ఉత్తరాయణం

సంచలన తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. క్రికెట్‌లో సమూల మార్పులను సూచిస్తూ సు ప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. లోధా కమిటీ చేసిన సిఫారసులను సుప్రీంకోర్టు ఆమోదించింది. లోధా కమిటీ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నామని, ఆరునెలల్లోగా భారత క్రికెట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పేర్కొంది. క్రికెట్‌కు లోధా కమిటీ సిఫార్సులను ఆమోదించడం ద్వారా ఒకటి కంటె ఎక్కువ క్రికెట్ అసోసియేషన్లు కలిగిన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు రొటేషన్ పద్ధతిలో ఓటింగ్‌లో పాల్గొంటాయ. ఇకపై ఒక రాష్ట్రం, ఒక ఓటు విధానం కొనసాగాలని మంత్రిపదవిలో ఉన్నవారు, 70 ఏళ్లు దాటిన వారు బిసిసిఐలో సభ్యులుగా ఉండటానికి వీల్లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. దేశంలో బెట్టిం గ్‌లను చట్టబద్ధం చేసే అంశాన్ని పార్లమెంట్‌కు వదలి వేసింది. ఏమైనా సుప్రీం కోర్టు తీర్పు భారత క్రికెట్ వ్యవ స్థకు గొప్ప వరం అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
-చామర్తి రామకృష్ణ, హైదరాబాద్
అభిశంసనతో సమానం
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో గవర్నర్ నిర్వాకంపై తాజాగా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం భాజ పాకు అభిశంసనతో సమానం. ఆ రాష్ట్రంతో ఉన్న విభే దాల్ని అడ్డుపెట్టుకొని లబ్ది పొందుదామన్న ఆత్రంలో కేం ద్ర గవర్నర్ అనైతిక కలాపాల్ని ప్రోత్సహించడం, లేదా వెనకేసుకు రావడం అన్నది అంతిమంగా అధికార పార్టీకి తలవంపులనే మిగిల్చింది. అవకాశం దొరికితే తానూ అంతే నంటూ కాంగ్రెస్ సరసన చేరినట్లయంది. అయతే ఈ తీర్పు కాంగ్రెస్‌కు విజయం కాదు. ప్రజాస్వామ్య విజయం. వ్యక్తుల చేతిలో వ్యవస్థలు భ్రష్టు పట్టకుండా వాటి పవిత్రత కాపాడే విధంగా న్యాయవ్యవస్థ స్పందిం చడం మున్ముందు ప్రజాస్వామిక సౌధాన్ని పటిష్ట పరిచే చర్య. రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహరించాల్సిన గవ ర్నర్ విధులేమిటో స్పష్టం చేయడం ద్వారా, రానున్న రోజుల్లో అతిక్రమణలు తగ్గే అవకాశముంటుంది. ఆ రాష్ట్రంలో రాష్టప్రతి పాలన నిర్ణయాన్ని సైతం కొటి టవెయ్యడం ద్వారా రాజ్యాంగ స్పూర్తిని కాపాడడంలో న్యా య వ్యవస్థ చొరవ తేటతెల్లమైంది. తన రాజకీయ అవస రాలకు రాజ్యాంగాన్ని, ఇతర వ్యవస్థల్ని మేనిప్యులేట్ చేయడం అధికార పక్షాలకు ఏవిధంగానూ ఉపయో గకరం కాదని అన్ని పక్షాలు తెలుసుకోవాలి. ఋజు మార్గంలో ప్రజాభిమానం పొందడమే ఏ పక్షానికైనా ఏకైక మార్గం. కుతంత్రాలకు, కుట్రలకు ప్రజాస్వామ్యం వేదిక కాదు. కాకూడదు.
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం
ఉద్యోగులకు న్యాయం చెయ్యాలి
తెలంగాణ ఉద్యోగ నేతలు పాలకుల మెహర్బానీ కోసం, పదవులకోసం పాలకుల ముందు మోకరిల్లడం ఇపుడు మొదలయిందేమీకాదు. తొలి తెలంగాణ ఉద్యమ సమయం (1969) నుండి ఈనాటివరకు రాష్ట్ర తెలంగాణ ఉద్యోగ నేతలది అదే తీరు. తెలంగాణ రాష్ట్రం వచ్చి రెండేళ్ళు దాటిపోయినా తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు పిఆర్‌సి బకాయిల కోసం, హెల్త్ కార్డుల కోసం ఇంకా ఎదురుచూపులు చూస్తూనే వున్నారు. హెల్త్‌కార్డుల కోసం తమ వంతు ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా వున్నా నాయకులలో ఉలుకూ పలుకూ లేదు. ప్రభుత్వం పక్షానే్న వుండి ప్రభుత్వాన్ని ఉద్యోగుల సమస్యలపై నిలదీయలేకపోతున్నారు. ఇప్పుడైనా ఉద్యోగ నేతలు స్పందించి తక్షణ చర్యలు తీసుకొని ఉద్యోగులకు న్యాయం చెయ్యాలి.
-వి.సోమనర్సయ్య, వనస్థలిపురం
తెలంగాణ ప్రభుత్వ విజయాలు!
దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా నంబర్ వన్ స్థానంలో కె.సి.ఆర్. నిలిచినట్లు సర్వేలో వెల్లడవటం తెలుగు ప్రజలకు గర్వకారణం. చాలా సంతోషదాయకం. అలాగే కొత్త సచివాలయ నిర్మాణం అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ అధ్యయనం చేసి సమర్పించిన నివేదిక ద్వారా తెలుపడం సమర్ధనీయం, సమంజసం. అవసరమైన చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఆ ధనాన్ని ముఖ్యమైన అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చు. ఇటీవల ఉద్యోగ- పెన్షనర్లలో కొంత అసంతృప్తి నెలకొన్నది. ప్రభుత్వం వారి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి.
- జి.వి.రత్నాకర్‌రావు, హనుమకొండ