సంపాదకీయం

దుందుడుకు డోనాల్డ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మొత్తం వ్యవహారంలో గొప్ప పైశాచిక ఆనందం నిబిడీకృతమై ఉంది. అది నిరంతరం తన వికృతమైన తలను నిక్కబెడుతూ ఉంది-దేర్ ఈజ్ ఏ గ్రేట్ అవౌంట్ ఆఫ్ సాడిజం ఇన్‌హరెంట్ ఇన్ ది హోల్ అఫైర్, విచ్ హాస్ ఆల్ వేస్ బీన్ పీపింగ్ ఔట్ ఇట్స్ అగ్లీ హెడ్- అన్నది డోనాల్డ్ ట్రంప్ ప్రచార సరళి గురించి అమెరికాలోను ఇతర దేశాలలోను జరిగిపోయిన వ్యాఖ్యల సారాంశం! ఆయన ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున నామాంకితుడు-నామినీ-కావడం అమెరికా సమాజంలో నిహితమై ఉన్న జాతి దురహంకార భావానికి చిహ్నం. జాతీయతా నిష్ఠ ప్రతి సమాజంలోను అభిలషణీయమైన సుగుణం. కానీ జాతీయతా నిష్ఠ పేరుతో ఇతర జాతులను దేశాలను సమాజాలను సంస్కృతులను హీనంగా భావించడం దురహంకారం. డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి దురహంకార దూషితుడు, ప్రపంచం నెత్తిన అమెరికా తన పాదాలను పెట్టాలని కలలు కంటున్నాడు. ఈ జాతీయ దురహంకారం శతాబ్దుల పూర్వం అమెరికాలో రెడ్‌ఇండియన్ వంటి అనాది జాతులను హత్య చేసింది. ఈ జాతీయ దురహంకారం తెల్లరంగు లేని మానవులను శతాబ్దులపాటు చిత్రహింసల పాలు చేసి బానిసలుగా అమ్మింది. ఈ జాతీయ దురహంకారం శతాబ్దుల పాటు ప్రపంచంలోని అనేక దేశాల స్వాతంత్య్రాన్ని హరించింది., ఆయా దేశాల భౌతిక సాంస్కృతిక సంపదలను కొల్లగొట్టింది! నిజానికి ఈ జాతీయ దురహంకారం అమెరికాకు ఐరోపానుంచి సంక్రమించిన వారసత్వం. అమెరికా సమాజం శతాబ్దులుగా సంస్కరణ భావాలతో నిగ్గుతేలింది, సంస్కృతమైం ది! అందువల్ల అధికాధిక అమెరికా ప్రజలు జాతీయ నిష్ఠకు, జాతీయ దురహంకారానికి మధ్యగల అంతరాన్ని గుర్తించారు! అందువల్లనే డొనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ నామాంకనం-నామినేషన్ సులభంగా లభించలేదు. ఆయన సంస్థాగతమైన ఎన్నికల-ప్రైమరీస్-లో విజయం సాధించినప్పటకీ నామాంకనం కోసం ఆయనతో పోటీపడిన ఇతర రిపబ్లికన్ అభ్యర్థులు-క్యాండిడేట్లు-ఆయనను సమర్ధించడానికి నిరాకరిస్తున్నారు. ఇందుకు భిన్నంగా డెమోక్రాటిక్ పార్టీ తరపున నామాంకాన్ని-నామినేషన్-గెలుచుకున్న హిల్లరీ క్లింటన్‌ను పార్టీలోని ప్రత్యర్థి అభ్యర్థులు బలపరుస్తున్నారు. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున హిల్లరీ, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయనున్నారు!
అంతర్జాతీయ సమాజం స్వరూప స్వభావాలలో ప్రాబల్యపు తీరు తెన్నులలో ఆధిపత్యపు పోరాటాలలో గత శతాబ్ది ఆరంభం నాటికి, ఈ శతాబ్ది ఆరంభం నాటికి విప్లవాత్మకమైన పరివర్తన వచ్చింది! తెల్లరంగు పులుముకున్న జాతులు ప్రపంచాన్ని తమ గుప్పెట పట్టుకోవడం గత శతాబ్ది ఆరంభం నాటి పైశాచిక చరిత్ర! ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు స్వేచ్ఛగా స్వతంత్రంగా మనుగడ సాగిస్తుండడం ఈ శతాబ్ది ఆరంభంనాటి ముచ్చట! అందువల్ల తమ దేశం మళ్లీ అన్ని దేశాల నెత్తికెక్కి తైతక్కలాడాలన్న ట్రంప్ వంటివారి పగటి కల నెరవేరడం కల్ల! ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైనప్పటికీ, ఎన్నిక కాకపోయినప్పటికీ ఒక జాతిని మరొక జాతి ఒక దేశాన్ని మరొక దేశం శాసించే అంతర్జాతీయ ఆధిపత్య వ్యవస్థ మరోసారి అవతరించడం కల్ల. అందువల్ల డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్య స్వప్నం వాస్తవం అయ్యే అవకాశాలు లేవు. అసాధ్యమైన కాంక్షలతో కుతకుతలాడడం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పైశాచిక ఆనంద భావం-సాడిజమ్! అందువల్లనే ట్రంప్ నామినేషన్ పట్ల అమెరికాలోనే కాదు సొంత పార్టీలోనే వ్యతిరేక భావాలు వెల్లువలెత్తుతున్నాయి. ట్రంప్ గెలిచాడు...పార్టీ చీలింది అన్నమాటలు పుటపుటలుగా మొదలై చిటపటలుగా చెలరేగుతున్నాయి. గురువారం రాత్రి-మన దేశంలో శుక్రవారం ఉదయం ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో రిపబ్లికన్ పార్టీ జాతీయ మహాసభ-నేషనల్ ముగిసిన తరువాత కూడ ఈ చిటపటలు చల్లారడం లేదు!
డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నామినీగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండడం రోనాల్డ్‌రీగన్‌ను గర్తుకు తెస్తున్నది. డెబ్బయి ఏళ్లు దాటిన తరువాత అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన అతి కొద్ది మందిలో రీగన్ ఒకరు. 1980 నవంబర్‌లో జరిగిన ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ నామాంకితుడుగా పోటీ చేసిన రీగన్ అప్పటి అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ నామాంకితుడు జేమ్స్‌ఎర్ల్ కార్టర్‌ను ఓడించాడు. 1968లోను 1972లోను అధ్యక్షుడుగా ఎన్నికైన రిచర్డ్ నిక్సన్ అవినీతి గ్రస్తుడై 1974లో పదవిని కోల్పోయాడు. తాను చెడ్డపేరు తెచ్చుకోవడం మాత్రమేకాక తన రిపబ్లికన్ పార్టీకి చెడ్డపేరు తెచ్చి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నిక్సన్ తరువాత అధ్యక్షుడైన జెరాల్డ్ ఫోర్డును 1976 నాటి ఎన్నికలలో జిమీ కార్టర్ ఓడించగలిగాడు. అయితే కార్టర్‌కు రెండవసారి పదవి దక్కకుండా చేసిన ఘనత రీగన్‌ది. రీగన్ రాజకీయ వేత్తకాదు, నటుడు. ఇప్పుడు రీగన్ పార్టీకి చెందిన ట్రంప్ కూడ రాజకీయవేత్త కాదు. వాణిజ్యవేత్త! ట్రంప్ ఇంతవరకు ఏ ఎన్నికల్లోను పోటీ చేయలేదు! 1980లో రొనాల్డ్ రీగన్‌ను ఆదరించినట్టుగానే డొనాల్డ్ ట్రంప్‌ను కూడ అమెరికావోటర్లు ఇప్పుడు గెలిపిస్తారన్న అత్యాశాభావాన్ని ట్రంప్ అనుచరులు ప్రచారం చేస్తున్నారు! ప్రస్తుతం డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్ సమర పథంలో ముందున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్‌కు ప్రజల మద్దతు కొద్దికొద్దిగా పెరుగుతోందట! కొన్ని కీలకమైన రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రాలలో ట్రంప్ అగ్రగామిగా వున్నట్టు కూడ కొన్ని సర్వేల వారు ప్రచారం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకునే సంక్లిష్టమైన వరణమండలి-ఎలొక్టరల్ కాలేజ్-లో అమెరికాలోని యాబయి రాష్ట్రాలకు, రాజధాని వాషింగ్టన్ ఉన్న కొలంబియా జిల్లాకు ప్రతినిధులు ఉన్నారు. ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కాంగ్రెస్ ఉభయ సభలలో ఉన్న ప్రాతినిధ్యానికి సమాన సంఖ్యలో వరణమండలిలో ప్రతినిధులుంటారు. అందువల్ల మొత్తం ప్రతినిధుల సంఖ్య 538! సెనెట్‌లోను, ప్రతినిధుల సభలోను ఉన్న సభ్యుల సంఖ్యకు ఇది సమానం. ప్రతి రాష్ట్ర వోటర్లు ఈ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఒక రాష్ట్రంలో మెజారిటీ ప్రజల వోట్లు వచ్చిన నామినీకి ఆ రాష్ట్రం ప్రతినిధులు మొత్తం లభిస్తారు. అందువల్ల అమెరికా అధ్యక్షుని ఎన్నికలలో ప్రజల వోట్లకంటె ప్రతినిధులకు ప్రాధాన్యం. పనె్నండు పెద్ద రాష్ట్రాలలో గెలిచిన నామినీ మిగిలిన ముప్పయి ఎనిమిది రాష్ట్రాలలో ఓడినప్పటికీ అధ్యక్షుడుగా ఎన్నికైపోతాడు.
డొనాల్డ్ ట్రంప్ ఈ సంక్లిష్ట ఎన్నికల విధానంపై ఆశలుపెట్టుకుని ఉన్నాడు! దీర్ఘకాలం-నవంబర్ వరకు జరిగే ప్రచారం కూడ తనకు లాభిస్తుందని ఈ ధనవంతుని ధీమా..తాను ఎన్నికయినట్టయితే ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్-ను రద్దు చేసి అమెరికాతత్వా-అమెరికాఇజం-న్ని పునరుద్ధరిస్తానని ట్రంప్ జాతీయ మహాసభ చివరి రోజున ప్రకటించాడు. ప్రపంచీకరణ వల్ల తమ దేశంలోకి విదేశాలవారు, విదేశీయ సంస్థలు చొరబడిపోయి తమ ప్రజలను దోచుకుంటున్నాయట! ప్రవర్ధమాన దేశాలకు ప్రధానంగా మన దేశానికి ట్రంప్ చెపుతున్న ప్రపంచీకరణ పాఠం ఇది...