సంపాదకీయం

వైఫల్య పరాకాష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్‌లో జూలై ఒకటవ తేదీన భయంకర బీభత్స కాండ జరిపిన జిహాదీ ఉగ్రవాదులను ఉసిగొల్పిన జాకిర్ నాయిక్‌ను తక్షణం నిర్బంధించకపోవడం మన ప్రభుత్వ వైఫల్యం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక భోజన శాలపై దాడి చేసిన జిహాదీలు అనేకమందిని బందీలుగా పట్టుకున్నారు, ఆ తరువాత 28 మందిని చంపేశారు. ఢాకాలో ఈ ఘోరం జరిగిన నాలుగు రోజుల తరువాత ఈ జిహాదీ హంతకులను ఉసిగొల్పినవాడు జాకిర్ నాయిక్ అన్న వాస్తవం ధ్రువపడింది. బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు బీభత్సకాండను సృష్టించేవరకు జాకిర్ నాయిక్ పోకడలను మన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. జూలై నాలుగవ తేదీన జాకిర్ వ్యవహారం బట్టబయలైంది. అయిన తరువాత కూడ ఇతగాడిని నిర్బంధించాలా వద్దా అన్న మీమాంస కొనసాగుతోంది. ఈ మీమాంసకు మరో పేరు దర్యాప్తు..ఈ మీమాంస కొనసాగుతున్న సమయంలోనే జిహాదీలు ఏడవ తేదీన బంగ్లాదేశ్‌లో మళ్లీ దాడులు చేసారు. కిశోర్‌గంజ్‌లో నలుగురిని పొట్టన పెట్టుకున్నారు. నిజానికి ఈ మోసిన ఉగ్రవాదిని నిర్బంధించి న్యాయస్థానం ఎదుట నిలబెట్టకపోవడం ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైఫల్యం...ఈ వైఫల్యం భద్రతను పరిరక్షింపవలసిన నిఘా విభాగాల వారిది, బీభత్సకాండను నిరోధించవలసిన భద్రతా దళాలది, కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులది!! జిహాదీ హత్యాకాండను కొనసాగిస్తున్న పాత్రధారులను మాత్రమే పట్టించుకుంటున్న ప్రభుత్వాలు సూత్రధారుల గురించి ధ్యాస పెట్టకపోవడం ఈ వైఫల్య స్వభావం. మహారాష్ట్ర రాజధాని ముంబయి మ హానగరంలో వైద్యుని ము సుగు వేసుకున్న ఈ జాకిర్ నాయక్ ప్రచ్ఛన్న బీభత్సకారుడన్న వాస్తవం 2008లోనే ధ్రువపడింది. 2003 నాటి ముంబయి పేలుళ్లను దర్యాప్తు జరిపిన మహారాష్ట్ర పోలీసులు పదేళ్ల క్రితమే ఇతగాడి ప్రసంగాలను సమీక్షించి ఉన్నారు. దేశ విదేశాలలో పర్యటించిన ఇతగాడు హత్యలు చేయవలసిందిగా జిహాదీలకు పిలుపునిస్తూ చేసిన ప్రసంగాలు పుస్తక రూపంలో గ్రంథాలయాలలోకి చేరి ఉన్నాయి. అయినప్పటికీ పదేళ్లుగా అతగాడిని నిర్బంధించే ప్రయత్నం జరగలేదు. మహారాష్ట్ర పోలీసులు 2008లోనే జాకిర్ నాయిక్ ఉగ్రచర్యలను గురించి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నారట..ఆ సంగతి ఇప్పుడు బయటపడింది. అయినప్పటికీ ఈ ప్రచ్ఛన్న బీభత్సకారుడి కదలికలను గురించి కేంద్రం పట్టించుకోలేదు, ఎనిమిదేళ్లపాటు ఇలా స్వేచ్ఛగా ఉన్న జాకిర్ నాయిక్ సిమి, ఇండియన్ ముజాహిద్దీన్ జిహాదీ సంస్థలలో అనేకమంది కొత్త ఉగ్రవాదులను భర్తీ చేయగలిగాడు. యాసీన్ భత్కల్ వంటి భయంకర బీభత్సకారులు ఇతగాడి ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా స్ఫూర్తిని పొందారు. భాగ్యనగరంలోని దిల్‌సుక్‌నగర్‌లోను మహారాష్టల్రోను ఇతర చోట్ల పేలుళ్లు జరిపించి అమాయకుల ప్రాణాలను బలిగొన్న జిహాదీ తోడేళ్ల ముఠాలో భత్కల్ సోదరులు సభ్యులు. యాసిన్ భత్కల్ 2012లో పట్టుబడ్డాడు అయినప్పటికీ జాకిర్ నాయిక్ సూత్రధారిత్వం గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదు...మహారాష్ట్ర ప్రభుత్వం ఇంత జరిగిన తరువాత మళ్లీ దర్యాప్తు జరిపిస్తోందట! ధ్రువపడిన వాస్తవాల గురించి మళ్లీ దర్యాప్తు ఎందుకో? నిందితుణ్ని అరెస్టు చేయాలి కాని...
ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2008 నుంచి పట్టించుకోకపోవడం జాకిర్ నాయిక్‌కు గొప్ప ధైర్యాన్ని కలిగించిన విపరిణామం. అతగాడు అంతర్జాతీయ స్థాయి ప్రచ్ఛన్న బీభత్సకారుడిగా ఎదిగిపోవడానికి ఇది దోహదం చేసింది. అందువల్లనే ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం-ఐఎస్‌ఐఎస్-ముఠాలో కూడ జిహాదీలను చేర్చే కార్యక్రమాన్ని ఆరంభించాడు. ఇలా ఇతగాడు రూపొందించిన జిహాదీలు ఐఎస్‌ఐఎస్‌లో చేరిపోయి ఇరాక్ సిరియాలకు వెళ్లిపోయారు. ఇతర దేశాలకు వెళ్లారు. మళ్లీ తిరిగి వచ్చారు. యథేచ్ఛగా మనదేశం నుండి ఇతర దేశాలకు రాకపోకలు జరుపుతున్న జిహాదీలు పట్టుబడుతునే ఉన్నారు. అలా పట్టుబడినవారు జాకిర్ అనుచరులని ఇప్పుడు ప్రచారమైంది. పట్టుబడిన వారినుంచి వారిని నిర్బంధించిన వెంటనే భద్రతా నిర్వాహకులు ఎందుకని నిజాన్ని రాబట్టలేకపోయారు? జాకిర్ ఉసిగొల్పిన వారు ఐఎస్‌ఐఎస్ తరఫున విదేశాలలో పోరాడినట్టు ఇప్పుడు వెల్లడి కావడం విచిత్రం కాదా? పట్టుబడిన అరీబ్ మజీద్ అనేవాడు మరికొందరు తాము జాకిర్ నాయిక్ ద్వారా స్ఫూర్తిని పొందినట్టు ప్రభుత్వ పరిశోధకులకు వెల్లడించారట! గతంలోనే వెల్లడించారా? బంగ్లాదేశ్ ఘటనల తర్వాత వెల్లడించారా? ఉత్తరప్రదేశ్‌ప్రభుత్వం జాకిర్ సభలను 2008లోనే నిషేధించిందట. ఫలితంగా లక్నో కాన్పూర్ అలహాబాద్ నగరాలలో జాకిర్ తలపెట్టిన సభా కార్యక్రమాలు రద్దయినాయి. ఎందుకు ఇతనిపై నిషేధం విధించారన్న అనుమానం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి 2008లోనే కలిగి ఉండాలి. కలగలేదు. ఉత్తరప్రదేశ్ పొరుగురాష్టమ్రైన బిహార్‌లో జాకిర్ పర్యటనలు యధావిధిగా జరిగిపోవడం ఇందుకు తార్కారణం. దర్భంగాలోని దార్ ఉల్ ఖతాబ్ సున్నా అన్న గ్రంథాలయం నిండా ఇతగాడి ప్రసంగాలు నిండిన పుస్తకాలు, క్యాసెట్లు, ఫోటోలు ఉన్నాయట! 2008నుంచి అనేకమంది ఈ ప్రసంగ పాఠాలు చదివి,క్యాసెట్లు విని జిహాదీ బీభత్సకారులుగా రూపొందారు. యాసీన్ భత్కల్ 2010 నుంచి ఆ గ్రంథాలయానికి వెళ్లి ఈ వికృతాక్షర రూపాలను వంటబట్టించుకున్నాడు,దేశ విద్రోహకర, అన్యమత విధ్వంసకర ప్రసంగాలను విని ప్రేరణ పొందాడట. 2012లో భత్కల్‌ను అరెస్టు చేసిన తరువాత కూడ భద్రత తన నిఘా నేత్రాలను ఆ గ్రంథాలయంపై సా రించిన జాడ లేదు. 2012లో కిషన్‌గంజ్‌లో పర్యటించిన జాకిర్ నాయిక్ చేసిన ప్రసంగాలను బిహార్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా ఎనిమిదేళ్ల పాటు జాకిర్ నాయిక్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు పట్టించుకోకపోవడానికి కారణం వోట్లు సీట్లు రాజకీయమని ఇప్పుడు ప్రచారమవుతోంది. జిహాదీలను నిర్బంధించినా, శిక్షించినా దేశంలోని ఇస్లాం మతస్థులకు కోపం వస్తుందన్న వికృత మనస్తత్వం రాజకీయ జీవులను ప్రధానంగా గత ఎనిమిదేళ్ల అధికార రాజకీయ వాదులను ఆవహించి ఉంది. అందువల్ల జిహాదీ బీభత్స ప్రమాద ప్రాధాన్యం తగ్గించడానికి ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు ప్రయత్నిస్తునే ఉన్నారు. కానీ సామాన్య ముస్లింలు జిహాదీలను వ్యతిరేకిస్తున్నారు, నిరసిస్తున్నారు, అసహ్యించుకుంటున్నారు, ఇస్లాం మత నిష్ఠకు జిహాద్ బీభత్స పైశాచిక కాండకు సంబంధం లేదని చాటి చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనేక మంది ఇస్లాం మత గురువులు ఈ జాకిర్ నాయిక్‌ను తక్షణం నిర్బంధించాలని కోరుతుండడం ఇందుకు నిదర్శనం...
జాకిర్ నాయిక్ మాత్రం ముస్లింలందరూ బీభత్సకారులు- టెర్రరిస్టులుగా రూపొందాలని 2010లోనే పిలుపునిచ్చి ఉన్నాడు. ఇలా పిలుపునిచ్చినందుకే బ్రిటన్ ప్రభుత్వం ఇతగాడు తమ దేశంలో ప్రవేశించడాన్ని నిషేధించింది. కెనడా మలేసియ తదితర దేశాలు కూడ నాయిక్‌ను టెర్రరిస్టుగా ప్రకటించి ఉన్నాయి. ఇలా అంతర్జాతీయ సమాజం ఆరేళ్లుగా జాకిర్‌ను దండనార్హుడిగా ప్రకటించి ఉన్నప్పటికీ మన ప్రభుత్వం మాత్రం అతగాడిని స్వేచ్ఛగా వదిలిపెట్టింది. 2010లోనో 2008లోనో ఈ ప్రచ్ఛన్న ఉగ్రవాదిని నిర్బంధించి ఉండినట్టయితే అనేక దుర్ఘటనలు నిరోధించడానికి వీలయి ఉండేది. జాకిర్ నాయిక్ అంతర్జాతీయ భౌతిక జిహాద్‌ను ఏళ్ల తరబడి ప్రచారం చేసాడు. భౌతిక జిహాద్ అని అంటే ఇస్లాం మతం కానివారిని నిరంతరం నిష్కారణంగా హత్య చేయడం...