సబ్ ఫీచర్

పర్యావరణంపై దాడి ఆగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవావరణ వ్యవస్థలోని జనాభా పెరుగుదలవల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. జనాభా పెరిగేకొద్దీ మానవ నివాసానికి, వ్యవసాయ భూమి, వంట చెరుకు కోసం అడవులను, పచ్చిక బయళ్ళను నాశనం చేస్తుండటంవల్ల భూమి మృత్తికలు, వాటిలోని సారం కొట్టుకుపోతున్నాయి. సాగుచేయడం ద్వారా మిగిలే వ్యర్థ, ఘన, ద్రవ పదార్థాలు, అనాగరిక పారిశుద్ధ్య అలవాట్లవల్ల పర్యావరణ సంక్షోభం ఏర్పడుతోంది. ఈ వ్యర్థాలను తగిన విధంగా నియంత్రించక పోవడంతో శిలావరణ, జల, వాయు సంక్షోభానికి దారితీస్తోంది. కొన్ని వ్యవసాయ విధానాలతోపాటు పురుగు మందులు, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి రసాయన, జైవిక సంక్షోభానికి గురవుతోంది. ఓజోన్ పొరలో రంధ్రాలు లేదా ఛిద్రాలు ఏర్పడటంవల్ల పర్యావరణం దెబ్బతింటోంది. భూగోళాన్ని ఆవరించి వున్న వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. వీటిలో రెండు భాగాలుగా వర్గీకరించవచ్చు. అవి సమరూప ఆవరణాలు, బహురూప ఆవరణాలు. ఆక్సిజన్‌కు మరో రూపమే ఓజోన్. ఆక్సిజన్‌లోని ఒక కణంలో రెండు అణువులుంటే, ఓజోన్‌లో మూడు అణువులు ఉంటాయి. ఈ ఓజోన్ వాయువు పొర సూర్యుడి నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను అడ్డగించి, భూమికి చేరకుండా నిరోధిస్తుంది. ఫలితంగా ఆ కిరణాలు భయంకర వినాశకర విపత్తునుంచి మానవాళిని రక్షిస్తాయి. అతి నీల లోహిత కిరణాలు అధిక సంఖ్యలో భూమిని చేరితే కలిగే దుష్ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. జీవరాశుల చర్మం చిట్లిపోయి, జీవకణాలు సర్వనాశనం అవుతాయి. చర్మసంబంధ క్యాన్సర్, కంటి వ్యాధులు, రోగ నిరోధక శక్తి కోల్పోవడం లాంటి రుగ్మతలకు దారితీస్తుంది. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియను మందగింపజేస్తుంది. తేలిగ్గా తెగుళ్ళకు గురవుతాయి. ఈ కిరణాలు సముద్ర జలాల్లోని జీవరాశులకు కూడా హాని కలిగిస్తాయి. ఓజోన్ పొర విధ్వంసానికి మానవుడే ప్రధాన కారణం. ఈ విధ్వంసంలో ‘‘క్లోరోఫ్లోరో కార్బన్లు’’ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటినే ‘‘క్లోఫోకాలు’’ (ఈ ఒక కణం, క్లోరిన్, ఫ్లోరిన్, కర్బనాలు మిశ్రమం) అంటున్నారు. వీటితోపాటు బ్రోమిన్ కూడా ప్రమాదకారిగా మారింది. దీన్ని అగ్నిమాపక పరికరాల్లో ఉపయోగిస్తున్నారు. పంటలపై చల్లే స్ప్రేలు, రిఫ్రిజిరేటర్లు, ప్లాస్టిక్, ఫోమ్, డిటర్జెంట్ల ఉత్పత్తుల తయారీవల్ల వాతావరణంలో క్లోరోఫ్లోరో కార్బన్‌లు ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టన్నుకంటే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. దీనివల్ల ఏటా లక్ష మందికి పైగా చర్మక్యాన్సర్‌తో మరణిస్తున్నారు.
ఓజోన్ పొర మందం సన్నగిల్లుతున్నట్లు శాస్తవ్రేత్తలు 1980 దశాబ్దంలోనే గుర్తించారు. అర్కిటిక్ ప్రాంతంపై ఉండే ఓజోన్ పొర 85 శాతం పైగా ధ్వంసమైందని తాజా పరిశీలనల్లో తేలింది. దీని ప్రభావంవల్ల ఉత్తర యూరప్ ప్రాంతంలో చర్మక్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఓజోన్ పొర ప్రస్తుతం 14 మిలియన్ చదరపు మైళ్ళ మేర ఛిద్రమైందని ఓజోన్ పొరపై పరిశోధన చేసిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్తవ్రేత్తల బృందం తెలిపింది. ఓజోన్ పొర నివారణలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ ఒకే తాటిపైకి రావాలి. ఏరోసాల్ ప్రొపల్లెంట్లు, ప్లాస్టిక్ ఫోమ్స్, రిఫ్రిజిరేటర్లలో వాడే సింథటిక్ రసాయనాలను తగ్గించి ప్రత్యామ్నాయాల వైపు ప్రయాణించాలి. ఇందులో భాగంగా ఈ ప్రమాద తీవ్రతను, వాటి దుష్ఫలితాలను గుర్తించి అమెరికా, జపాన్ లాంటి దేశాలు ‘‘క్లోరోఫ్లోరోకార్బన్‌లకు’’ ప్రత్యామ్నాయ రసాయనాలను తయారుచేస్తున్నాయి. అయితే ఇవి చాలా ఖరీదైనవి. పేద, బడుగు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తయారుచేసుకోగలిగినప్పుడు పూర్తిగా క్లోరోఫ్లోరోకార్బన్‌లను నిషేధించవచ్చు. ఇటీవల వోక్స్‌వాగన్ కంపెనీ తయారుచేసిన కార్లలో పర్యావరణ సంక్షోభానికి దారితీసే వాయువులు ఉన్నట్లు తేలినందున అమెరికా ఆ కంపెనీపై ఆంక్షలు విధించింది. ఏది ఏమైనా పర్యావరణాన్ని కాపాడవల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

- గుండు రమణయ్య