సంపాదకీయం

ఇంట నెగ్గిన హిల్లరీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో చారిత్రక రాజకీయ లాంఛనం పూర్తయింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికై హిల్లరీ రోథమ్ క్లింటన్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున నామాంకితురాలయింది. ఆమె అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం ఖాయమన్న విశ్వాసం డెమొక్రాటిక్ పార్టీ జాతీయ మహాసభలో వెల్లివిరిసింది. హిల్లరీ క్లింటన్ డెమొక్రాటిక్ పార్టీ నామాంకితురాలి-నామినీ-గా అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఖాయమని జూన్ నెల ఆరంభంలోనే స్పష్టమైంది. జనవరినుంచి అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో జరిగిన సంస్థాగత సమావేశాలలోను, ఎన్నికలలోను ఆమె ఘనవిజయం సాధించడమే ఇందుకు కారణం. జాతీయ మహాసభకు హాజరయ్యే ప్రతినిధులు పార్టీ నామాంకితులను-నామినీలను ఎన్నుకోవడం అమెరికాలోని ప్రజాస్వామ్య సంప్రదాయం. ఈ ప్రతినిధులను సంస్థాగతమైన ఎన్నికల-ప్రైమరీస్-ద్వారా ఎన్నుకుంటున్నారు. అమెరికాలోని ప్రతి రాష్ట్రంలోను ఈ సంస్థాగత ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. పార్టీకి చెందిన ప్రాథమిక సభ్యులు ఈ ప్రతినిధుల ఎన్నికలో వోటర్లు! ఈ సంస్థాగతమైన ఎన్నికల ప్రహసనం కూడ సాధారణ ఎన్నికలంత ఆర్భాటంతోను అట్టహాసంతోను జరగడం అమెరికా ప్రజాస్వామ్యంలోని విలక్షణ తత్త్వం. ప్రధాన రాజకీయ పక్షాలు రెండే. డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. రెండు పార్టీలు నాలుగేళ్లకొకసారి జూలై ఆగస్టు నెలల్లో తమ జాతీయ సమావేశం-నేషనల్ కనె్వన్షన్‌ను జరుపుతున్నాయి. ఈ జాతీయ సమావేశంలో అధ్యక్ష పదవికి పోటీ చేసే పార్టీ నామాంకితుల-నామినీ- లను ఎన్నుకుంటారు. ఇలా ఎన్నుకునే ప్రతినిధులను పార్టీ సాధారణ సభ్యులు ప్రైమరీల ద్వారా ఎన్నుకుంటున్నారు. డెమొక్రాటిక్ పార్టీ మొత్తం ప్రతినిధులు 4,765 కాగా పార్టీ నామినేషన్ పొందడానికి 2383 మంది మద్దతు అవసరం. మొత్తం ప్రతినిధులను వివిధ రాష్ట్రాలకు పార్టీ ప్రాథమిక సభ్యుల సంఖ్య ప్రాతిపదికగా కేటాయిస్తారు. ఒక్కో రాష్ట్రంలో కాని, కొన్ని రాష్ట్రాలలో కాని ఒకేరోజున ఈ ప్రైమరీలు జరుగుతున్నాయి. ఇలా జనవరి చివరినుండి జూన్ చివరి వరకు వివిధ రాష్ట్రాలలో డెమొక్రాటిక్ పార్టీలోను, రిపబ్లికన్ పార్టీలోను సంస్థాగత స్పర్ధలు జరిగాయి. అధ్యక్షుని ఎన్నిక జరిగే ప్రతి నాలుగేళ్లకోసారి రెండు పార్టీలు తమ నామినీలను ఎన్నుకోవడానికి ఇలా ప్రైమరీలను నిర్వహిస్తున్నాయి. జాతీయ మహాసభలో వివిధ అభ్యర్థులను బలపరిచే ప్రతినిధులను పార్టీ ప్రాథమిక సభ్యులు ఇలా ఎన్నుకుంటున్నారు. జూన్ 7వ తేదీ నాటికి అత్యధిక రాష్ట్రాలలో ప్రైమరీలు పూర్తయ్యాయి. హిల్లరీ క్లింటన్‌కు అప్పటికే మెజారిటీ ప్రతినిధులు లభించారు. ఆమెతో పార్టీ నామాంకనం కోసం పోటీపడిన మరో అభ్యర్థి బెర్నీ సాండర్స్‌కు 1569 మంది ప్రతినిధుల మద్దతు లభించింది. అందువల్ల పార్టీ అభ్యర్థిగా క్లింటన్ ఎంపిక కావడం ఖాయమని జూన్ 7వ తేదీననే స్పష్టమైంది. అందువల్ల ఫిలడెల్ఫియాలో జరుగుతున్న పార్టీ జాతీయ మహాసభలో ఆమెను నామినీగా బుధవారం ఎంపిక చేయడం కేవలం లాంఛనమైంది...
ఈ అధికార లాంఛనం పూర్తి కావడం కూడ మరో చారిత్రక పరిణామం. ఎందుకంటే రెండు వందల ఏళ్లకు పైగా నడుస్తున్న అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో రిపబ్లికన్ పార్టీకానీ డెమొక్రాటిక్ పార్టీకాని అధ్యక్ష పదవికై పోటీ చేయడానికై ఒక మహిళను ఎంపిక చేయలేదు! 1776 జూలై నాలుగవ తేదీన అమెరికాగా పేరు మోసిన పదమూడు రాష్ట్రాలవారు బ్రిటన్‌పై తిరుగుబాటుచేసారు. స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఆ తరువాత బ్రిటన్‌తో ఈ పదమూడు రాష్ట్రాల వారు యుద్ధం చేసారు, బ్రిటన్ ప్రభుత్వాన్ని, దళాలను వెళ్లగొట్టారు. రాజ్యాంగాన్ని రచించుకున్నారు. పదమూడు రాష్ట్రాల వారు ఒకే దేశంగా ఏర్పడ్డారు. ఈ మొత్తం స్వాతంత్య్రం ప్రక్రియకు నాయకత్వం వహించిన జార్జి వాషింగ్టన్ 1789లో తొలి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. అప్పటికి మధ్య అమెరికా ఖండపు తూర్పుతీరానికి మాత్రమే పరిమితమై ఉండిన పదమూడు రాష్ట్రాలు అమెరికా పశ్చిమంగా విస్తరించి యాబయి రాష్ట్రాలతో ప్రపంచంలోని అతి పెద్ద దేశాలలో ఒకటిగా ఏర్పడడం తరువాతి కథ...అట్లాంటిక్ తీరానికి పరిమితమై ఉండిన అమెరికా పసిఫిక్ మహాసముద్రం వరకూ పడమరగా విస్తరించడం దశాబ్దుల జాతీయ చైతన్యానికి సాక్ష్యం! ఇంత గొప్ప చైతన్యవంతమైన జాతి 1920 వరకు మహిళలకు సమాన హక్కులను ప్రసాదించలేదు. వారికి వోటు హక్కు లేదు!
అమెరికా ప్రజాస్వామ్యపు డొల్లతనానికి ఇది ఒక చారిత్రక సాక్ష్యం. 1789నుంచి 1920 వరకు నూట ముప్పయి ఒక్క ఏళ్లపాటు పురుషులు మాత్రమే ఎన్నికలలో పాల్గొనడం అర్ధ ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఆఫ్రికా సంతతికి చెందిన నల్లజాతి ప్రజలను ఐరోపా సంతతికి చెందిన అమెరికన్లు శతాబ్దులపాటు అణచివేయడం వేరే కథ...కానీ 1920లో వోటు హక్కును పొందిన అమెరికా మహిళ అధ్యక్ష పదవికి ఒక ప్రధాన పక్షం తరఫున పోటీ చేయడానికి సరిగ్గా తొంబయి ఆరేళ్లు పట్టింది! అమెరికాలోని స్ర్తి పురుష సమానత్వపు చరిత్రకు అద్దం ఇది. ఇప్పుడు హిల్లరీ క్లింటన్‌ను రెండురకాల ఘనత దక్కింది. అధ్యక్ష పదవికి ప్రధాన పక్షాల తొలి నామినీ ఆమె...ఒక మాజీ అధ్యక్షుని భార్య అధ్యక్ష పదవికి పోటీ చేయడం కూడ ఇది మొదటిసారి! ఆమెకు ఇది మరో ఘనత! హిల్లరమ్మ భర్త బిల్ క్లింటన్ 1992లో అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1996లో మళ్లీ గెలిచి 2001 జనవరి 20వ తేదీ వరకు అధ్యక్షుడుగా కొనసాగాడు. హిల్లరీ గెలిచినట్టయితే ఈ భార్యాభర్తలు అధ్యక్షుని అధికార నివాసమైన శే్వత సౌధం-వైట్ హౌస్‌లో మరోసారి ప్రవేశించనున్నారు. అది మరో చారిత్రక విశేషం కాగలదు! డెమొక్రాటిక్ పార్టీ నామాంకనం కోసం హిల్లరీ క్లింటన్ 2008లో విఫలయత్నం చేసింది. నామాంకనం-నామినేషన్ కోసం పార్టీ ప్రైమరీలలో పరస్పరం పోటీపడేవారిని అమెరికాలో అభ్యర్థులు-కాండిడేట్స్- అని అంటున్నారు. 2008లో అభ్యర్థినిగా డెమొక్రాటిక్ పార్టీ సంస్థాగత సమర రంగప్రవేశం చేసిన హిల్లరీ క్లింటన్ అప్పుడు అభ్యర్థినిగానే మిగిలిపోయింది, నామినీ కాలేకపోయింది. ఆమెతో పోటీపడిన బరాక్ హుస్సేన్ ఒబామా పార్టీ నామినేషన్ సాధించడమే కాక అధ్యక్షుడుగా ఎన్నిక కాగలిగాడు. ఒబామా మంత్రి వర్గంలో చేరిన హిల్లరీ క్లింటన్ 2013 జనవరి 20 వరకు విదేశాంగ మంత్రి-సెక్రటరీ ఆఫ్ స్టేట్-గా పనిచేసింది.
ఈ ప్రభుత్వ విధాన వారసత్వం హిల్లరీ విధానాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ఆమె భర్త బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా వుండిన 1993వ 2001 సంవత్సరాల మధ్యకాలంలో అమెరికా ఏకైక అగ్రరాజ్యం. సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోవడం అందుకు కారణం. ఆ సమయంలో అమెరికా మన దేశంకంటే పాకిస్తాన్‌కు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ వ్యవహారంలో క్లింటన్ మనకు వ్యతిరేకంగా వ్యవహరించాడు. విదేశాంగ మంత్రిగా హిల్లరీ కూడా మన దేశంకంటె పాకిస్తాన్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే గత నాలుగేళ్లలో అమెరికా పాకిస్తాన్‌కు దూరంగా మనకు దగ్గరగా జరుగుతోంది. చైనా ప్రభావం ఇందుకు కారణం..ఏమైనప్పటికీ రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌కంటె హిల్లరీ మనకు సన్నిహితమైనది...