ఉత్తరాయణం

అప్పటి విధానాలు ఇప్పుడేం పనికొస్తాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండిగఢ్‌లో జరిగిన ఒక సదస్సులో ‘‘నెహ్రూ విదేశీ విధానం నేటికీ సరిపోతుంది’’ అని రాష్టప్రతి చెప్పడం ఆశ్చర్యమే. ఎందుకంటే నెహ్రూ జీవిత కాలంలోనే అవి బెడిసి కొట్టాయి! అందరూ వద్దని చెప్పినా ద్వైపాక్షిక అంశం కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి నివేదించారు నెహ్రూ. అందువల్లనే ఆ సమస్య రావణకాష్ఠంలా ఇంకా రాజుకుంటూనే ఉంది. అగ్రరాజ్యాలకు సమాన దూరం అంటూ అలీన విధానాన్ని నెహ్రూ నిర్వచించినా రష్యా చైనాల వైపు మొగ్గు చూపి అమెరికాకు కోపం తెప్పించారు. పంచశీల, హిందీ చీనీ భాయి భాయి అంటూ చైనాని కౌగలించుకుంటే అతగాడు వెన్నుపోటు పొడిచాడు. ఆయన విధానాలు నేటికి సరిపోతాయా?!
- శాండి, కాకినాడ
శోకించిన తెలుగుతల్లి హృదయం
సమీప భవిష్యత్తులో 6 కోట్లను చేరే ఆంధ్రులకు గర్వకారణం అయ్యే విధంగా అమరావతి నగర శంకుస్థాపనను ప్రభుత్వం యధోచితంగా, సంప్రదాయ బద్ధంగా చేయడం ఆనందకరం. హిందూ పద్ధతిన చేయవద్దని గగ్గోలుపెట్టిన ఒక అన్య మతస్థుడు, తన కేసును వెనక్కి తీసుకోడం ఎందుకో అర్థం కాలేదు! ఏ శక్తి ప్రభావితంతో కోర్టుకెళ్ళి వెనుకకు వచ్చెను? అమరావతి శిలాఫలకాన్ని మోదీగారు ఆవిష్కరిస్తుంటే 5కోట్ల ఆంధ్రులు కళ్ళు అప్పగించి చూస్తూ చాలా నిరాశకు గురైనారు. అన్య దేశ భాష, ఆంగ్లంలో శిలాఫలకం ఉండమే దానికి కారణం. కొద్దిమందికి తెలుగు అర్థంకాదనే సాకుతో వేలాది సంవత్సరాలు నిలిచి ఉంటే శిలాఫలకాన్ని ఆంగ్ల భాషలో వేసి ఆంధ్ర భాషను కించపరిచారు. అధికారులు అనాలోచితంగా చేసే కొన్ని పనులు ప్రభుత్వానికే చెడ్డపేరు తెస్తాయి. ఈ విషయంలో సిఎంగారు బాగా ఆలోచించాలని మనవి. తెలుగు పేరుగల పార్టీ రాష్ట్రానే్నలుతున్నపుడే తెలుగు భాషకు అవమానం జరుగుతుంటే భాషావేత్తలు వౌనంగా ఎందుకున్నారు? తెలుగు భాషా సంఘం పరంగా తీవ్రంగా కృషిచేసిన బుద్ధప్రసాద్‌గారైనా ఈ పొరపాటును ఎందుకుసరిచేసే ప్రయత్నం చేయలేదు?
- పి.ఆర్.వి.ఎస్.ఆచార్యులు, నక్కపల్లి
ఎవరికి అసహనం
‘అసహనం’పై నా భార్య దేశం విడిచి వెళ్ళిపోదామని అంది అని నటుడు అమీర్‌ఖాన్ ఆవేదన చెందడం హాస్యాస్పదంగా వుంది. మీ దేశం విడిచి పెడతానని అనేవాళ్ళని సగౌరవంగా వారు కోరుకునే పాక్‌కి పంపించి వేయాలి. ఈమధ్య ‘అసహనం’పై కువిమర్శలు, అసందర్భ వ్యాఖ్యానాలు చేయడం ద్వారా ప్రచారాలను పొందాలనుకొనే వారిలో షారుఖ్ తర్వాత అమీర్‌ఖాన్ చేరడంలో ఆశ్చర్యం ఏమీలేదు. వీరి అసలు నైజం బయటపడింది. ముంబై పేలుళ్ళు జరిగినప్పుడు ముజఫర్‌నగర్ హిందూ యువకులను దారుణ హత్యలు చేసినప్పుడు తస్లీమా నస్రీన్‌పై దాడి జరిగినప్పుడు, నేటికీ హిందువులను టార్గెట్‌చేసి తీవ్రవాదులు చంపుతున్నప్పుడు స్పందించని అమీర్‌ఖాన్ యిప్పుడు స్పందించడాన్ని అసహనంగా పరిగణించాలి. నిరభ్యంతరంగా దేశం విడిచి వెళ్ళండి. ఎవరూ ఆపరు.
- వేదుల జనార్దనరావు, వంటావారిగూడెం
హిందూ శ్మశానాలకు రక్షణ ఏది?
‘ఎంతటి వారికైనా మరణిస్తే ఆరు అడడుగుల భూమి అవసరం’ అని మన పెద్దలన్నది నగ్నసత్యం. కాని హిందూ శ్మశానాల పరిస్థితి నేడు ఎంతో శోచనీయం! మనిషిపోయి రోధిస్తుంటే ఇక శ్మశానవాటికకు పోవాలంటే అది ఒక శోకం! సరైన మార్గం లేక స్థలం అంతా ముళ్లచెట్లు నిండి ఆవరణలో తగిన నీటి వసతి గాని వర్షం వస్తే నిలవటానికి నీడ లేక చుట్టూ ప్రహరీ లేక అధ్వాన్నంగా వుంటున్నాయ. హిందూ శ్మశాన వాటికల గురించి పట్టించుకొనే నాథుడే లేడు. మరి ఈ దురవస్థలు తొలగేది ఎన్నడో?
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు

నిజమైన నివాళి అప్పుడే
ఇటీవల మళ్ళీ లాల్‌బహదూర్‌శాస్ర్తీగారి గురించి వినపడుతోంది. కాంగ్రెస్‌లో పుట్టి నిస్వార్థపరుడైన ప్రధాని అతనొక్కడే. కేవలం స్వార్థ రాజకీయాలకి బలైన నిస్వార్థ జీవి. అతనిని స్ఫూర్తిగా తీసుకొంటే రాజకీయాలలో కుళ్ళుండదు. దేశం పురోగామి కావడానికి స్ఫూర్తి, జైజవాన్- జైకిసాన్ నినాదం అతనిదే. అతని మృతిని మిస్టరీగా కాకుండా నిజాన్ని వెలికితీసి బయటపెడుతూ దోషులను శిక్షించగలిగితే అటువంటి మహానుభావునికి నిజంగా నివాళి అవుతుంది.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
వికృత చరిత్ర
ప్రాథమిక పాఠశాల నుండి పట్టా చదువుల వరకు భారతదేశ స్వాతంత్య్ర చరిత్ర ఇదేనని చదువుకున్నాం. కానీ చరిత్రకారులు అసలు చరిత్రను వక్రీకరించి రాసి నిజాన్ని భావి పౌరులకు తెలియకుండా చేసారు. అసలు మహాత్ముడు చదివితే కొన్ని వాస్తవాలు తెలిసాయి. భూమి సంపాదకులు శాస్ర్తీగారు రాసిన ఉన్నమాట (3.10.15)లో నేతాజి బ్రతికొస్తే తన పదవికే ఎసరు రాగలదనే భయంతో ప్రధాని నెహ్రూగారు నేతాజీకి సంబంధించిన ఫైళ్ళను, ఈయన బంధువులకు చేరే ఉత్తరాలను పూడ్చిపెట్టడమేగాక, రష్యానుండి నేతాజీని భారత్‌కు రప్పించుకునే ప్రయత్నమూ చేయలేదంటే స్వాతంత్ర