ఉత్తరాయణం

కాలుష్యకోరల్లో కంచికచర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పరిధిలోని కంచికచర్ల ప్రాంతం తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రధాన రహదారి మురుగునీరు, దుమ్ము, ధూళితో అస్తవ్యస్తంగా ఉంటోంది. నూతన రాజధాని ప్రాంతం కోసం నిత్యం, ఉన్నతాధికార్లు, మంత్రులు ప్రయాణం చేస్తున్నా ఈ రహదారిలో మార్పు లేదు.
ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నందున ఇళ్లలోనుంచి వచ్చే మురుగు నీరు రహదారిపై చేరుతోంది. రోడ్లపక్కన చెత్తాచెదారం, నిర్మాణ సామగ్రి వ్యర్థాలు, ఇళ్లలోనుంచి తెచ్చిపడేసే వ్యర్థ సామానులతో అపారిశుద్ధ్య పరిస్థితులు నెలకొన్నా అధికార్ల స్పందన సూన్యం. వాహనాల వెనుక వెళ్లేవారి శరీరాలపై రెండు అంగుళాల మందాన దుమ్ము పేరుకుంటోంది. రహదారి వెంట ఉన్న కాల్వలనుండి ఏళ్లతరబడి పూడికే తీయలేదు. కంచికచర్ల పట్టణం మొత్తం దుమ్ము, ధూళితో నిండి ఉండిన కారణంగా ప్రజలు అంటురోగాల బారిన పడుతున్నారు.
- కె. కనకదుర్గ, కంచికచర్ల
అసలు సెక్యులరిస్టుల కష్టాలు
కోర్టులలో వాద ప్రతివాదులు, సాక్షులచేత వారివారి మత గ్రంథాలపై ప్రమాణం చేయడానికి అనుమతించడం మతతత్వాన్ని ప్రోత్సహించినట్లుగా అవుతోంది. కాబట్టి భారత రాజ్యాంగ గ్రంథంపై ప్రమాణం చేయడం తప్పనిసరి చేస్తే జనంలో దేశం, రాజ్యాంగంపట్ల గౌరవం పెరిగి బాధ్యతాయుతమైన ప్రవర్తన కలిగి ఉండాలన్న స్పృహ పెరుగుతుంది. అయతే మతోన్మాద శక్తులు ఇలాంటి నిర్ణయాలను కచ్చితంగా వ్యతిరేకిస్తాయ. ఇందులో ఎంతమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మొదటినుంచి ప్రభుత్వాలు ‘సెక్యులరిజం’ ముసుగులో కుల, మత శక్తులను బలాన్ని చేకూర్చే విధంగా వ్యవ హరిస్తున్నాయ. దేశభక్తులకు ప్రాథాన్యత లేకుండా పోయంది. ఓట్ల రాజకీయాల కోసం సెక్యులరిజానికి వ క్రభాష్యాలు చెప్పుకుంటున్న వారిని చరిత్ర క్షమిం చదన్నది వేరే విషయం. కాని నిజమైన సెక్యులరిస్టుల కష్టాల సంగతి ఏమిటన్నదే అసలు ప్రశ్న.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్
విద్యార్థులు లేక వెలవెల
విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు నేడు వెలవెల బోతున్నాయ. పల్లెటూర్లలో కూడా కొన్ని పాఠశాలలు ఉపాధ్యాయులున్నా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా పరిస్థితులు మెరుగు పడలేదు. ఎందుకంటె తల్లిదండ్రుల్లో తమ పిల్లలకు మెరుగైన విద్య ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లోనే లభిస్తుందన్న ఆశ. అందుకోసం ధనికులతో పాటు సామాన్యులు కూడా అప్పోసప్పో చేసి ప్రైవేటు పాఠశాలల్లో చేర్చి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వందల్లో వేలల్లో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిని ఎంపిక చేస్తున్నారు. అలాంటి ఉపాధ్యాయులుగా అందరూ తయారైతే ప్రభుత్వ పాఠశా లలు మెరుగుపడి పిల్లల తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు చేసుకోని కార్పొరేటు స్కూళ్లవైపు ఎందుకు మొగ్గుతారు?
- జి.వి. రత్నాకర్‌రావు, హనుమకొండ
పాత గుంటూరు సమస్యలు
పాత గుంటూరు పట్టణం అనేక సమస్యలకు నిలయంగా మారుతోంది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, శిథిలమై, మురుగుతో పొంగి పొరలే కాలువలు, నీటితో నిండిపోయిన మోకాలి లోతు గుంతలతో రోడ్లు, అసంపూర్ణంగా బాగుచేసిన రోడ్లు వంటి సమస్యల కారణంగా ఈ ప్రాంతం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో రాజుల కాలంనాటి ట్రాన్స్‌ఫార్మర్ల కారణంగా గట్టిగా గాలి వీస్తే చాలు విద్యుచ్ఛక్తి నిలిచిపోతుంది. తిరిగి పునరుద్ధరించడానికి కనీసం 6-7 గంటల సమయం పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుచ్ఛక్తి వైర్లు ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా వేలాడుతూ వుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రోడ్లపై పందులు, కుక్కలు, ఆవులు యదేచ్ఛగా సంచారం చేస్తుంటాయి. స్వచ్ఛ్భారత్ అంటూ నినాదాలు చేస్తున్న గుంటూరు నగర పాలక సంస్థ పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో తీవ్ర అలసత్వం, అలక్ష్యం కనబరుస్తోంది.
- ఎం.కనకదుర్గ, తెనాలి