సంపాదకీయం

మొఘల్స్‌ను ఎదిరించిన ధీరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండయాత్రల ద్వారా 300 సం వత్సరాలు భారతీయ సంపత్తిని దోచుకునిపోయి, తిరిగి 12వ శతా బ్దం అంతం నుంచి దేశంలోనే స్థిరపడి,హిందువులను నానావిధాల బాధిస్తున్న వారి దేవాలయాలను ధ్వంసంచేస్తున్న విదేశీ ముస్లిం పాలకులను ఎదిరించి హిందువుల ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించిన రాజ్యాలు విజయనగరం (1336), హిందు పదపద షాహి పేరుతో మరాఠా సామ్రాజ్యం (1674), సిక్కు రాజ్యాలు (1710). ఈ సిక్కుసార్వభౌమ రాజ్యాన్ని స్థాపించిన మహావీరుడు జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ పట్టణంలో ఒక రాజపుత్ర కుటుంబంలో లక్షణదాస్ పేరుతో జన్మించిన యువకుడు. తన 15వ ఏటనే ఆధ్యాత్మికతను సంతరించుకుని బైరాగి అయ్యాడు. అవి ధూర్తుడైన ఔరంగజేబు పాలిస్తున్న రోజులు. భద్రతకై మరాఠా రాజ్యంలోని నాందేడ్ పట్టణానికి అంతకుముందే 10వ సిక్కు గురువు గోవిందసింగు చేరుకున్నారు. ఆయన అనుయాయులు, బిడ్డలు, ఔరంగజేబు దౌష్ట్యంతో చంపబడ్డారు. ఆయన భార్య బందీ అయింది. బైరాగి అయిన లక్షణదాస్ మాధవదేవ్ పేరుతో నాందేడ్ చేరుకున్నారు. గురుగోవింద్‌చే ఆయన ప్రేరేపింపబడి సిక్కు పంధాలో చేరాడు. గురుగోవింద్‌చే అమృతాన్ని పొందిన తర్వాత ఆయన పేరు బందాసింగ్ బహదూర్‌గా మారింది.
గురుగోవింద్ ఉపదేశానుసారం ఉత్తర హిందూస్థానాన్ని విశేషించి పంజాబ్‌ను మొగలుల దుష్టపాలన నుంచి విముక్తిచేయడంకోసం బందాసింగ్ కొద్దిమంది సిక్కు వీరులతో దక్షిణ పూర్వీయ పంజాబ్‌ను చేరుకున్నాడు. అక్కడ వందల మంది సిక్కులు, జాట్‌లు, రాజపుత్రులు బందాసింగ్ సైన్యంలో చేరారు. వీరు సర్‌హింద్ అనే ప్రొవిన్స్ (దక్షిణ పూర్వీయ పంజాబ్)ను పాలిస్తున్న మొగలు గవర్నర్ వజీర్‌ఖాన్ నాయకత్వంలోని సైన్యంపై విరుచుకుపడి మెరుపుదాడిలో ఆ గవర్నర్‌ను, అతని సైన్యాన్ని ఓడించి చంపేశారు. 1710 మే 12వ తేదీన ప్రథమంగా సార్వభౌమ సత్తాక సిక్కు రాజ్యాన్ని స్థాపించి, మొగలులు ఏలుతున్న రాజ్యంలో రెండవ హిందూ రాజ్యాన్ని స్థాపించారు. శాసనాలను ప్రకటించారు. నాణాలను ముద్రించారు. తరువాత ఢిల్లీకి ఈశాన్యంలో వున్న హిమాచల్ ప్రాంతంలోని మొగలులకు తలవంచిన 20 హిందూ రాజులను ఓడించి, ఆ భూభాగాన్ని మరికొంత పంజాబ్ ప్రాంతాన్ని విముక్తిచేసి, తన రాజ్యంలో కలిపారు. దాదాపు లాహోరువరకు పంజాబ్ ప్రదేశాన్ని విముక్తి చేశారు.
లోహగఢ్ (లోఘర్) ను రాజధానిగా చేసుకున్నారు. ఔరంగజేబు తర్వాత రెండవ మొఘల్ పాదుషా ఎనిమిధి నెలల ముట్టడి తర్వాత 17 డిసెంబర్ 1755 (17-12-1755) విశ్వాస ఘాతుకత్వం ద్వారా కోటలో ప్రవేశించి, ఆకలితో కృశించిపోతున్న సిక్కు సైన్యంపై విజయం సాధించి బందా బహదూర్‌ని కొన్ని వేల మంది ఆయన సైనికులను బందీలుగా చేసి ఢిల్లీ తీసుకుపోయారు. ఢిల్లీలో నానావిధమైన హింసలను సిక్కు సైనికులపై జరిపి ముస్లిం మతాన్ని పుచ్చుకోనందుకు ఒక్కొక్కరోజున కొన్ని వందల మంది మూడు నెలలపాటు తలలను నరికి చంపారు. చివరిగా 1716 జూన్ 9వ తారీఖున బందాసింగ్‌ని, తన నాలుగేళ్ల కొడుకుని చంపమని ఆజ్ఞాపించాడు. ఆయన తిరస్కరించారు. ఆయన కళ్ళముందు ఆ కొడుకును చంపేశారు. చివరగా ఆయన ఇస్లాంను స్వీకరించ తిరస్కరించినందుకు చిత్రహింసలు పెట్టి చంపారు.
తమ బందీలను ఇస్లాం స్వీకరించనందుకు తలలు నరకడం, చిత్రవధ చేయడం వందల ఏళ్ల నుండి జరుగుతున్నదే. ఇప్పుడు పాకిస్తాన్‌లోను, సిరియా, ఇరాక్‌లలోను ఇస్లాం ఉగ్రవాదులు చేస్తున్న శిరచ్ఛేదనాలు, అకృత్యాలు వందల ఏళ్లుగా సాగుతున్న పరంపరయే. భారత ప్రభుత్వం గోవింద్‌సింగ్ యొక్క 300వ జయంతి, బందాసింగ్ బహదూర్ 300వ వర్ధంతి ఘనంగా జరుపబోతున్నారు.
chitram...
బందాసింగ్ బహదూర్

- త్రిపురనేని హనుమాన్ చౌదరి