మెయన్ ఫీచర్

పులికే దిక్కులేదు, జింకల మాట..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రెండు నల్ల జింకలనూ హిందీ చలన చిత్రనటుడు సల్మాన్‌ఖాన్ చంపాడన్నది పద్దెనిమిదేళ్లుగా దేశ ప్రజల విశ్వాసం. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాం తంలో ఆ జింకలను క్రీస్తుశకం 1998 సెప్టెంబర్ 26న, 28న ఆయనే హత్యచేసినట్టు అభియోగాన్ని విచారించిన జోధ్‌పూర్ మహానగర ప్రధాన న్యాయమూర్తి కూడా విశ్వసించారు. ఈ రెండు జింకలను అతగాడే చంపినట్టు ఎలాంటి సందేహానికి కాని అవకాశం లేని రీతిలో ధ్రువపడినట్టు ఆ ప్రధాన న్యాయమూర్తి 2006లోనే తీర్పు చెప్పారు. మొదటి జింకను చంపినందుకు సంవత్సరంపాటు రెండవ జింకను కూడ పథకం ప్రకారం చంపినందుకు ఐదుసంవత్సరాలపాటు సల్మాన్‌ఖాన్ కారాగృహ నిర్బంధంలో వుండాలని ఆ మహానగర న్యాయమూర్తి విధించి ఉన్నాడు. ఆ తరువాత జోధ్‌పూర్ జిల్లా న్యాయస్థానం కూడ సల్మాన్‌ఖాన్ చేసిన ఘోర నేరాన్ని ధ్రువపరిచింది. అందువల్ల ఈ పద్దెనిమిది ఏళ్లుగా సల్మాన్‌ఖాన్ వన్య మృగ హంతకుడు అన్నది ధ్రువపడిన సత్యం. గంతులేస్తూ ముచ్చట గొలిపే జంతువులను చూసినప్పుడు కొందరికి వాటిని పట్టుకుని నిమిరి ముద్దు చేయాలని అనిపిస్తుంది. అందునా ఈ నల్లచార జింకలు మరీ ముచ్చటగా వున్నాయట. ఈ నల్ల జింకలు-కృష్ణ మృగాలు-మన దేశంలో చరిత్ర ప్రసిద్ధికెక్కినవి. ఈజింకలు మన దేశానికి ప్రత్యేకమైనవన్నది భౌగోళిక వాస్తవం. కృష్ణసార మృగం సంచరించడమే భూమి పవిత్ర యజ్ఞవాటిక అని, అందువల్ల భారతదేశం శుభంకరమైన విశ్వ హితకరమైన భూమి అని పురాణాలు ధర్మశాస్త్రాలు వివరించాయట! అయితే ఈ భూమి పట్ల,ఈ సంస్కృతిపట్ల మక్కువలేని విదేశీయుల దురాక్రమణ జరిపిన సమయంలో మొత్తం ప్రవృత్తి మారిపోయింది. ‘నితాంత అపార భూతదయ’ జీవన స్వభావమైన హిందుస్థానంలో జీవహింస పరాకాష్ఠకు చేరింది. ఎందుకంటే ముచ్చట గొలిపే జంతువులను నిర్దాక్షిణ్యంగా విచక్షణారహితంగా చంపి భోం చేయడం పాశ్చాత్యుల స్వభావం. బ్రిటన్ దుండగులు, అంతకు పూర్వం తురు ష్కులు మన నెత్తికెక్కి తొక్కిన కారణంగా మన దేశంలో పుట్టిపెరిగిన అనేకమందికి జంతు హననం ప్రవృత్తిగా మారింది. అందువల్ల కృష్ణ మృగాలను చూసినోరూరిన సల్మాన్‌ఖాన్ వాటిని చంపాడన్నది పద్దెనిమిదేళ్లపాటు ప్రజల విశ్వాసం. కానీ ఈ విశ్వాసం తప్పని రాజస్థాన్ ఉన్నత న్యాయస్థానం నిర్మల జిత్ కౌర్ జులై 25న తీర్పు చెప్పారు. అందువల్ల సల్మాన్‌ఖాన్ ఆ రెండు జింకలను చంపలేదన్నది ఇప్పటికి నిగ్గుతేలిన నిర్ధారణ! ఉన్నత న్యాయస్థానం సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా నిర్ధారించింది!
విదేశీయుల దురాక్రమణ సమయంలో వారి ‘చంపి భోంచేసే ప్రవృత్తి’ కారణంగా కృష్ణ మృగాలు మాత్రమే కాదు అనేక వన్య మృగాలు అంతరించాయి. గోసంతతి ధ్వంసమైపోయింది! అందువల్లనే అంతరించిపోతున్న ఈ కృష్ణసార మృగాలకు రాజస్థాన్ ప్రభుత్వం రక్షణ హరిత వాటికలను ఏర్పాటు చేసిందట. ఈ వాటికలోకి చొరబడి జింకలను చంపినది సల్మాన్‌ఖాన్ కాని పక్షంలో మరెవరో ఈ హత్యలను చేసి వుండాలి. హత్యలు చేయని సల్మాన్‌ఖాన్‌ను ఈ మృగ హత్యా అభియోగంలో పోలీసు లు ఎందుకని ఇరికించారు? ఆయన ఏమీ మామూలు మనిషి కాదు, పలుకుబడి కలిగిన ప్రసిద్ధుడు. ఇంతటి ఘరానా నటుడిని అక్రమంగా వన్యమృగ హననం అభియోగంలో రాజస్థాన్ పోలీసులు ఇరికించడం ఎలా సంభవమైందన్నది ఎప్పటికీ తేలదు! అది సమస్య కాదు, నిరంతరం జరిగిపోతున్న జంతు హననం అతి ప్రధాన సమస్య. అపురూపమైన జింకలను, రాజస్థాన్ వన్యప్రాణిగా ప్రభుత్వం వారి గుర్తింపు పొందిన జింకలను చంపేస్తున్నారు. ఇలా చంపేయడం విదేశీయుల పాలననాటి విచక్షణా రహితమైన మాంస భక్షణ వారసత్వం! మన దేశంలో అత్యధికులు మాంస భుక్కులైనప్పటికీ విచక్షణా యుతంగా మాత్రమే జంతు వధ చేయడం యుగాలనాటి సంప్రదాయం.
‘నమాంస భక్షణే దోషః
నచ మద్యేన మైథునే
ప్రవృత్తిరేవ భూతానాం
నివృత్యస్తు మహాఫలా...’
అన్నది ఈ దేశంలో విచక్షణ వికసించినతీరు. ‘మాంస భక్షణం, మద్యం సేవించడం, లైంగిక శృంగారం వంటి కలాపాలు తప్పుకాదు. వాటిపట్ల ఆసక్తి మానవ సహజం, కాని వాటిలో ఒక్కదానిని కాని అన్నింటినీ కాని విడనాడడం వల్ల మహాఫలితం, మంచి ఫలితం లభిస్తుంది..’ అందువల్ల మన దేశంలో మాంసాహారులు మాంసాన్ని అప్పుడప్పుడు భోగంగా మాత్రమే తినేవారు. పాశ్చాత్యుల వారసత్వం వల్ల ప్రతిరోజు మాంసం మెక్కే దుష్ట సంప్రదాయం మొదలైంది.పాశ్చాత్య వాసనలంటని గ్రామాల్లో ప్రజలు మాంసం తరగడానికి ఉపయోగించే కత్తులను కూరగాయలను తరగడానికి ఉపయోగించరు. అలాగే కూరలను పండ్లను తరిగేందుకు వాడే చాకులను కత్తిపీటలను మాంసం తరగడానికి వాడరు. మాంసం తరిగిన కత్తిని ప్రత్యేకంగా ఇంటి పైభాగంలో వుంచేవారట! అందువల్లనే చూరుకత్తి, చురకత్తి అనే పేర్లు ప్రచారమయ్యాయి. మాంసం వండే కుండలు వేరు, మామూలుగా రోజూ వండుకునే కుండలు పాత్రలు వేరు..ఇదీ భారతీయులు మాంసం తినే పద్ధతిలోని విచక్షణ! మాంసాహారం భోగం, పాయసమూ, చిత్రాన్నాలు, హోళిగలు, గారెలు కూడా భోగం! మాంసం తినని వారుకాని, తినేవారు కాని భోగాన్ని రోజూ అనుభవించరు. ప్రతిరోజు బొబ్బట్లు, గారెలు ఎవరైనా తింటారా? తింటే రోగం వస్తుంది, బొజ్జలు పెరిగి తమ కాళ్లమీద తాము నిలబడలేని స్థితి ఏర్పడుతుంది. మాంసాహారం కూడ అంతే! అందుకే మేషాన్ని-మేకను తినే మాంసాహారులు కాని, మాషాన్ని-మినపగారె-మెక్కే శాకాహారులు కాని మన దేశంలో ప్రతిరోజు వాటిని తినలేదు!
రోజు ఇలా భోగాహారాన్ని తినే చిత్తవృత్తి విదేశీయ పాలనలో మాత్రమే మనకు సంక్రమించింది. రోజుకు నాలుగైదు సార్లు తినడం నాగరికతగా మారిపోయింది. ఈ తినే నాగరికత ఆవులను తినేసింది, అడవులను తినేసింది! జంతుజాలం, వృక్షజాలం కలిసి జీవజాలం అవుతోంది. అందువల్లనే ప్రతి జీవకణం పరస్పర విధ్వంస కరంగా కాక పరస్పర పరిపోషకం కావడం ప్రకృతి. ఈ ప్రకృతిని ధ్వంసం చేయడమే వికృతి, ప్రకృతిని పోషించడం సంస్కృతి..ఈ సంస్కృతిని మనదేశంలోకి చొరబడిన జిహాదీలు చెరిచారు, ఐరోపా తెల్లరాక్షసులు చెరిచారు! బ్రిటన్ దుండగులు మనదేశంలోకి చొరబడిన ఆరంభ కాలంలో మన భూమిపై యా బయి ఐదు శాతం అడవులు వుండేవి. వారు వెళ్లిన నాటికి, అటవీ విస్తీర్ణం ముప్పయి శాతానికి పడిపోయింది. రెండు ప్రపంచ యుద్ధ సమయాలలోను ఆంగ్లేయులు అడవులను నరికివేసి కలపను భారీగా తరలించుకుపోయారు! జంతు హననం ఆంగ్లేయుల నాగరికత! బ్రిటన్ భావదాస్యం వదలని వారు దేశంలో పెరిగిపోతుండడం నడుస్తున్న చరిత్ర...
ఆంగ్లేయుల పరమోన్నత అధికారం- పారవౌంటసీ-పరిధికి లోబడి అనేకమంది స్వదేశీయులు 1947 వరకు తమ సంస్థానాలను పాలించారు, అలాంటి సంస్థానాల్లో మైసూరు ఒకటి. మైసూర్ సంస్థానంలో పెద్ద బృందావనం వుండేదట. ఆ బృందావనంలో వేల ఆవులు వుండేవి. ప్రతి సంస్థానంలో బ్రిటన్ పెత్తందార్ల ప్రతినిధి ఒకడుండేవాడు. ఈ ప్రతినిధి-రీజెంట్ అప్పుడప్పుడు మారిపోతుండేవాడు. క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దిలో అలా మైసూరు సంస్థానానికి కొత్త బ్రిటన్ ప్రతినిధి వచ్చాడట! మైసూరు రాజు ఆ ప్రతినిధిని తమ బృందావనానికి తీసుకుని వెళ్లి ఘనంగా చూపించాడు. ఆవులు, పెయ్యలు, కుర్రలు, కోడెలు, దూడలు, గుంపులు గుంపులుగా గంతులేస్తుండిన దృశ్యం ఆవిష్కృతవౌతూ ఉంది. ఆ గోసంతతిలో రాజుగారికి మరీ ఇష్టమైన చిట్టిదూడలు కొన్ని వుండేవట! వాటిలో మరింత ముచ్చటగొలిపే బాలనందీశ్వరుని వంటి దూడ ఒకటి! రాజు ఆ దూడను కూడ ఆ తెల్లచర్మం వాడి కి చూపించి మురిసిపోయాడు, ఆంగ్లేయు డు మరింత మురిసిపోయాడు...ఆ దూడను చంపి తనకు వండిపెట్టమని బృందావనం ఫ్రధాన రక్షకుడ్ని ఆ బ్రిటన్ ముష్కరుడు ఆదేశించాడట....అమెరికా నుండి వెళ్లిన తెల్లవారు ఆఫ్రికా అడవుల్లోని వందల వేల నెమళ్లను చంపి తినడం గత శతాబ్ది చరిత్ర! తిండికోసం విచక్షణా రహితంగా చిన్న జంతువులను, పెద్ద జంతువులను చంపేయడం పాశ్చాత్య పైశాచిక నాగరికతలో భాగం. బ్రిటన్‌వారు ఈ నాగరికతను మనకు అంటించిపోయారు!
హోమర్ గ్రీకు సాహిత్యంలో మొదటి కవి. ఆయన ‘ఇలియడ్’, ‘ఒడైసీ’ అన్న గొ ప్ప ఇతిహాస కావ్యాలను రచించాడట! ఈ కావ్యాలు మహాభారతం, రామాయణం వంటివట! ఇంకా గొప్పవని పాశ్చాత్యులు ప్రచారం చేసారు. హోమర్ క్రీస్తునకు పూర్వం ఎనిమిదవ శతాబ్దిలో వుండేవాడట! మహాభారతం రాసిన వ్యాసుడు-కృష్ణ ద్వైపాయనుడు-క్రీస్తునకు పూర్వం ముప్ప యి రెండవ శతాబ్దినాటివాడు. రామాయణకర్త వాల్మీకి లక్షల ఏళ్లకు పూర్వం యుగాలకు పూర్వం జీవించాడు. ఒక చిన్న పక్షిని వేటగాడు చంపడాన్ని వాల్మీకి తీవ్రంగా నిరసించాడు! చిట్టిచేపను వైవస్వత మనువు ఎలా రక్షించాడో వ్యాసుడు వివరించాడు. హోమర్ ఎద్దులను చంపడం, వాటి మాం సాన్ని కాల్చడం, ఆ కాల్చిన మాంసాన్ని గోధుమ గంజిలో కలిపి ఆరగించడం వంటి అహార వైపరీత్యాన్ని పదే పదే వర్ణించాడట! కవి సమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తన ‘హెలీనా’ అన్న చారిత్రక రచనలో ఈ సంగతిని ప్రస్తావించి నిరసించాడు! ఎద్దులను పెయ్యల-ఆవులు-ను చంపడం వేరు...ఈప్రక్రియను నాగరికతలో భాగంగా భావించి ఉదాత్తంగా చిత్రీకరించడం వేరు...హోమర్ గోహననాన్ని నిరసించలేదు! ఇదీ తేడా...బ్రిటన్ పాలకులు మన దేశంలో సైతం ఈ తేడాను లేకుండా చేసిపోయారు.
అందువల్లనే నిష్కారణంగా, నిష్కరుణగా పెంపుడు జంతువులను, అడవి జంతువులను చంపేస్తున్నారు. ఇటీవల భాగ్యనగర శివారులో ముచ్చటైన మూడు కుక్కపిల్లలను కొందరు యువకులు మంటలలో కాల్చి చంపి ఆనందించారట! చైనా మనదేశంలోని వందలాది పులులను భోంచేసింది, ఆఫ్రికాలో ఏనుగులను చంపిస్తోంది! పులులకే రక్షణ లేనప్పుడు నల్లజింకలకు, నీలి నెమళ్ల, కపిల గోవులకు, వీధి కుక్కలకు, ఊర పిచ్చుకలకు దిక్కు లేకపోవడంలో విడ్డూరం ఏముంది?

- హెబ్బార్ నాగేశ్వరరావు e-mail: 2013hebbar@gmail.com