సంపాదకీయం

ఒకే దేశం...ఒకే శుల్కం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక జాతికి ఒకే ఆర్థిక నీతి ఉండాలి. ఒకే దేశం-ఒకేపన్ను- అన్న వాణిజ్య ఆదర్శం వాస్తవంగా మారుతుండడం హర్షదాయకం! వస్తు, సేవల పన్నుల-జిఎస్‌టి-బిల్లుపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య అభిప్రాయ సమానత్వం ఏర్పడడం చారిత్రక పరిణామం. సంబంధిత రాజ్యాంగపు సవరణ బిల్లునకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలపడం పదకొండేళ్ల సమీకృత వాణిజ్య విధాన రూపకల్పన ప్రక్రియకు పరాకాష్ఠ. పదకొండేళ్లు ఈ ఏకాభిప్రాయం ఎండమావులలోని నీరు వలె ఊరించి ఊరించి దేశ ప్రజలకు విసుగుపుట్టించింది! అందువల్ల గత పదకొండు రోజు ల్లో ఏకాభిప్రాయ సాధన దిశగా అమిత వేగంగా జరిగిన ప్రగతి ఒక రాజకీయ అద్భుతం. ఈ పదకొండేళ్లలో మాత్రమే దేశమం తా ఒకే వాణిజ్య మండలంగా రూపొందించాలన్న ధ్యాస, అన్ని రాష్ట్రాలలోను ఒకే విధంగా పరోక్ష శుల్కాలను విధించాలన్న స్పృహ పెరిగింది. కానీ స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి ఆరు దశాబ్దులపాటు ఈ జాతీయ సమీకృత వాణిజ్య స్ఫూర్తి ఎందుకు అంకురించలేదన్నది సమాధానం లభించని ప్రశ్న. బ్రిటన్ పాలకులు వదిలి వెళ్లిన ప్రాదేశిక, ఆర్థిక రాజకీయ, విద్యా, విజ్ఞాన వారసత్వ అవశేషాలను పాలకులు పరిరక్షించి పరిపోషించడం దశాబ్దుల వైపరీత్యం. బ్రిటన్ దురాక్రమణ కొనసాగిన కాలంలో రూపొందిన చట్టాలను విధానాలను మారిన పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించుకోవాలన్న ధ్యాస కలగకపోవడం పాలకుల భావదాస్య ప్రవృత్తికి నిదర్శనం. 1894 నాటి భూమి సేకరణ చట్టాన్ని 2013 వరకు కొనసాగించిన తీరు ఈ భావదాస్య ప్రవృత్తికి ఒక ఉదాహరణ మాత్రమే. బ్రిటనీయ దురాక్రమణదారులు తమ పాలనను సుస్థిరం, శాశ్వ తం చేసుకొనడానికి వీలుగా సృ ష్టించిన అనేక వ్యవస్థలలో లైసె న్స్-వాణిజ్య అనుమతి-ఇచ్చే పద్ధతి ఒకటి. సైకిళ్లకు రేడియోలకు చివరికి కుక్కపిల్లలకు సై తం లైసెన్సులను అనివార్యం చే యడం ద్వారా పరోక్షమైన పన్నులను సామాన్యులనుండి తెగదండుకున్నారు. పెళ్లిళ్లు చేసుకునే సమయంలో కన్యాదాతనుండి, వరుని నుండి, పురోహితునినుండి, మంగళ వాద్యాలు మోగించిన కళాకారులనుండి మోతర్పా వంటి పన్నులను వసూలు చేసిన పాశ్చాత్య దేశాలనుండి వచ్చిపడిన ప్రభువుల...విదేశీ దమననీతి బీభత్స ఆర్థిక వాణిజ్య వ్యస్థలను ఈ దేశంలో సృష్టించింది. అంతకు పూర్వం కొలంబోనుంచి కైలాసం వరకు గాంధారంనుంచి కామరూపవరకు ఒకే ఆర్థిక వాణిజ్య మండలంగా అఖండ భారతదేశం అలరారింది. నిర్నిరోధమైన వ్యాపార వాణిజ్యాలు కొనసాగాయి! కాని బ్రిటన్ పాలకులు ఎక్కడికక్కడ టోల్‌గేట్ల-వాణిజ్య ద్వారాలను, చెక్‌పోస్ట్-తనిఖీ ఠాణా-లను ఏర్పాటు చేసి దేశాన్ని అనేక వాణిజ్య మండలాలుగా విడగొట్టిపోయారు. రకరకాల పరోక్షపు పన్నులను విధించడం ద్వారాను, ఒకే వస్తువుపై వివిధ రాష్ట్రాలలోను, శుల్క ద్వారాల-టోల్‌గేట్స్- వద్దను పన్నులను వసూలు చేయడం వల్ల వస్తువుల ధరలు ప్రధానంగా నిత్యావసర పదార్ధాల వెలలు పెరిగిపోయాయి. సామాన్య ప్రజల వెన్ను విరిచి దోపిడీ చేసిన ఈ బ్రిటన్ పాలననాటి వారసత్వం జిఎస్‌టి బిల్లుతో గతం రానుంది. ఒకేదేశంలో ఒకే పన్ను అన్నది జిఎస్‌టి ద్వారా ఏర్పడనున్న నూతన వాణిజ్య వ్యవస్థకు ప్రాతిపదిక!
వస్తు, సేవల పన్ను గురించి 2005లో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం మొదటిసారి ప్రస్తావించారట! ఈ సంగతిని ఆయనే ఘనంగా బుధవారం రాజ్యసభలో ఉటంకించారు. అలాంటప్పుడు 2014 మే 26 వరకు జిఎస్‌టి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని రూపొందించలేకపోయింది? 2014 మే 26 తరువాత రూపొందించదలచిన భాజపా ప్రభుత్వానికి విపక్షమైన కాంగ్రెస్ ఎందుకని సహకారం అందించలేదు? ఈ రెండు వైఫల్యాలకు 2014 మే 26నకు పూర్వం విపక్షమైన ఆతరువాత ప్రభుత్వపక్షమైన భాజపా కారణమని ధ్వనింపచేయడానికి చిదంబరం విఫలయత్నం చేసారు. 1993లో వాణిజ్యం, సుంకాల సాధారణ ఒప్పందం-గాట్- ప్రపంచీకరణ వ్యవస్థగా రూపాంతరం చెందింది, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ స్వేచ్ఛా వాణిజ్యం-మార్కెట్ ఎకానమీ-గా పరిణతి చెందడం ప్రపంచీకరణ! గాట్ ప్రపంచ వాణిజ్య సంస్థ-డబ్ల్యుటిఓ-గా రూపాంతరం చెందింది! దేశాల మధ్య సరిహద్దులను చెరిచివేసి ప్రపంచాన్ని ఒకే వాణిజ్య ఆర్థిక మండలంగా పుడమిపల్లెగా రూపొందించిన ప్రపంచీకకరణకు మన దేశంలో శ్రీకారం చుట్టినవాడు మన్‌మోహన్‌సింగ్. ఆర్థిక మం త్రిగా ఆ తరువాత ప్రధానిగా దేశాల సరిహద్దులను చెరిపి కృత్రి మ అంతర్జాతీయ అనుసంధానాన్ని మన నెత్తికెత్తినవాడు మన్‌మోహన్‌సింగ్...
కానీ 1994నుంచి 2014 వరకు ఇరవై ఏళ్లపాటు మన్‌మోహన్‌సింగ్‌కు దేశంలో విదేశీయులు సృష్టించిపోయిన కృత్రిమ ప్రాంతీయ వాణిజ్యపు అడ్డుగోడలను తొలగించి మొత్తం దేశాన్ని ఒకేవాణిజ్య ఆర్థిక మండలంగా పునరుద్ధరించాలన్న నిష్ఠ లేకపోయింది. జిఎస్‌టి బిల్లునకు 2014 మే వరకు పార్లమెంటు ఆమో దం లభించకపోవడానికి ప్రధాన కారణం ఇదీ, 1998వ 2004వ సంవత్సరాల మధ్య దేశాన్ని నడిపిన అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి సైతం ఈ వైఫల్యంలో భాగం ఉండడం నిజం. ఇరవై ఏళ్లలో జరగని కృషి 2014 మే 26 తరువాత రెండేళ్లలో జరగడం అద్భుతం. రాజ్యసభ బిల్లును ఆమోదించడం సాక్ష్యం. ఈ బిల్లును పరిశీలించడానికి 2008లోనే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సాధికార సం ఘం ఏర్పడింది. ఈ సాధికార సంఘం 2011లో నివేదికను సమర్పించింది. 2013లో పార్లమెంటు ఉపసంఘం పరిశీలనకు ఈ బిల్లును నివేదించారు! వస్తు సేవల గరిష్ఠ శుల్కం ఉత్పాదక వ్యయంపై, సేవల వ్య యంపై పద్దెనిమిది శాతానికి మించరాదన్నది దాదాపు సంవత్సరం పాటు కొనసాగిన విభేదాలకు కారణం! 2015లోనే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
ఇప్పుడు ఈ విభేదం తొలగిపోయింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలలో ఈ వస్తుసేవల పన్ను పదహారున్నర శాతానికి మించి లేదట! పదునాలుగు శాతం విధిస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. పరోక్షపు పన్నులను సంపన్నులు సామాన్యులు సమానంగా భరిస్తున్నారు. అందువల్ల పరోక్షపు పన్ను అయిన జిఎస్‌టి సాధ్యమైనంత తక్కువగా ఉండడం మంచిదన్నది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించిన వాస్తవం! అయితే దేశమంతటా ఒకే విధంగా ఈ పన్ను ఎంత శాతం ఉంటున్నది ఇప్పటికీ స్పష్టం కాలేదు! వివిధ ఉత్పాదక రాష్ట్రాలు అదనపు సుంకాలను విధించడానికి వీలుండాలన్న ప్రతిపాదననుకూడ ప్రభుత్వం ఉపసంహరించింది. కనుక దేశమంతటా అన్ని వస్తువుల ధరలు ఒకేస్థాయిలో ఉండడానికి ఈ బిల్లువల్ల వీలు కలుగుతుంది. సరకు రవాణా ఖర్చులవల్ల ధరలలో కొద్దిపాటి తేడాలు ఉండవచ్చు! దీనివల్ల ధరల అదుపునకు, ద్రవ్యోల్బణం అదుపునకు వీలు కలుగుతుంది! ఒక వస్తువుపై ఒకేసారి ఒకేచోట ఒకే పన్ను విధిస్తారు. దేశంలో మరెక్కడా కూడ దానిపై మళ్లీ పన్ను విధించబోరు. ప్రవేశపు పన్నులు రద్దవుతాయి. రాష్ట్రాల మధ్య అడ్డుగోడలు తొలగిపోనున్నాయి. అయితే ఇది జిఎస్‌టి విధించడానికి వీలు కల్పిస్తున్న రాజ్యాంగపు సవరణ బిల్లు మాత్రమే! కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు ఈ సవరణను ఆమోదించాలి! ఆ తరువాత ప్రతి రాష్ట్రం ఒక చట్టాన్ని, కేంద్రం రెండు చట్టాలను రూపొందించవలసి ఉంది...అందువల్ల సమాన పన్ను దేశమంతటా ఒకేపన్ను విధించే ప్రక్రియ ఆరంభం కావడానికి మరి కొనే్నళ్లు పట్టవచ్చు...