సంపాదకీయం

నకిలీ పోలీసుల ఆగడాలను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాలలో నకిలీ పోలీసులు హల్‌చల్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని హైవేలలో ఎక్కువ సంచారం ఉండని ప్రాంతాలలో లారీ డ్రైవర్ల దగ్గర, ద్విచక్రవాహనదారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా మహిళలు కనబడితే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొందరికి ప్రజలు దేహశుద్ధిచేసినా బుద్ధి రావడంలేదు. వీటిని అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వుంది. దీనితోపాటు మరికొందరు మంత్రి బంధువులమని హల్‌చల్ చేస్తూ అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలైన సంఘటనలు ఉన్నాయి. అసలు శాఖవారు కూడా తక్కువ ఏమీ కాదు. గంధపు చెక్కల దొంగలకు సహాయం చేయటం, మరికొందరైతే పేకాట ఆడుతూ దొరికిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నకిలీ పోలీసులను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
- ఎ.రాము, ఖమ్మం
అది దౌత్య విజయమే
ఎన్‌ఎస్‌జి- అణు సరఫరాల కూటమిలో మనకు సభ్యత్వానికి నలుబది ఏడు దేశాలు మద్దతు కూడగట్టడం- చైనా ఏకాకిగా మిగిలిపోవడం యావత్ ప్రపంచం గుర్తించేలా చేయగలగడమే. వర్తమాన భారత జాతి నేతృత్వానికి దాఖలుపడిన దౌత్య విజయం. 1962లో ఐక్యరాజ్యసమితిలో చీనాకు సభ్యత్వ కల్పనకు అహరహం కృషిచేసిన కాంగ్రెస్ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు వెంటనే కృతజ్ఞతను చెప్పుకుంది ఆ దేశం మన భూభాగాన్ని దుర్మార్గంగా ఆక్రమించింది. 1962ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవలసి వచ్చిందంటే- తగదునమ్మా అని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ నేడు యన్‌ఎస్‌జి సభ్యత్వం విషయంలో మోదీ ప్రభుత్వ దౌత్యనీతిపై తక్కువ చేసి మాట్లాడే సాహసం చేసినందుకు!
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
ప్రతిష్ఠకు నోచని విగ్రహం
ఆంధ్రదేశంలో వున్న పలు నారసింహ క్షేత్రాలలో సింహాచలం క్షేత్రానికి ఎంతో విశిష్ఠ స్థానం వుంది. ఇక్కడ నరసింహుని అవతారానికి కారణభూతుడైన ప్రహ్లాదుని విగ్రహం ప్రతిష్టించాలన్న భక్తుల మనోభావాలను దేవస్థానం ఇంతవరకు పరిశీలనలోనికి తీసుకోకపోవడం శోచనీయం. ఏడాది క్రితం ప్రహ్లాదుని విగ్రహాన్ని తయారుచేయించి దేవస్థానానికి సమర్పించినా ఇంతవరకు ప్రతిష్టకు నోచుకోలేదు. విగ్రహ ఏర్పాటుదారులు, దేవస్థానానికి మధ్య నలుగుతున్న వివాదం మూలంగా సింహగిరిపై గోకులంలో వదిలేసిన ప్రహ్లాదుని విగ్రహం దుమ్ము, ధూళి పట్టి ఆలనా పాలనా లేకుండా వుంది. ప్రభుత్వం ఆధ్యాత్మికవేత్తలు చొరవ చూపించి ఈ వివాదానికి తెరదించాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఎగ్జిట్‌పోల్స్‌ను నిషేధించాలి
ఇండియాలో ఎగ్జిట్ పోల్స్‌ను పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే ఎన్నో సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించి, తప్పుడు లెక్కలు ప్రజలకు అందజేస్తున్నారు. ప్రజలు దేనికి ఓటు వేసేది బయటకు చెప్పరు. కేవలం వూహించి తమ నిర్ణయాన్ని ఎగ్జిట్‌పోల్ సంస్థలు ప్రకటించటం తప్పేగాదు, ఓటరును పరోక్షంగా ప్రలోభపెట్టినట్లవుతుంది. ఉదాహరణకు తమిళనాడులో డియంకె అధికారుంలో వస్తుందని చెప్పాయి. కాని ఎగ్జిట్‌పోల్ సంస్థలు చెప్పినవన్ని తప్పని తేలింది. కేవలం డియంకె మీది సానుభూతితో తప్పుడు లెక్కలు ప్రకటించి, ఓటరును ప్రలోభపెట్టాలని చూశాయి. ఇది పరోక్షంగా ఓటరును డియంకెకు అనుకూలంగా మార్చాలని చూడటమే గదా! కావున కేంద్ర ప్రభుత్వం గాని, కేంద్ర ఎన్నికల కమీషన్‌గాని కలుగజేసుకొని ఎగ్జిట్‌పోల్స్‌ను నిలుపుదల చేయాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
నిలువు దోపిడీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా ఆదాయ మార్గాలను అనే్వషిస్తూ ప్రజలను నిలువుదోపిడీ చేసేస్తోంది! ఇప్పటికే నిత్యావసరాల ధరలు నాలుగురెట్లు పెరిగినా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోంది! ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన మందులు ఉండవుగానీ పార్కింగ్ ఫీజు అంటూ ద్విచక్ర వాహనదారుల నుండి డబ్బు గుంజుతోంది. హిందూ దేవాలయాల భూములను స్వాహా చేయడమే కాకుండా సామాన్య భక్తులకు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల రుసుముల పేరుతో పీల్చిపిప్పి చేస్తోంది. ద్విచక్ర వాహనదారులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు! అన్నీ సక్రమంగాఉన్నా ఇంకా ఏదో లేదు అనే నెపంతో రహదారుల్లో అడుగడుగునా వాహన తనిఖీలుచేసి అడ్డగోలుగా అపరాధ రుసుములు విధించేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత లోటు బడ్జెట్‌లో ఉన్నా వారి అవినీతి, భూపందేరం, ప్రతిపక్షాల ప్రతినిధులను కొనడం ఆపితే రాష్ట్రంలో సామాన్యులకు ఇటువంటి ఇబ్బందులు ఉండవు.
- మారెళ్ల శివసాయిరాం, తణుకు
కూరగాయల ధరలు తగ్గించాలి
కూరగాయల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటమే గాక తగ్గడం లేదు. టమాటాలు, పచ్చిమిర్చి, బెండకాయలు ఒకటేమిటి, చాలా రకాల కూరగాయల ధరలు శరవేగంగా పెరుగుతుండటమే తప్ప తగ్గే సూచనలు కనబడటం లేదు. సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇక నిరుపేదలు పస్తులుండాల్సిందేనా? ప్రభుత్వం చొరవ తీసుకొని కూరగాయల ధరలు తగ్గేలా చూడాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్