సంపాదకీయం

వదలని ప్రచండ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్ ప్రధానమంత్రిగా పుష్పకమల్ దహల్ ప్రచండ ఎన్నిక కావడం పునావృత్తమైన మరో భారత వ్యతిరేక పరిణామం. 2009లో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన ఈ నేపాల్ మధ్యేమార్గ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ మహానేత పదవిలో ఉండిన సంవత్సర కాల వ్యవధిలో అనేక భారత వ్యతిరేక విధానాలను రూపొందించాడు. ఆయన అవలంబించిన ఈ విధానాలు బెడిసికొట్టడం వల్లనే ప్రచండ 2009లోపదవీ పరిత్యాగం చేయవలసి వచ్చింది. అందువల్ల ప్రచండ మళ్లీ ప్రధానిగా గద్దెనెక్కడం ఆ విపరిణామక్రమాన్ని స్ఫురింపజేస్తోంది. 1996లో మావోయిస్టు పార్టీ అవతరణకు భూమిక భారత వ్యతిరేకత. నేపాల్‌ను భారత్ నుండి దూరంగా జరిపి చైనా ఒడిలో కూర్చుండబెట్టడం ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టుపార్టీ అసలు లక్ష్యం. నేపాల్‌లో ఏకపక్ష మావోయిస్టు నియంతృత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఈ లక్ష్యం నెరవేరగలదన్నది మావోయిస్టుల ప్రగాఢ విశ్వాసం. అందువల్ల 2005 నుండి ప్రజాస్వామ్య నిబద్ధతను అభినయిస్తున్న మావోయిస్టులు అడుగడుగునా ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నారు. మావోయిస్టుల ముందు ప్రజాస్వామ్య నిబద్ధత కలిగిన నేపాల్ రాజకీయ పక్షాలు మోకరిల్లుతుండడం 2005 నుంచి నడుస్తున్న చరిత్ర. 599 మంది సభ్యులున్న నేపాల్ జాతీయ శాసనసభలో ప్రచండ నాయకత్వంలోని ఈ మావోయిస్టు పార్టీకి ఎనబయికంటె తక్కువ స్థానాలున్నాయి. అయినప్పటికీ ప్రచండ ప్రధానమంత్రి కాగలగడం ప్రధాన రాజకీయ పక్షాల ఘోరమైన వైఫల్యానికి పరాకాష్ఠ. 2013లో రెండవ సారి రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో నేపాలీ కాం గ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేపాల్ మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీ రెండవ పెద్ద పార్టీ. మావోయిస్టులకు మూడవ స్థానం దక్కింది. అయినప్పటికీ మొదటి రెండు స్థానాలలోని పార్టీలకు ప్రధానమంత్రి పదవిని దక్కకుండా చేయడం ప్రచండ సాధించిన నయవంచక విజయం. ప్రచండను, ఆయన రాజకీయ పార్టీని నిర్దేశిస్తున్న చైనా ప్రభుత్వం సాధించిన వ్యూహాత్మక విజయం. చైనా దుస్తత్రం ఇలా విజయవంతం అవుతుండడం మన ప్రభుత్వ వ్యూహాత్మక వైఫల్యం. 1950 నాటి భారత నేపాల్ మైత్రి ఒప్పందం స్ఫూర్తి ఇలా నీరుకారిపోతోంది.
అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపాల్ కాంగ్రెస్‌కు చెందిన సుశీల్ కుమార్ కోయిరాలా 2014 ఫిబ్రవరిలో ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఆయన నాయకత్వంలోనే గత ఏడాది సెప్టెంబర్ 20న నూతన రాజ్యాంగం ఆవిష్కృతమైంది. రాజ్యాంగం ఆవిష్కృతమైన తరువాత రాజ్యాంగ పరిషత్ జాతీయ శాసనసభగా రూపొందింది. మావోయిస్టులు రెండవ పెద్ద పార్టీ అయిన మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టులతో చేతులు కలిపి ఆ తరువాత జరిగిన ప్రధాని ఎన్నికలలో సుశీల్ కోయిరాలాను ఓడించారు. మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ప్రధానిగా ఎన్నికయ్యాడు. గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన ఈ విపరిణామం వల్ల నేపాల్ కాంగ్రెస్‌కూ, మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీకి మధ్య పచ్చగడ్డి అరని చిచ్చుగా భగభగలాడిపోతుండడం నడుస్తున్న చరిత్ర. ఇలా భేదోపాయంతో రెండు ప్రధాన పార్టీల మధ్య చిచ్చు మరగించగలిగిన మావోయిస్టులు ఆ తరువాత ఓలీని పదవి నుంచి తప్పించే కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. గత సంవత్సరం అక్టోబర్‌లోనే మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీకి చెందిన విద్యా భండారీ దేశాధ్యక్షురాలిగా ఎన్నిక కావడానికి కూడ మావోయస్టులు సహకరించారు. ఫలితంగా అతిపెద్ద పార్టీ నేపాలీ కాంగ్రెస్‌కు ప్రధాని పదవికాని, అధ్యక్ష పదవికాని దక్కకుండా పోయింది. 2008 నుండి అధ్యక్షుడిగా ఉండిన రామ్‌భరణ్ యాదవ్ నేపాలీ కాంగ్రెస్‌కు చెందినవాడు. ఇలా రెండు ప్రధాన పార్టీల మధ్య విద్వేషం వ్యవస్థీకరించిన చైనా ప్రతినిధులైన మావోయిస్టులు ఓలీకి మద్దతు ఉపసంహరించుకోవడం వారి వ్యూహంలోని రెండవ దశ. ఎట్టి పరిస్థితిలోనూ ప్రధాని, అధ్యక్ష పదవులు రెండూ మార్క్సిస్టు పార్టీకి దక్కరాదన్న పట్టుదలతో ఉన్న నేపాలీ కాంగ్రెస్ దిగజారిపోయి ప్రచండ పక్షాన చేరింది. ఫలితంగా ప్రచండ ఇప్పుడు మళ్లీ ప్రధాని కాగలిగాడు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి ఇలా తీర్చింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇలా నీరు కారింది..
నేపాల్ అనాదిగా భారతఖండంలో భౌగోళికంగా, సాంస్కృతికంగా భాగం. చైనాకు, నేపాల్‌కు ఎలాంటి సాంస్కృతిక భౌగోళిక సంబంధం లేదు. 1959లో చైనా కబళించే వరకు టిబెట్ రెండు వేల ఐదువందల ఏళ్లకు పైగా స్వతంత్ర దేశం. అంతకు పూర్వం టిబెట్ కూడ అఖండ భారత ఖండంలోని భౌగోళిక సాంస్కృతిక విభాగం. ఈ స్వతంత్ర టిబెట్ ఉన్నంత వరకు నేపాల్‌కు చైనాతో సరిహద్దు లేదు. బ్రిటన్ దురాక్రమణ దారులు మొత్తం భారతదేశం దురాక్రమించినప్పటికీ నేపాల్ మాత్రం ఈ తెల్లదొరలకు లొంగలేదు. అలా విదేశీయ దురాక్రమణగ్రస్తం కాకుండా స్వతంత్రంగా మిగిలిన భారత ప్రాంతం నేపాల్. 1925లో బ్రిటన్ చివరికి నేపాల్‌తో రాజీపడింది. స్వతంత్ర దేశంగా నేపాల్‌ను గుర్తించింది. మిగిలిన భారతదేశంతో పాటు నేపాల్ కూడ బ్రిటన్ దురాక్రమణకు గురి అయి ఉండి ఉంటే 1947 ఆగస్టు 15వ తేదీ తరువాత నేపాల్ కూడ మనదేశంలో భాగమై ఉండేది. నేపాల్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పటికీ ఆ దేశం భద్రత, ప్రగతి మనదేశ భద్రతతోను, ప్రగతితోను ముడివడి ఉన్నాయి. 1949లో ఉభయ దేశాల మధ్య కుదిరిన వాణిజ్యం, రాకపోకల ఒప్పందం 1950లో అమలు లోకి వచ్చిన మైత్రి ఒప్పందం ఈ యుగయుగాల బంధానికి సరికొత్త ధ్రువీకరణలు మాత్రమే. నేపాల్‌కు భారత్‌తో సమాన సాంస్కృతిక వారసత్వం ఉంది. నేపాల్ ప్రజలు భారత్ అంతటా యదేచ్ఛగా నివసించగలుగుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి పొందగలుగుతున్నారు. నిజానికి చిన్న నేపాల్ దేశవాసులకు సువిశాల భారత్ మరో మాతృదేశం. ఈ భారత నేపాల్ బంధాన్ని చెరచడానికి నేపాల్‌ను కబళించడానికి చైనా పొంచివుంది. చైనా చాచిన చేతికి టిబెట్ అరచేయి అని, లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రాంతాలు ఐదువేళ్లని 1950వ దశకానికి పూర్వమే చైనా కమ్యూనిస్టు నాయకులు ప్రకటనలు చేసేవారట. ఈ లక్ష్యసాధనలో భాగంగానే చైనా 1995-1996లో నేపాల్ కమ్యూనిస్టు పార్టీని చీల్చింది. ఫలితంగా మావోయిస్టు పార్టీ పుట్టింది.
ప్రచండ నాయకత్వంలోని ప్రభుత్వం, ఆ తరువాత మావోయిస్టుల మద్దతుతో సాగిన మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వాలు 2008-2012 సంవత్సరాల మధ్య నేపాల్‌లో భారత వ్యతిరేకతను విస్తరింప చేశారు. నేపాల్‌లో విక్రమశకం 2100 సంవత్సరాలుగా అమల్లో ఉంది. విక్రముడు క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్ది నాటి భారతీయ సామ్రాట్టు. ఆయన నేపాల్‌కు వెళ్లి ఈ విక్రమ శకాన్ని ప్రారంభించాడు. ఈ శకాన్ని అధికార కలాపాలలో వాడరాదని మావోయిస్టులు నిర్దేశించారు. ప్రసిద్ధ పశుపతినాథ ఆలయంలో తరతరాలుగా అర్చకులు దక్షిణ భారతీయులు. ఈ సంప్రదాయాన్ని భగ్నం చేయడానికి మావోయిస్టులు ఇప్పటికీ విఫలయత్నాలు సాగిస్తున్నారు. చైనాకు ఇష్టంలేని నేపాలీ సైనిక అధిపతి, రుక్మాంగద కటావల్‌ను ప్రధాని ప్రచండ 2009లో తొలగించాడు. కానీ అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్ ప్రచండ నిర్ణయాన్ని రద్దు చేశాడు. 2009లో ప్రచండ ప్రధాని పదవి నుండి వైదొలగడానికి ఇదీ కారణం.