సబ్ ఫీచర్

అహేతుక విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశం రెండు ముక్కలైంది. కొన్ని వేల సంవత్సరాలుగా అఖండ భారత్‌గా ఉండి దేశం విభజన చెందడం నిజంగా ఎంతో బాధాకరమైన అంశమే. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి? గత జూన్ నెలలోజరిగిన రెండు సంఘటనలను పరిశీలిద్దాం. జూన్ నెల మొదటివారంలో పాతబస్తీలో ‘మతసహనం’ (కమ్యూనల్ హార్మనీ) పేరుతో మీనార్ తోటలో ఒక చర్చాకార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇందులో తీస్తా సెతల్వాడ్, మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుషార్ గాంధీ మాట్లాడుతూ దేశంలో కులాల జాడ్యం కొన్నివేల సంవత్సరాలుగా ఉన్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపాకు రాజ్యసభలో మెజారిటీ వచ్చి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగంలో మార్పులు తెస్తుందని, అప్పుడది గాంధీ కలలుగన్న దేశంగా ఉండబోదన్నారు. అందువల్ల తిరిగి మనం గాంధీ ఆశించిన రాజ్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. అంతవరకు గాంధీగారి మునిమనుమడి ఉద్బోధ బాగానే ఉంది. కానీ మొన్నటి వరకు సాగిన కాంగ్రెస్ పాలన గాంధీజీ ఆదర్శాలకు అనుగుణంగానే జరిగిందా? ఇప్పటి వరకు దేశంలో 98 విశ్వవిద్యాలయాలు, వేద విద్యాసంస్థలు- నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతోనే నెలకొల్పి ఉన్నాయి. మొత్తం 28 క్రీడాపోటీలు వారిపేరునే నిర్వహిస్తున్నారు. 15 స్కాలర్‌షిప్‌లు కూడా వారిపేర్లతోనే ఇస్తున్నారు. 450 ప్రాజెక్టులు, ప్రణాళికలు, ఆ పేర్లతోనే కొనసాగుతున్నాయట. సమాచారహక్కు చట్టం కింద సేకరించబడ్డ సమాచారం ఇది. మరి ఏ ఒక్కదానికీ మహాత్ముని పేరు లేదు. మరి తుషార్ గాంధీ చెప్పిన ‘రామరాజ్యం’ ఎక్కడైనా వినబడిందా?
ఇక రెండో సంగతి, కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి జూన్ మొదటివారంలో జరిగిన దివంగత కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ‘ప్రస్తుత రాజకీయాలు, సమస్యలు’ అన్న అంశంపై ప్రసంగించారు. ‘ఇప్పుడు మతశక్తులనుంచి ప్రమాదం పొంచి ఉందం’టూ పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్, భాజపాలను నిందించారు. ప్రధాని మోదీ కామన్ సివిల్‌కోడ్‌ను ప్రవేశపెట్టి, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణను రద్దు చేయడానికి యత్నిస్తారని, సెక్యులర్ శక్తులన్నీ, చండ్ర రాజేశ్వరరావునుంచి స్ఫూర్తిని పొంది ఈ యత్నాలను వ్యతిరేకించాలన్నారు. ఈ విమర్శను ఏమనాలి?
నిజాలు ఒక్కసారి పరిశీలిద్దాం. 1955లో ఒక్క హిందువులకోసమే ‘హిందూ వివాహచట్టం’ ప్రవేశపెట్టబడింది. ఈ చట్టంతో బహుభార్యత్వాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాని ముస్లింల విషయమై ఆరు దశాబ్దాలు దాటినా ఈ అంశంపై ప్రభుత్వం నోరు మెదపలేదు. ఫలితంగా ముస్లింలు ఒకేసమయంలో నలుగురు భార్యలను కలిగివుండవచ్చు. మాతృత్వం స్ర్తికి భగవంతుడు ప్రసాదించిన వరం. దానె్నవరూ కాదనలేరు. కానీ ముందు,ముందు సహజంగానే దేశంలో హిందువుల సంఖ్య తగ్గుతుంది. ముస్లింల జనాభా తప్పక పెరిగితీరుతుంది. ఎందుకంటే వారికి కనీసం నలుగురు సంతానం ఉండటం సాధారణమవుతుంది కదా. అప్పుడు ముస్లింల జనాభా మెజారిటీకి చేరుకుంటే ఇంకో దేశ విభజన జరగదని, రేపు కనబడని ఈ సెక్యులర్ బృందం హామీ ఇవ్వగలదా?
మరో సంఘటన. పాకిస్తాన్‌లోని ఖైబర్-్ఫక్తూన్ ఖ్వా ప్రభుత్వం, ‘యూనివర్సిటీ ఆఫ్ జిహాద్’ అని పిలువబడే విద్యాసంస్థను ఆఫ్గన్ తాలిబన్‌ల ఆధ్వర్యాన నిర్వహిస్తోంది. తాలిబన్ల మాజీ చీఫ్ ముల్లా ఒమర్ ఆ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడే. ఈ సంస్థకు పాకిస్తాన్ మొత్తం 300 మిలియన్ రూపాయల విరాళం ఇచ్చింది. మరి ఈ తాకిడిని మన ప్రభుత్వం తట్టుకోగలదా? మనదేశంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు అసలు ఉన్నాయా? ఇప్పటికే మనదేశంలో ‘స్వచ్ఛంద సంస్థలు’గా పిలువబడే అనేక సంస్థలు ఏఏ పనులు చేస్తున్నాయి? వాటికి విదేశాలనుంచి ఎంతెంత విరాళాలు అందుతున్నాయి? లెక్కతేలక మన ప్రభుత్వం తల్లక్రిందులవుతోంది. మరి ఈ విషయాలు పై నాయకమణ్యులకు తెలియవా? తెలిసినా మనకు ఏం నష్టం కలుగదనే ధీమా వారిది. ఆలోచించండి. భారత్‌మాతాకీ జై అని ఎట్టిపరిస్థితుల్లోనూ అనను అనే రాజకీయ నాయకులు మనకు ఉన్నారు కదా! మరి ఈ దేశం ఎవరిది?

- చాణక్య