సబ్ ఫీచర్

ఎత్తిపోతల పథకాలే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలబయ సంవత్సరాల కిందట 1974 సెప్టెంబర్‌లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల ఆభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఐడిసి) అనేక ఆటుపోట్లకు లోనైనా చివరకు నిలదొక్కుకుని ఏటా పది లక్షల ఎకరాలకు నీరు అందిస్తోంది. వ్యవసాయ రంగానికి పెద్ద పీటనే లక్ష్యంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల వ్యవస్థ మెట్టరైతుల అభిమానాన్ని పొందగలిగింది. వ్యవసాయం అంటే కేవలం నీటి ప్రాజెక్టుల కింద సాగయ్యే భూమి మాత్రమేనన్న అపోహను ఎత్తిపోతల పథకాలు తొలగించాయి. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కూడా ఎత్తిపోతల పథకాల పట్ల నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆదరణ చూపుతోంది. 13 జిల్లాల నూతన ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తిపోతల పథకాలను పర్యవేక్షించడానికి నీటిపారుదల నిపుణులు కె.వెంకటేశ్వర్లును జాయింట్ మేనేజింగ్ డైరక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.
అసలు ఎత్తిపోతల పథకాల ఆవిర్భావమే ఒక సంచలనం. నదుల ప్రవాహానికి ఆనకట్టలు వేసి ఆ నీటిని పల్లం భూములకు సరఫరా చేయడం నాగరికత తొలిరోజుల్లోనే మొదలైంది. అయితే నీటిమట్టానికంటే ఎగువనవున్న భూములకు నీరందించడం అనేది ఎత్తిపోతలతోనే సాధ్యపడింది. ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే విద్యుత్ ఉండి తీరాలి. అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయకుండా నలభై ఏళ్ల వ్యవధిలో ఏకంగా 1662 ఎత్తిపోతల పథకాలను నిర్మించింది. దీనికోసం 1545 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇందులో ఎక్కువ మొత్తాన్ని నాబార్డు సమకూర్చింది. మరో 164 ఎత్తిపోతల పథకాలను ఇతర శాఖలనుండి స్వాధీనం చేసుకుని నిర్వహిస్తోంది. దీనివల్ల 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో పది లక్షల ఎకరాలకు నీరందుతోంది. మరో 170 ఎత్తిపోతల నిర్మాణానికి అనుమతి లభించింది. దీనివలన అదనంగా రెండున్నర లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం ఉంది. కాగా మరో 69 ఎత్తిపోతల పథకాలకు నీటి అనుమతులు లభించలేదు. ఎపిఎస్‌ఐడిసి కేవలం ఎత్తిపోతల పథకాలనే కాకుండా 20115 భారీ గొట్టపు బావులను తవ్వించింది. ఇందుకోసం 245 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3 లక్షల ఎకరాలకు నీరు అందచేసింది. ప్రస్తుతం ఈ సంస్థ గొట్టపు బావుల తవ్వకాన్ని నిలిపివేసింది. తవ్విన గొట్టపు బావులను ఆయకట్టు రైతులకు అప్పగించి వేసింది.
విజయవాడ కేంద్రంగా...
రాష్ట్రం విడిపోయినా రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఇంకా పూర్తిస్థాయలో విడిపోలేదు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై విజయవాడలోని రివర్ మేనేజ్‌మెంట్ కార్యాలయంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఫ్రారంభించింది. కె.వెంకటేశ్వర్లను జెఎండిగా నియమించింది. హైదరాబాద్ కేంద్ర కార్యాలయం పరిధిలో హైదరాబాద్, కడప గుంటూరు సర్కిళ్లు వున్నాయి. హైదరాబాద్ సర్కిల్‌లో హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన తెలంగాణ జిల్లాలు తొమ్మిది ఉన్నాయి. కడప సర్కిల్‌లో రాయలసీమకు చెందిన కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తురు జిల్లాలు ఏలూరు సర్కిల్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు గుంటూరు సర్కిల్‌లో ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలు చేరి ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడిగా 12 డివిజన్ కేంద్రాలు కూడా ఉన్నాయి.
ఐడిసిసంస్థ పదివేల ఎకరాలలోపు ఆయకట్టు భూములకు మాత్రమే ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తుంది. గతంలో ఈ పరిమితి 5వేల ఎకరాల వరకే వుండేది. 75 అశ్వశక్తికి మించి విద్యుత్ పంపులు మోటార్లు వుండే అన్ని ఎత్తిపోతల పథకాలకు ఈ సంస్థ 16 గంటల ఉచిత నిరంతర విద్యుత్‌ను ప్రత్యేక లైన్ల ద్వారా అందిస్తుంది. మొదట్లో ఎత్తిపోతల పథకాలకు 18 గంటల విద్యుత్‌ను సరఫరా చేసిన దరిమిలా దానిని 13 గంటలకు ఆ తర్వాత 9 గంటలకు కుదించారు. 2004నుండి తిరిగి 16 గంటలకు పెంచి కొనసాగిస్తున్నారు. 1995 ప్రాంతంలో ఈ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో సంస్థ శాశ్వత తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను 2541 నుండి ఏకంగా 454కి తగ్గించివేసారు. అన్ని ఎత్తిపోతల పథకాల పంప్ ఆపరేటర్లు లష్కర్లను, విద్యుత్‌మెకానిక్‌లను తొలగించివేసారు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకాలను ఆయకట్టురైతులే నడుపుకోవాల్సి వస్తోంది. అయితే గతంలో సంస్థ రైతులనుండి నీటి తీరువా వసూలు చేసేది. ఇప్పుడు రైతు సంఘాలే ఆ సొమ్మును వినియోగించుకుంటున్నాయి. గతంలో ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీలను రైతులే భరించాల్సివచ్చేది. ఇది భారం కావడంతో 80 శాతం ఎత్తిపోతల పథకాలు మూతపడిపోయాయి. తిరిగి ఎత్తిపోతల పథకాలకు 16 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అమలు తర్వాత ఊపిరి పీల్చుకున్నాయి. మెట్ట ప్రాంత రైతుల అభివృద్ధి కోసం 13 జిల్లాలలోను పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాల నిర్మాణం ఆవశ్యకతను ఈ సందర్భంగా గుర్తించాలి. జూదంగా మారిన మెట్ట సేద్యానికి ఎత్తిపోతల పథకాల నిర్మాణమే అంతిమ పరిష్కారం.

-పుట్టాసోమన్న చౌదరి