ఉత్తరాయణం

మంచి నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమ్ ఇండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే నియామకం హర్షణీయం. అనిల్‌కుంబ్లే అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ స్పిన్నర్. ఎన్నో మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించిపెట్టాడు. క్రమశిక్షణ, అంకితభావం ఉన్న మృదుస్వభావి. ఎలాంటి వివాదాలు లేని ఆటగాడు. టెస్టు క్రికెట్‌లో ఇండియా కెప్టెన్‌గా రాణించాడు. క్రికెట్‌పట్ల అంకితభావం, ప్రేమ వున్న అనిల్‌కుంబ్లే టీమ్ ఇండియా కోచ్‌గా రావడంవల్ల ఇండియా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలదు.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
నిలువు దోపిడీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా ఆదాయ మార్గాలను అనే్వషిస్తూ ప్రజలను నిలువుదోపిడీ చేస్తోంది! ఇప్పటికే నిత్యావసరాల ధరలు నాలుగురెట్లు పెరిగినా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోంది! ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన మందులు ఉండవుగానీ పార్కింగ్ ఫీజు అంటూ ద్విచక్ర వాహనదారుల నుండి డబ్బు గుంజుతోంది. హిందూ దేవాలయాల భూములను స్వాహా చేయడమే కాకుండా సామాన్య భక్తులకు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల రుసుముల పేరుతో పీల్చిపిప్పి చేస్తోంది. ద్విచక్ర వాహనదారులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు! రాష్ట్ర ప్రభుత్వం ఎంత లోటు బడ్జెట్‌లో ఉన్నా వారి అవినీతి, భూపందేరం, డబ్బు ప్రలోభపెట్టి ప్రతిపక్షాల ప్రతినిధులను కొనడం ఆపితే రాష్ట్రంలో సామాన్యులకు ఇటువంటి ఇబ్బందులు ఉండవు.
- మారెళ్ల శివసాయిరాం, తణుకు
‘ఆత్మీయ నేస్తం’ బాగుంది
పల్లెల్లో, పట్టణాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదులను, సమాచారాన్ని ఆత్మీయ నేస్తం ఫిర్యాదుల బాక్సుల్లో వేస్తే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారు. విజయనగరం జిల్లాలో జూన్ నెలలో అక్కడి ఎస్.పి. ఎల్.కె.వి.రంగారావు ఈ ప్రయోగాన్ని అమలుచేసారు. అసాంఘిక కార్యకలాపాలను పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు ప్రజలు భయపడుతున్నారు. దాన్ని గమనించి విజయనగరం ఎస్.పి. ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇది ఎంతో బాగుంది. ఇదే తరహాలో మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రయోగాన్ని అమలుచేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఫిర్యాదు బాక్స్‌ల్లో వేస్తే అవి నేరుగా జిల్లా ఎస్‌పికే చేరుతాయి. ఆత్మీయ నేస్తం బాక్స్‌ల్లో వేసే ఫిర్యాదులను ప్రతి శుక్రవారం ఎస్‌పి కంట్రోల్‌లో ఉన్న సిబ్బంది క్లియరెన్సు చేసి జిల్లా ఎస్‌పికి అందిస్తారు. తరువాత ఎస్‌పి చర్యలు తీసుకుంటారు. విజగనగరం పోలీసుల విధానాన్ని అన్ని జిల్లాల్లో అమలుచేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి.
- వి.కొండలరావు, పొందూరు
రోడ్ల పరిస్థితి అధ్వాన్నం
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పూర్తిగా పాడైపోయి గుంతలు ఏర్పడి ప్రమాద భరితంగా తయారయ్యాయి. రోడ్లు వేసిన కొద్ది కాలంలోనే పాడైపోవటం కంట్రాక్టర్ల అసమర్ధతకు, ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ద్విచక్ర వాహనాలు తిరగ లేని పరిస్థితి ఉంటే భారీ వాహనాల పరిస్థితి ఎలా వుంటుందో చెప్పనలవి కాదు. దీనికితోడు వర్షాలు పడుతున్నప్పుడు రోడ్లు వెడల్పు కార్యక్రమాలు నిర్వహించటం శోచనీయం. రోడ్డుకిరుప్రక్కన హైవేలలో గోతుల తవ్వటంతో వాహన దారులు ప్రమాదాలపాలౌతున్నారు. పాడైపోయిన రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం
శక్తిమంతమైన మహిళలు!
ప్రపంచంలో వంద మంది శక్తిమంతమైన మహిళలు అంటూ ఫోర్బ్స్ సంస్థ ప్రకటిస్తుండటం అర్థరహితంగా వుంది. వారి వారి పదవులు, వ్యాపారాల నిర్వాహణలను బట్టి కొందరు మహిళలను శక్తిమంతులు అంటూ ఆకాశానికి ఎత్తేయటం వలన మహిళా లోకానికి ఒరిగేదేమిటి? వారిని ఆదర్శంగా తీసుకుని ఎదగమని మిగతా మహిళలకు సూచిస్తున్నారా? అందరూ పల్లకి ఎక్కేవారే అయితే మోసేవారు ఎవరు అన్నట్లుగా ఉంటుంది! ఎవరికి లభించేఅవకాశాలను వారు సద్వినియోగం చేసుకుంటూ సరిగ్గా జీవనాలను సాగించుకోగలిగిన వారందరూ శక్తిమంతమైన మహిళలే (ఇదే సూత్రం పురుషులకీ వర్తిస్తుంది).
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్