ఉత్తరాయణం

స్ర్తీ పురుషులకు ఆలయ ప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శనిసింగనాపూర్ ఆలయంలోకి స్ర్తీలను అనుమతిం చడం లేదన్నది అసత్యం. అలాగే నల్లదుస్తులే ధరిం చాల న్న నియమం కూడా లేదు. ఆలయంలోకి స్ర్తిపురు షులిద్దరికీ ప్రవేశం ఉంది. అయతే శనేశ్వరుడికి తైలంతో అభిషేకం మాత్రం పురుషులే చేస్తారు. ఇంచుమించు 20అడుగుల ఎత్తులో ఉండే రాతిఫలకమే శనేశ్వరుడు. ఒక చేతిలో పూజ సామగ్రి, మరో చేతిలో నూనె సీసాతో మోకాటి మీదుగా కట్టుకున్న అంగవస్త్రంతో అంత ఎత్తుకు వెళ్లాలి. మహిళలకు అది అసాధ్యమైన పని కాకపోయనా పిల్లా జెల్లల్ని వదలి అంతసేపు క్యూలో ఉండటం ప్రయాసనే. అందుకే మంత్రయుక్తంగా మగవారు అభిషేకం చేస్తుండగా, కింద నిలబడ్డ స్ర్తీలు తమకు తోచిన జపం చేసుకుంటూ ఉంటారు. త్రయంబకేశ్వర ఆలయంలోనికి అందరినీ అనుమతిస్తారు. శనిసింగా పూర్‌లో ఇళ్లకు తలుపులుండవన్నది కూడా పాక్షిక సత్యమే. కేవలం ప్రదర్శన కోసమే కొన్ని అంగళ్లకు మాత్రమే తలుపులు వేయరు. స్ర్తీ పురుషులు ఒకరికొకరు పరిపూరకాలే తప్ప శత్రువులు కారు.
- అయ కమలమ్మ, వనస్థలిపురం
రేణిగుంట వరకు పొడిగించాలి
త్వరలో నంద్యాల-కడప మధ్యనేరుగా రైలు సౌకర్యం కలిగించనున్నారన్న వార్త ఎంతో సంతోషం కలిగించింది. కర్నూలు, కడప జిల్లాలను ఈ కొత్త మార్గం అనుసం ధానిస్తుంది. రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు కూడా ప్రయోజనం కలగాలంటే ఈ కొత్త రైలును రేణిగుంట వరకు పొడిగించాలి. కర్నూలు జిల్లాలోని బనగానపల్లి, కడప జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రజలకు ఇది ఉపయోగంగా ఉంటుంది. ఒకవేళ తిరుపతి వరకు పొడిగించడం సాధ్యమైతే అదీ మంచిదే.
- కాకుటూరి సుబ్రహ్మణ్యం, చెన్నై
సెల్యూట్‌పై అవగాహన కల్పించాలి
స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండావందన సమయం లో కొందరు ఉన్నతాధికార్లు, ప్రజాప్రతినిధులతో పాటు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా జాతీయ పతాకానికి చేసే గౌరవ వందనం లోపభూయష్టంగా ఉంటోంది. బాధ్యతగల వారే ఇలా లోపసహితంగా సెల్యూట్ చేస్తే ఇక సామాన్య జనానికి ఏవిధంగా చేయాలో ఎలా తెలుస్తుంది? సెల్యూట్ చేసే చేయ భుజానికి సమాంతరంగా ఉండాలి. కిందికి కాని పైకి కాని వంచరాదు. ముంజేతిని త్రిభుజా కారంలో ఉంచి చేతివేళ్ల మధ్య ఖాళీ లేకుండా సెల్యూట్ చేయాలి. సామాన్య జనం ఎవరికి తోచిన విధంగా ఎవరికి వారు వందనం చేస్తుండటంతో సెల్యూట్‌కు అర్థం లేకుండా పోతోంది. దీని గురించి అవగాహన కలిగించడానికి ఉపా ధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదునివ్వాలి. చిన్నప్పుడు సరిగా అలవడితే పెద్దయ్యాక సంపూర్ణంగా, గౌర వంగా సెల్యూట్ చేయగలుగుతారు.
- గోధూరు అశోక్, కరీంనగర్
మరింత దూరంలో మొక్కలు నాటాలి
ఇటీవల హైదరాబాద్-విజయవాడ మార్గంలో 165 కిలోమీటర్ల మేర మొక్కలు నాటడం ఆలస్యమైనా పూర్తి కావడం సంతోషకరం. అయతే ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల మార్గం పక్కనే నాటారు. భవిష్యత్తులో ఈ మార్గాన్ని ఎనిమిది వరుసలుగా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయ. కాబట్టి ఇప్పుడు నాటిన మొక్కల్ని పీకి 8 వరుసలను దృష్టిలో పెట్టుకొని తగిన దూరంలో నాటాలి.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్
చేనేతను ప్రోత్సహించాలి
రాష్ట్రంలో పట్టు చేనేత కార్మికులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం కల్పించి చేనేత శేషవస్త్రాలు, పట్టు పీతాంబరం వస్త్రాలు సెరిఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అదే విధంగా పవర్‌లూం చీరెలను నాణ్యతబట్టి ప్రోత్సహించాలి.
- ఆర్.అశ్వర్థరెడ్డి, మరుకుంటపల్లి