పాకిస్తాన్‌లోని ఒక స్కూలులో చదువుకుంటున్న వందలాది చిన్నారులను తాలిబన్ ఉగ్రవాదులు ఎందుకు చంపినట్లు? ఈ పిల్లల తల్లిదండ్రుల మీద కోపం వుంటే అది రణరంగంలో ముఖాముఖీ తేల్చుకోవచ్చుకదా! అంటే వీరు దేవుని కోసం ధర్మరాజ్యం కోసం పోరాడుతున్నాము అని చెప్పటం అబద్ధం. 30, జూన్ 2016 నాడు కాబూల్‌లో రంజాన్ పవిత్ర దినాల కోసం వెళ్తున్న నలభైమంది సైనికులను తాలిబన్లు ఎందుకు చంపారు? వందలాది మంది ఈ వరుస ప్రేలుళ్లల్లో గాయపడ్డారు. ఇలాంటి అమాననీయ సంఘటనలను ప్రపంచంలోని ఏ దేశమూ సమర్థించదు ఒక్క చైనా - పాకిస్తాన్‌లు తప్ప.’’
హైదరాబాద్, ముంబయి వంటి నగరాలు ఇప్పుడు ఉగ్రవాదుల గుప్పెట్లో ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఏమైనా జరుగవచ్చు. అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రులా? లేక కేంద్ర ప్రభుత్వమా?! వీళ్ళ ఓట్లకోసం అరవై సంవత్సరాలుగా పాముకు పాలుపోసి పెంచినట్లు పెంచి పోషించిన నెహ్రూగాంధీ వంశమా?? హైదరాబాద్‌లో ఉగ్రవాదులు పట్టుబడితే వారికి న్యాయ (లీగల్) పరమైన సహాయం అందజేస్తామని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడం ఏమిటి? 2, జూలై ధాకాలో ఓ రెస్టారెంటుపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో భారతీయులతో సహా ఎందరో మరణించారు. ఈ దుర్మార్గానికి ముగింపు లేదా?
బాగ్దాద్‌లో జూలై 3, 2016నాడు ఐసిస్ ప్రేరేపిత సుస్నీ ఉగ్రవాదులు షియా తెగకు చెందిన 80 మందిని కారుబాంబులతో కాల్చి చంపారు. వందలాది మంది వికలాంగులైనారు. ఐసిస్ సానుభూతిపరులైన అసదుద్దీన్ ఓవైసీ వంటి వారిని ఎందుకు అరెస్టు చేయలేదని హైదరాబాద్ ఎంఎల్‌ఎ రాజ్‌సింగ్ ప్రశ్నించారు. ప్రపంచానికి ఇది పరీక్షా సమయం.

- ముదిగొండ శివ ప్రసాద్