మెయన్ ఫీచర్

దీనదయాల్‌జీ ప్రతిపాదించిన సమన్వయ వాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో అనాదిగా మనం సహనాబవతు అనే మంత్రం పఠిస్తున్నాము. ఐనా మనకు సహనం లేదని విదేశీ మానసపుత్రులు ఆరోపిస్తున్నారు. సహనం సమన్వయం భారతీయతాత్విక చింతనకు మూలస్తంభాలు. వాటిని ఆధునికంగా ఆవ్కిరించిన కర్మయోగి ఋషి పండిత దీనదయాల్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత వారు పార్టీ అధ్యక్షులైనారు. జనసంఘ్ పార్టీ తర్వాతికాలంలో జనతా పార్టీలో విలీనమైంది. అక్కడ ఇమడలేక బయటకు వచ్చి భారతీయ జనతాపార్టీగా అవతరించింది. అంటే నేటి బిజెపి విజయాలకు పునాదిరాళ్లు వేసిన వారిలో దీనదయాల్‌జీ ప్రథముడు. దీనదయాల్‌జీ ప్రతిపాదించిన సిద్ధాంతానికి ఏకాత్మ మానవతావాదం అని పేరు. ఇందులో నాలుగు పదాలున్నాయి. ఏక్- ఆత్మ- మానవత- వాదం. ఇందులో వాదం అనే మాట ఆంగ్లంలోని ఇజం అనే పదానికి పర్యాయ వాచకంగా వాడబడింది. దీనిని కొందరు దర్శనము అని మార్చారు. ఇక ఏకాత్మ శబ్దాన్ని ఆంగ్లంలో ఇంటగ్రల్ అంటున్నారు. ఇది సమగ్రతాదాత్మ్యతకు సమన్వయానికి సంకేతంగా వాడబడింది. మానవశబ్దం స్థూలంగా నరులకే ఉద్దేశింపబడినా ఇందులో ‘సృష్టి’అనే భావం అంతర్లీనంగా ఉంది. అంటే వ్యక్తి- సమష్టి సృష్టి పరమేష్టి వీటి సమన్వయాన్ని ఈ పదం సూచిస్తుంది. పాశ్చాత్యులు మానవుణ్ణి ఆర్థిక జీవిగా కామజీవిగా భావించారు. మానవునికి కోరికలున్నాయి వాటిని తీర్చాలి. అర్థం అంటే డబ్బు మాత్రమే కాదు. రాజకీయం కూడా. మానవుణ్ణి పాశ్చాత్య సిద్ధాంతకర్తలు ఆర్థిక జీవిగా భావించారు. ప్రపంచంలో మూడు ప్రధాన ఆర్థిక విధానాలు ఇరవయ్యవ శతాబ్దంలో అమలులోకి వచ్చాయి. మొదటిది అమెరికాలోని పెట్టుబడిదారీ విధానం. ఇది ‘లాభార్జన’ దృష్టితో సాగుతుంది. ఇందులో సమాజం కొందరు ధనికుల చేతిలో కీలుబొమ్మలై ఉంటారు. మొత్తం దేశాన్ని పరిమితమైన ఒక ధనికవర్గం శాసిస్తూ ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా రష్యాలో కమ్యూనిజం వచ్చింది. ఇందులో ప్రభుత్వం చేతిలో ఆర్థిక ఉత్పత్తులు ఉంటాయి. వ్యక్తికి స్వంత ఆస్తి ఉండదు. కేవలం అధికోత్పత్తి కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. తమ లక్ష్యసాధనకోసం సామ్యవాదం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాక తుపాకీ గొట్టాన్ని ఆశ్రయించింది. అంటే హింస ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని నిర్మూలించాలని వారు ప్రతిపాదించారు. ఇది మూడు అంచెలలో సాగుతుంది. ధనికుల మీద మధ్యతరగతివారు తిరగబడాలి. మధ్యతరగతి మీద అట్టడుగువర్గాలు తిరగబడాలి. వారిపై ప్రభుత్వం ఆధిపత్యం సాధించిన తర్వాత సమాజంలో వర్గాలు ఉండవు. భూస్వాములు ఉండరు. అసలు చిన్న సన్నకారు రైతులుకూడా ఉండరు. ఈ హింసా రాజకీయాలకు ఎం.ఎల్.రాయ్, రాంమనోహర్ లోహియావంటి వారు వ్యతిరేకించారు. లోహియాగారి సోషలిజంలో అందరికీ రొట్టె- అందరికీ నీడ అనే నినాదం ఉంది. ఇందులో తరతమ భేదాలులేవు. వైయక్తిక అభిరుచులకు స్థానంలేదు. వ్యక్తిని కేంద్ర బిందువుగా తీసుకోకపోవటంవలన ఈ మూడు సిద్ధాంతాలు క్రమంగా ఒక శతాబ్దపు అలజడి- విధ్వంసం తర్వాత మసకబారాయి. ఈ దశలో పండిత దీనదయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాద ఆర్థిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మానవుణ్ణి ఆర్థికశాస్తవ్రేత్తలు కేవలం కన్స్యూమర్‌గా భావించారు. ఈ కన్స్యూమరిజం దహింప ఎడని అగ్నివంటిది. ఫలితంగా ఒక కోటు (కోటి) ఉన్నవాడు పది కోట్లు కోరుకుంటున్నాడు. ఒక ఇల్లు ఉన్నవాడు నాలుగు ఇళ్లు కూడబెట్టుకుంటున్నాడు. ఫలితంగా నిరుపేదలు- ధనవంతుల మధ్య అగాధం పెరిగిపోతున్నది. ఉత్పత్తిసాధనాలు మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉండటంవల్ల వ్యక్తి స్వేచ్ఛ హరించిపోవటంతోబాటు అతడు తానెవరికోసం పనిచేయాలి? అనే భావం పొందుతాడు. రష్యా విచ్ఛిత్తికి ఇది ఒక కారణం. అందువలన వ్యక్తియొక్క సృష్టి సహజమైన కామనలను సమాజం గౌరవించాలి. ప్రభుత్వం పూరించాలి.
దీనినే సమన్వయవాదం అంటున్నాము. ఇక మరో వాదం వినబడుతున్నది. విదేశాలనుండి సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకున్నాము. రేడియో, టి.వి, సెల్‌ఫోను, కరెంటు రైలు వంటివి వచ్చినప్పుడు అక్కడి సిద్ధాంతాలు వస్తే తప్పేమిటి? అని తరుచు అంటుంటారు. ఐతే కాశ్మీరులోని ఆపిల్ పండు కైకలూరులో పండదు. ఎక్కడి శీతోష్ణ పరిస్థితులు అక్కడ పంటకు అనుగుణంగా ఉంటాయి. వైదేశిక సిద్ధాంతాలు ఈ దేశ సహజ ప్రవృత్తికి సంప్రదాయానికి పరంపరకు అనుగుణంగా ఉంటే స్వీకరించి దేశీయం (నేషనలైజ్) చేసుకోవటంలో తప్పేమిటి? ఐతే శ్రామికులు రక్తవిప్లవంలో జార్ ప్రభువులను నిర్మూలించారు. కాబట్టి ఇండియాలో ధనవంతులను నిర్మూలించండి అనటంలో అర్థంలేదు. ఇక్కడ అనాదిగా విశ్వకర్మ జయంతి జరుగుతున్నది. విశ్వకర్మ సమస్తశక్తులకు శ్రామిక వృత్తులకు అధిదేవత. వారికి సామాజిక గౌరవం కూడా ఉంది. దీనిని పాశ్చాత్యులు గ్రహించలేకపోయారు. జ్ఞానము- ధర్మప్రచారము కొందరికి రక్షణ బాధ్యత మరికొందరికి వాణిజ్యము. ఈ వర్గ విభజన గుణాత్మకతకు కాని జన్మసిద్ధం కాదు. నేడు వికృతి పొందిన సమాజంలో చతుర్వర్గ విభజన మాత్రమే కాదు స్వీయ వర్గ ఘర్షణలు కూడా చూస్తున్నాము. ఇది రాజకీయ ప్రేరేపితమైనది. దీనదయాల్‌జీ ప్రతిపాదించిన సిద్ధాంతాలలో మరొకటి ప్రాచీన మూలాలను వర్తమాన కాలానికి అనుగుణంగా మలచుకోవాలి అని. దీనినే తిక్కన్నగారు ‘నేలపొద్దు’అన్నారు. అంటే దేశకాల పాత్రములనెరుగుట. ప్రాచీన కాలంలో శంఖం వాడేవారు. నేడు ఘోష్ వాద్యం వచ్చింది. పూర్వం ఆముదపు దీపాలుండేవి. ఇప్పుడు విద్యుత్తు వచ్చింది. పూర్వం సముద్రయానం నిషేధించారు. ఇవ్వాళ ఎవరూ ఈ నిషేధాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. స్వయంగా స్వామి వివేకానంద, రామతీర్థ, చిన్మయానంద, చినజియర్‌స్వామి వంటి ఆధ్యాత్మికవేత్తలే ప్రపంచమంతా తిరుగుతున్నారు. కాబట్టి సామాజిక వికృతులు పరిత్యిజించి ప్రాచీన జీవనమూల్యాలను ఆధునిక సమాజానికి అనుగుణంగా ఉపయోగించుకోవాలని దీనదయాల్‌జీ అభిప్రాయపడ్డారు. దీనికే మనం సమన్వయవాదం అనవచ్చు. అలాగే నేడు దేవుని పేరుతో యుద్ధాలు జరుగుతున్నాయి. క్రూసేడ్స్ జీహాదీలు దైవరాజ్యస్థాపన కోసం కాఫిర్లను హతమారుస్తున్నారు. భారతదేశంలో ఆరాధనా విధానాలను వైయక్తికం అని భావించారు. ఎవరి దేవుడువారికి ఉంటాడు. అలాకానినాడు శైవవైష్ణవులు ఘర్షణకు దిగిననాడు పిట్టపిట్ట తగవు పిల్లి తీర్చిందన్న సామెత నిజమయింది. అంతేకాదు పోపుగారు ఖలీఫాగారు ప్రైవేటు ఆర్మీలలో సామ్రాజ్యాధిపతులుగా ఉంటారు. మన దేశంలో రమణమహర్షులు మహాత్మాగాంధీ వంటి గోచీపాత రాయుళ్లు గౌరవింపబడ్డారు.
దీనదయాల్ ఉపాధ్యాయ దేశంలోని అన్ని భాషలను ప్రాంతాలను కోరిమరి ఆకాంక్షలను గౌరవిస్తూనే కేంద్రంయొక్క ఆధిపత్యాన్ని గుర్తించారు. ఫెడరలిజం పేరుతో వర్తమాన సమాజంలో జరుగుతున్న రాజకీయపరమైన బెదిరింపులు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే ప్రత్యేక దేశమే కోరుకుంటాం అని బెదిరించారు ఫెడరలిజం స్ఫూర్తికి భంగకాదు. అందుకని భాషలను గౌరవిస్తూ భాషాప్రయుక్త రాష్ట్రాలవల్ల ప్రయోజనం శూన్యమని గుర్తించారు. యూనిటరీ విధానం మంచిదని అభిప్రాయపడ్డారు. దీనదయాల్‌జీ దేశ విభజనను 1947లో వ్యతిరేకించారు కాని అది జరిగింది. ఫలితం నేడు మనం అనుభవిస్తున్నాము. యూనిఫాం సివిల్‌కోడ్ ఉండాలని వారు సూచించారు. నేడు ముస్లిముల పెద్దలు ఛాందసంగా వ్యతిరేకిస్తున్న ముస్లిం వనితలు తమ (స్వీయ) రక్షణకోసం యూనిఫాం సివిల్‌కోడ్ కోరుకోవటం గమనార్హం. దీనదయాల్‌జీ ప్రధానంగా సమన్వయవాది. మాది సిద్ధాంతం కేవలం ఆర్థిక రంగానికే పరిమితమైనది కాదు. అది దేశంయొక్క మానవుని యొక్క బహుముఖ కోణాలను స్పృశించింది. ఈ కారణంచేతనే అధిక ధనవంతులు అమెరికాలో చిత్తశాంతి లేక మహర్షి మహేశ్‌యోగి, రవిశంకర్ వంటివారి శిబిరాలల్లో సేద తీరుతున్నారు.
నేటి ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టమైనది. 51 శాతం వచ్చినవాడు 49 శాతం వచ్చినవానిపై స్వారీ చేస్తున్నాడు. అంతేకాదు ఒక ఎన్నికలో యాభైశాతం ఓట్లే పోల్ అవుతాయి. అందులో ఒకరికి 25, మరొకరికి పదిహేను ఇంకొకరికి పది ఓట్లువస్తాయి అంటే నూటికి ఇరవై శాతం మాత్రమే వచ్చినవాడు విజేతగా విర్రవీగుతున్నాడు. ఇది సరియైన విధానం కాదు. గెలిచినవారూ ఓడినవారూ ఇరువురూ సమానంగా దేశసేవ చేయవలసి ఉంటుంది. ఇందుకు ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం తప్పనిసరి. కాని నేడు భారతదేశంలోని ప్రధాన పార్టీలమధ్య అలాంటి సమన్వయం మనం చూడటంలేదు. వైయక్తిక కాంక్షలలో పార్టీలు ఏర్పడుతున్నాయి. వాటికి సిద్ధాంత భూమిక కూడా ఉండటంలేదు. రాజకీయ లబ్ధికోసం స్మగ్లర్లు టెర్రరిస్టులతో ప్రభుత్వాలే చేతులు కలపటం నేటి రాజకీయ చిత్రపటంలో ఒక విషాద దృశ్యం. కాబట్టి మెరుగైన ప్రజాస్వామ్యం రావాలంటే మెరుగైన పౌరుడు నిర్మింపబడాలి. ఓటరు ఐదు నిమిషాలు ఆలోచించి ఏదో ఒక బటన్ నొక్కుతాడు. అంతటితో అతని బాధ్యత తీరిపోతుంది. కాని దేశభక్తుడు ఆజన్మాంతం కమిట్‌మెంటులో జాతికోసం పనిచేస్తూ ఉంటాడు. మీమీ అభిరుచులకు అనుగుణమైన వికాసం ఈ సమాజాలల్లో జరుగదు. ఐదు ఆరు ఏడు ఎనిమిది- ఇలా చెప్పుల నెంబర్లు వుంటాయి. వాటిల్లో మనం కాలు దూర్చాలి. ఐదున్నర అంగుళాల సైజు ఉన్న వాడి గూర్చి ఈ ఆర్థిక సిద్ధాంతాలు పట్టించుకోవు. ఈ కారణం చేతనే అవి విఫలమైనాయి. అంతేకాదు వ్యక్తికి స్వంత ఆస్తిలేకుండా చేస్తే తానెవరికోసం పనిచేయాలి? అని వ్యక్తి ఆలోచిస్తాడు. అందుకని అతనికి కుటుంబం స్వంత ఆస్తి భారతీయ సమాజం అంగీకరించి యజ్ఞం త్యాగం ద్వారా వికేంద్రీకరణకు దోహదపడింది. ఇదొక శ్రేష్ట సమన్వయం. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉన్నట్లే పనిచేసే హక్కు- బాధ్యత కూడా ఉంటుంది. ఒకాయన వయస్సుమళ్లిన ఎముకలు కుళ్లిన సోమరులారా చావండి అని కవిత్వం వ్రాశాడు. నిజానికి కమ్యూనిస్టు దేశాలల్లోకూడా ఎనభైఏళ్లు పైబడిన వారిని చంపటం లేదు. పనిచేయలేని వారిని పోషించే బాధ్యత ప్రభుత్వం మీదనో సమాజం అంటే కుటుంబం మీదనో ఉటుందని అర్థం. ఇది సమన్వయం. పనిచేయగలిగే రెండుచేతులకూ పనికల్పింపవలసిన బాధ్యత రాజ్యవ్యవస్థ మీద ఉంటుంది. ఇక ఒకదశలో రాజ్యం కూడా రద్దుఅయిపోతుందని సామ్యవాదులు జోస్యం చెప్పారు. ఇది ఊటోపియా అని తేలింది. అంతేకాదు మానవులంతా నేను నాది అనేభావన లేకుండా సోషలిస్టు రాజ్యంకోసం కృషిచేస్తారని చెప్పారు. అదికూడా అనుభవంలో ఆచరణ సాధ్యంకాలేదు కాని ప్రపంచంలో నేను నాది అనే భావన లేని వారిని భారతీయ సమాజం నిర్మించింది. వారికే సన్యాసులు అని పేరు. ఇదం నమతు అంటూ సమాజానికి అంకితమైన వారు కాషాయాలు కట్టుకున్న బానిసలు మాత్రమే. బండితోనే దైన్యుడు శసాయ పనిచేసే ధర్మవ్యాధుడు యాదవుడైన కాళిదాసు జాలారి వనితకు పుట్టినవ్యాసుడు క్షత్రియుడైన విశ్వామిత్రుడు అందరూ బ్రహ్మస్థితికి కుల ప్రసక్తిలేకుండా అర్హులని మన పరంపర నిరూపించింది.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్