సబ్ ఫీచర్

కృష్ణమ్మకు ఆనకట్టల అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరి పుష్కరాలు అయిపోయ్యా యి. కృష్ణ పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. సంతోషం. పండగ చేసుకుందాం. పెద్దల్ని స్మరించుకుందాం. దేవతలని పూజిద్దాం. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి. రకరకాల ప్రదేశాలలో ఘాట్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటోంది. బాగుంది.
మామూలుగా మనం షష్ఠిపూర్తి ఎందుకు చేసుకుంటాం? తెలుగు సంవత్సరాలు అరవై పూర్తి చేసుకుని రెండవ దశలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ అరవై సంవత్సరాలు ఎలా గడిపామని వెనక్కి తిరిగి చూసుకోవడంతోపాటు, ఆ పునాదిమీద రేపటికోసం మంచి జీవితాన్ని ఎలా రూపొందించుకోవాలన్న దానికి ఇవాళ ఆలోచించుకోవాలనే దానికి సూచిక షష్ఠిపూర్తి. అలాగే గత పనె్నండేళ్లలో నదీప్రవాహం ఎలా వుంది? పెరిగిందా? త గ్గిందా? ఎందుకు? ఉపనదుల పరిస్థితి ఏమి టి? నదీ జలాలు సాగుకి, విద్యుత్‌కి, తాగడానికి సరిపడ ఉంటున్నాయా? కృష్ణానదిని తీసుకుంటే ఇది మహారాష్టల్రోని సహ్యాద్రి పర్వతాల్లో పుట్టి మహారాష్టన్రి సస్యస్యామ లం చేస్తూ కర్ణాటకలోకి ప్రవేశించి ఆ రాష్ట్ర ప్రజలకు ఎంతగానో తోడ్పడి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి కర్నూల్, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల మీదుగా ప్రవహిస్తూ దివిసీమలోని హంసలదీవి దాటిన తర్వాత సముద్రంలో కలుస్తోంది. ఈ నది ప్రవహించే 1440 కిలోమీటర్ల దూరంలో, మహారాష్టల్రో 480 కిలోమీటర్లు, కర్ణాటకలో 291 కిలోమీటర్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 720 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. అంటే సగందూరం కృష్ణ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రవహిస్తోంది. మరి ఈ నది నీటివల్ల ఎక్కువ లబ్ది పొందుతున్నది ఏ రాష్ట్రం?
మహారాష్టల్రో నది సహ్యాద్రి పర్వతాలపై నుంచి పాయలుగా దిగి, వాయ్ వద్ద నదిగా పరిపూర్ణ రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ నదీ జలాలని స్థానికులు ఉపయోగించుకోవడానికి వీలుగా వాయ్‌కి 8 కిలోమీటర్ల దూరంలో డోమ్ అనకట్ట నిర్మితమైంది. దీనికి దగ్గరలోనే బల్కవాడి గ్రామం వద్ద మరో ఆనకట్ట నిర్మితమైంది. సతారా, సాంగీ జిల్లాలు సస్యశ్యామలమవుతున్నాయి. ఒకవిధంగా చూస్తే కృష్ణానది మహారాష్టల్రో ప్రారంభమైంది కాబట్టి కొన్ని ఉపనదుల్ని కలుపుకొని ముందుకు సాగుతూ, నది బాల్యదశను సూచిస్తుంది. కర్ణాటకలోకి ప్రవేశించే సరికి కృష్ణానది నిండు గర్భిణిగాలా ప్రవహిస్తుంటుంది. ఆలమట్టి, నారాయణపూర్ లాంటి పెద్ద పెద్ద ఆనకట్టలు ఆ రాష్ట్రంలో నదిమీద నిర్మించి 5.76 లక్షల ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారు. అక్కడనుంచి జూరాల ద్వారా తెలంగాణలోకి, అక్కడనుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడల మీదుగా సముద్రాన్ని చేరుకుంటోంది. జూరాల ప్రాజెక్టువల్ల 1.05 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా మరో 3.74 లక్షల ఎకరాలకు నీరందుతోంది. నాగార్జునసాగర్ ఆనకట్ట కుడికాల్వ ద్వారా గుంటూరు జిల్లాలో 6.77 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 4.42 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఎడమ కాల్వ ద్వారా నల్గొండ జిల్లాలో 3.73 లక్షలు, ఖమ్మం జిల్లాలో 2.29 లక్షలు, కృష్ణా జిల్లాలో 3.78 లక్షల ఎకరాలు కృష్ణానది వల్ల సాగవుతున్నాయి. సస్యశ్యామలమవుతున్నాయి. అంటే సగం ప్రవహించే రెండు తెలుగు రాష్ట్రాల్లో 27 లక్షల ఎకరాల భూమి సాగవుతోంది. తె లుగు రాష్ట్రాల్లో 720 కిలోమీటర్ల దూరం కృష్ణ పయనిస్తుంటే, కేవలం 291 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే కర్ణాటకలో 25.76 లక్షల ఎకరాలకు కృష్ణ నీరు లభిస్తోంది.
గాలి, నీరు అందరి సొత్తు. అందరికి సమానంగా అందాలంటారు. మరి ఆ న్యాయం ఇక్కడ వర్తిస్తోందా? పై రాష్ట్రాలు విడిచిపెడితేనే కింది రాష్ట్రాల వారికి నీరందేది. కర్ణాటకలోని ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు సముద్రానికి 524.19 మీటర్లు. అసలు నీటిని బిగవేయడంతో ఆంధ్రప్రదేశ్ ఆక్షేపణ తెలిపింది. ఆల్మట్టి పక్కన ఒక కొండ ఉంది. దాని చూట్టూ కూడా నీటిని నిల్వ ఉంచుతున్నారు. 2004లో వచ్చిన పుష్కరాల సందర్భంగా అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎం.ఎం కృష్ణ అన్న మాటలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. ‘‘చుట్టుపక్కల గ్రామా లు మునిగిపోయినా ఆంధ్రప్రదేశ్‌కి నీరు వదిలేదు లేదు’’ ఇవీ ఆయన అన్నమాటలు. ఆ తర్వాత ముంపుకు భయపడి ఈ ఏడాది లాగానే పుష్కరాలకు ముందు వదిలారు. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పడంతో ఆనకట్ట ఎత్తును 524.19 మీటర్లనుంచి 519.6 మీటర్ల ఎత్తుకు తగ్గించారు. అయినా నేడు మనం నీటికోసం వారి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడక తప్పడంలేదు. కృష్ణానదికి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి వార్థక్యమొస్తుంది. ఈ నీటినైనా మనం సంపూర్ణ సద్వినియోగం చేసుకుంటున్నామా? ఇంకా ఎంతో నీరు సముద్రంలో వ్యర్థంగా కలిసిపోతున్నది. ఈ వ్యర్ధాల్ని అరికట్టడం ఎలా? అందరికీ సమంగా నీరు అందుబాటులోకి తెచ్చే చర్యల్ని చేపట్టడం ఎలా? అనే విషయం మీద ఆలోచించమని పుష్కరాలు చెబుతున్నాయి.

- డా.వేదగిరి రాంబాబు