సంపాదకీయం

సర్వోన్నత రాజ్యాంగ పాఠం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణాచల్‌ప్రదేశ్‌లో నిరుడు డిసెంబర్ 17వ తేదీన నెలకొని వుండిన ప్రభుత్వాన్ని యధాపూర్వకంగా పునరుద్ధరించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం మరో రాజ్యాంగ విప్లవం. ఈ తీర్పు ఫలితంగా ఈ సంవత్సరం జనవరి 26న అమలులోకి వచ్చిన రాష్టప్రతి పాలన రద్దయిపోయింది. రాష్టప్రతి పాలన విధించడానికి పూర్వం ముఖ్యమంత్రిగా ఉండిన నబమ్ తుకీ సర్వోన్నత నిర్దేశంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా సర్వోన్నత న్యాయస్థానం ఒక రాష్ట్రంలో విధించిన రాష్టప్రతి పాలనను తొలగించడం రాజ్యాంగ చరిత్రలో ఇదే మొదటిసారి. రాష్టప్రతి పాలన ఫలితంగా పదవిని కోల్పోయిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌ను సర్వోన్నత న్యాయస్థానం మే 11న మళ్లీ పదవిలో ప్రతిష్ఠించింది. రాష్టప్రతి పాలనను రద్దు చేస్తున్నట్టు అప్పుడు సుప్రీంకోర్టు నిర్ధారించలేదు. ఉత్తరాఖండ్ శాసనసభలో మే 10న జరిగిన విశ్వాస పరీక్షలో రావత్ నెగ్గినట్టు మాత్రమే సుప్రీంకోర్టు ప్రకటించింది. రావత్‌ను పదవినుంచి తొలగించడం, శాసనసభను ‘త్రిశంకు’ స్థితి- సస్పెండెడ్ యానిమేషన్-లో ఉంచడం వంటి చర్యలను గురించి తదుపరి విచారణను కొనసాగించనున్నట్లు మాత్రమే సర్వోన్నత న్యాయస్థానం మే 11న ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా రావత్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మార్చి 27 నుంచి అమలులో ఉండిన రాష్టప్రతి పాలనను స్వయంగా తొలగించింది. ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్టప్రతి పాలనను హైకోర్టు ఏప్రిల్ 21న రద్దు చేసినప్పటికీ, 22వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం మళ్లీ రాష్టప్రతి పాలనను పునరుద్ధరించింది. అందువల్ల ఒక రాష్ట్రంలో విధించిన రాష్టప్రతి పాలనను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేయడం ఇదే మొదటిసారి. అందువల్ల బుధవారం సర్వోన్నత న్యాయస్థానం అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేయడం చారిత్రక ఘటన. జనవరి 26న పదవిని కోల్పోయిన నబమ్ తుకీ యథాపూర్వంగా ముఖ్యమంత్రి అయ్యాడు!
సుప్రీంకోర్టు నిర్ణయం ఇలా రాజ్యాంగంలోని 356వ అధికరణానికి ఇది నూతన భాష్యం. డిసెంబర్ 17వ తేదీన ముప్పయి ముగ్గురు శాసనసభ్యులు అరుణాచల్ రాజధాని ఇటానగర్‌లోని ఒక హోటల్‌లో సమావేశమై కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రి తుకీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు కాలికోపుల్‌ను ఈ శాసనసభ్యులు ఆ తరువాత ‘ముఖ్యమంత్రి’గా ఎన్నుకున్నారు. అంటే తిరుగుబాటు కూటమికి శాసనసభాపక్షం నాయకుడిగా కాలికోపుల్ ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై మంది శాసనసభ్యులు తుకీకి వ్యతిరేకంగా భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని కూటమితో జట్టు కట్టడం సంక్షోభానికి శ్రీకారం. శాసనసభా ప్రాంగణంలో కాక హోటల్‌లో తిరుగుబాటు సభ్యులు జరిపిన సమావేశాన్ని గవర్నర్ జె.పి.రాజ్‌ఖోవా అంగీకరించడం రాజ్యాంగ వైపరీత్యం. అంతకుముందు రోజు ఈ 33 మంది శాసనసభ్యులు శాసనసభ వెలుపల సమావేశమై శాసనసభ స్పీకర్‌ను అభిశంసించి పదవి నుంచి తొలగించారు. ఈ సమావేశాన్ని కూడ గవర్నర్ ఏర్పాటుచేశాడు. ముఖ్యమంత్రి నబమ్ తుకీ ఆదేశాల అనుసారం జిల్లా కలెక్టర్ శాసనసభ ప్రాంగణానికి తాళాలు వేయడంవల్ల తిరుగుబాటుదారులు ఇలా హోటల్‌లో సమావేశం జరుపవలసి వచ్చిందట! గవర్నర్ ఆదేశం ప్రకారం శాసనసభ సమావేశాలు జరుగుతాయి. కానీ గవర్నర్ ఆదేశించిన మేరకు సభా భవనంలో సమావేశాలు జరుపని స్థితి ఏర్పడడం రాజ్యాంగ సంక్షోభానికి నిదర్శనం. ఇలాంటి స్థితి ఏర్పడినపుడు సమావేశం జరుపడానికి వీలు కల్పించాలని గవర్నర్ ముఖ్యమంత్రిని, స్పీకర్‌ను ఆదేశించి వుండాలి. ఈ ఆదేశాన్ని ముఖ్యమంత్రి మన్నించకపోయి వుండినట్టయితే సభా ప్రాంగణంలోనే సమావేశాల నిర్వహణకు వీలు కలిగి వుండకపోయినట్టయితే అది రాజ్యాంగ సంక్షోభ స్థితి. ఆ స్థితిలో గవర్నర్ రాష్టప్రతి పాలనకు ఆదేశించి ఉండవచ్చు. లేదా తిరుగుబాటు శాసనసభ్యుల అభ్యర్థన మేరకు ‘్ఫలానా సమయంలోగా’ శాసనసభలో తన ‘మెజారిటీ’ని నిరూపించుకోవలసిందిగా ముఖ్యమంత్రిని గవర్నర్ కోరి వుండవచ్చు. గవర్నర్ ఈ చర్యలను తీసుకోకుండా శాసనసభ సమావేశాన్ని ‘హోటల్’లో నిర్వహించడానికి అనుమతినివ్వడం ‘సమాంతర పాలన’కు శ్రీకారం. అందువల్లనే సుప్రీంకోర్టు స్పీకర్ చర్యలను తప్పుపట్టింది!
గవర్నర్ నిర్వహింపజేసిన ఈ ‘తిరుగుబాటు’ శాసనసభ సమావేశం నిర్ణయాలను అదే రోజున గౌహతి ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది. అరుణాచల్ గవర్నర్ చర్య రాజ్యాంగంలోని 174వ 175వ అధికరణాలకు విరుద్ధమని నిర్ణయించింది. ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం సలహామేరకు మాత్రమే గవర్నర్ శాసనసభను సమావేశపరచగలడన్న రాష్ట్ర ప్రభుత్వ వాదాన్ని హైకోర్టు అంగీకరించింది. శాసనసభను సమావేశపరచడానికి, సమావేశాలను పరిసమాప్తి -ప్రొరొగేషన్- చేయడానికి, రద్దు చేయడానికి గవర్నర్‌కు అధికారం వున్నదని మాత్రమే 174వ అధికరణం నిర్దేశిస్తోంది. కానీ 163వ అధికరణం మేరకు గవర్నర్ మంత్రివర్గం సలహా మేరకు మాత్రమే చర్యలు తీసుకోవాలి. అయితే ప్రత్యేక సందర్భాలలో కేవలం తన విచక్షణను ఉపయోగించి గవర్నర్ నిర్ణయాలు తీసుకోవచ్చునని కూడా అదే అధికరణంలో పేర్కొన్నారు. కానీ 174వ అధికరణం ప్రకారం గవర్నర్ కేవలం తన విచక్షణను ఉపయోగించి చర్యలు తీసుకోవచ్చునా? లేక మంత్రివర్గం సలహాను పాటించాలా అన్నది రాజ్యాంగంలో లేదు. ఈ విషయమై ఇప్పుడు స్పష్టత ఏర్పడింది. మంత్రివర్గం సలహా మేరకు మాత్రమే గవర్నర్ శాసనసభను సమావేశపరచ గలడన్నది బుధవారం నాటి సర్వోన్నత న్యాయ నిర్ణయ స్ఫూర్తి. సమస్య న్యాయ పరిశీలనలో వున్న సమయంలోనే జనవరి 26న అరుణాచల్‌లో కేంద్రం రాష్టప్రతి పాలనను విధించింది.
రాష్ట్రాలలో రాష్టప్రతి పాలన విధింపునకు సంబంధించిన రాష్టప్రతి నిర్ణయాలను న్యాయస్థానాలలో సవాలు చేయడానికి వీలు లేదన్నది -నాన్ జస్టిసబుల్- 1980వ దశకం వరకు కొనసాగిన అభిప్రాయం. ఒక రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను విధించడాన్ని ఎవరూ న్యాయస్థానాలలో ‘సవాలు’ చేసేవారు కాదు. 356వ అధికరణం ప్రకారం విధిస్తున్న రాష్టప్రతి పాలనను పార్లమెంటు ఆమోదించడంతో ‘కథ’ పూర్తయ్యేది. కానీ క్రమంగా న్యాయవ్యవస్థ అధికార పరిధి విస్తరిస్తోంది. 356వ అధికరణం కింద దాఖలైన ‘పిటిషన్’లను విచారణకు స్వీకరించడానికి ఒకప్పుడు ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలు నిరాకరించేవి. ఆ తరువాత విచారణకు స్వీకరించినప్పటికీ రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ తీర్పులను చెప్పలేదు. 1992 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి రాష్టప్రతి పాలనను విధించింది. శాసనసభల రద్దు రాజ్యాంగ వ్యతిరేకమని నిర్ధారించినప్పటికీ సుప్రీంకోర్టు వాటిని పునరుద్ధరించలేదు. రాష్టప్రతి పాలన గురించి నిర్ణయించలేదు. అందువల్ల ఇప్పుడు చెప్పిన తీర్పుతో న్యాయస్థానాల అధికార పరిధి మరింత విస్తరించింది! సుప్రీంకోర్టుకు రాష్టప్రతి పాలనను రద్దు చేసే అధికారం కూడా ఉన్నట్టు స్పష్టమైంది.