ఉత్తరాయణం

ప్రత్యేక హోదా కోసం వినతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ‘మీ ఆకాంక్షల్ని తెలపండి, ఎర్రకోటపై నుండి చేసే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావిస్తాను’ అని తెలియజేయడం ముదావహం. దేశ ప్రజల ఆశలు, ఆశయాలు, కలలు ప్రతిబింబించేలా ప్రధాని ప్రసంగించడం మామూలే అయనా ప్రసంగ పాఠం తయారీలో ప్రధానిది, లేదా కార్యదర్శి వర్గానిదే ఏకైక పాత్ర. ఇందులో ప్రజల నుండి ఆలోచనల్ని సేకరించొచ్చన్న వూహే సరికొత్తది. తనతో పాటు తామూ నడుస్తున్నామని దేశ ప్రజలు భావించేలా చూడడానికి ప్రధాని చేస్తున్న యత్నాలు అభినందనీయం. డ్రైవింగ్ సీట్లలో కూర్చున్న వ్యక్తి, కార్లో వెనుక కూర్చున్న నోరూవాయాలేని వ్యక్తితో ‘అప్పుడప్పుడూ స్టీరింగ్ ఎటు తిప్పుతుండాలో నువ్వూ చెబుతూ ఉండు ప్లీజ్’ అంటే పొంగిపోడా! అయతే ఈ సందర్భాన్ని ఆంధ్రులు సద్విని యోగం చేసుకోవాలి. అందుకు అఖిలపక్షాలూ సహకరిం చాలి. ఆంధ్ర ప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయమై దాదాపు అన్ని పక్షాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయ. భాజపా కూడా ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఇబ్బందులు ఏకరువు పెడుతున్నది తప్పించి, ప్రత్యేక హోదాను వ్యతిరేకించడం లేదు. మిగతా పక్షాలైతే దాదాపు కేంద్రంతో పోరాటం చేస్తున్నాయ. కావున రాష్ట్రం నుండి వీలైనంత ఎక్కువ మందితో ఈ విషయమై ప్రధానికి వినతులు సమర్పిం చాలి. ఎర్రకోట ప్రసంగంలో ఆయన ప్రస్తావించినా, లేకు న్నా రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో కోరిన విషయం తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.
-డా. డివిజి శంకరరావు, పార్వతీపురం
స్ర్తీలలోనే కొనసాగుతున్న వివక్షత
డాక్టర్ సరోజన గారు తన వ్యాసంలో పాఠ్య పుస్తకా ల్లోనూ స్ర్తీ వివక్షతే నని వాపోయారు. కానీ ఏ తల్లి అయ నా తనకు కుమారుడే కలగాలని, ఏ అత్తయనా తన కోడలిద్వారా తనకు మనవడే పుట్టాలని కోరుకోవడమే స్ర్తీ వివక్షకు మూలం అవుతోంది. సమాజంలో స్ర్తీలతో సహా పురుషాధిపత్యానికి విలువనివ్వడం కూడా మరోకారణం. అందువల్లనే 50 శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో ఉండవలసిన చోట 33 శాతం కూడా దిక్కుండటం లేదు. సరోజనగారు కేవలం పాఠ్యాంశాలపైనే దృష్టి కేంద్రీ కరిం చక, అన్ని అంశాలను స్పృజించాలి. స్ర్తిలలో ఉద్యమం రానంతవరకు స్ర్తీ అణగారే ఉంటుంది.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం
మంచి పద్ధతి కాదు
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ గ్రామం లో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై స్థానికులు, మేధావులు, పర్యావరణవేత్తలనుండి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతున్నా, పట్టించుకోకుండా రాష్ట్రప్రభుత్వం సామాజిక సర్వే చేపట్టడమే కాకుండా భూసేకరణకు ప్రత్యేక అధికారిని నియమించడం మంచి పద్ధతి కాదు. కేవలం ప్రజాభిప్రాయం ప్రకారమే నడుచుకుంటాం అంటూ ఒకవైపు ప్రకటనలు చేస్తూనే మరొకవైపు ఎక్స్‌క్లూజివ్ జోన్‌లో గ్రామాలను పెంచడం, కిలోమీటర్ పరిధిలో జనావాసాల నిషేధం వంటి సరికొత్త నిబంధనలను అమలుచేయడంపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తవౌతోంది. ఎక్స్‌క్లూజివ్ జోన్ పరిధి పెంపుతోపాటు క్రొత్తగా స్టిరిలైజ్డ్ జోన్, ఎమర్జన్సీ ప్లానింగ్ జోన్, ఇంపాక్ట్ ఎసెస్మెంట్ జోన్ల ఏర్పాటు వలన వందలాది గ్రామాలు ఖాళీ చేయాల్సి రావడంతోపాటు వేల ఎకరాల పంట పొలాలు సర్వనాశనమైపోతా యి. అణు విద్యుత్ కేంద్రాలవలన పొంచి వుండే ప్రమాదాలపై ప్రజలకు భరోసా కల్పించే చర్యలు ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టకపోవడం దురదృష్టకరం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
మోసాలను గుర్తించాలి
పెట్రోలు బంకులలో కొన్ని మాత్రమే నిజాయితీగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని పెట్రోలు బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి. 200 రూపాయల పెట్రోల్ అడిగితే 150 రూపాయల పెట్రోల్ కూడా రావడం లేదు. వినియోగదారుల జేబులు గుల్లఅవుతున్నాయి. ఇలాంటి పెట్రోల్ బంకులను గుర్తించి అధికారులు వాటిని సీజ్‌చేయాలి. వినియోగదారులూ అప్రమత్తం అవ్వాలి. ఒక బంక్‌లో పోయించుకున్న పెట్రోలుకు, మరో బంక్‌లో పోయించుకున్న పెట్రోలుకూ మైలేజీలో వ్యత్యాసాన్ని గుర్తెరిగి మోసంచేసే వారిపై ఫిర్యాదుచేయాలి. ఈ చైతన్యం రానంతవరకు మోసాలు జరుగుతూనే ఉంటాయ.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం