సబ్ ఫీచర్

ఓటుకి ఎక్కడుంది విలువ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుం ది. ఇది మన భారత రాజ్యాంగం కల్పించింది. తనకు ఇష్టమైన వ్యక్తికిగాని పార్టీని గాని ఓటు చేయడం ద్వారా ఓటరు తన హక్కుని సద్వినియోగం చేసుకుంటున్నాడు. రాజ్యాంగం ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోమని ఆదేశిస్తోంది. దేశంలో బహుళ రాజకీయ పార్టీలున్నాయి. ఓటర్లు తమకిష్టమైన రాజకీయ పార్టీకి అవకాశం ఇస్తున్నారు. నమ్మిన వ్యక్తిని గెలిపిస్తున్నారు. తాను ఎన్నుకొన్న వ్యక్తి అండగా ఉంటాడని భావిస్తారు. తమ నాయకుడు అధికార ప్రతిపక్షంలో న్యాయంకోసం కృషిచేస్తాడన్నదే విశ్వాసం. గెలిచినవారు అధికార పార్టీ అయితే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది. ప్రతిపక్షంలో కూర్చున్నా నియోజకవర్గంకోసం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారని పౌరులు ఆశిస్తారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నేటి రాజకీయ నాయకులు నడుచుకోవటం లేదు. పౌరుల ఓటు హక్కు ద్వారా గెలుపొందిన నాయకులు అసెంబ్లీకో లేక పార్లమెంట్‌కో వెళ్తున్నారు. అయిదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల్లో గెలుపొంది పౌరులకు విలువ ఇవ్వటం లేదు. తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. తిరిగి అయిదేళ్లకు ఓటుకోసం జోలెపడుతున్నారు. ప్రజాబీష్టం మేరకే ప్రవర్తిస్తున్నాం. వారి అభిమతమే తమ అభిమతం అని అంటున్నారు. ఓట్లకోసం తమ పార్టీ చేసే సేవల్ని ఏకరవు పెడుతుంటారు. ప్రయోజన పార్టీగానే నమ్మి ఓటర్లు గెలిపిస్తున్నారు.
ప్రజాభీష్టం మేరకు పార్టీ ప్రతినిధులు ఒక్కొక్కసారి ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తుంది. ప్రతిపక్షం అంటే ఏమిటి? ప్రభుత్వ నిర్ణయాలు తప్పుగా ఉంటే సరిదిద్దవలసిన బాధ్య త వారిది. ప్రతిపక్షంలో కూర్చోడం తప్పేమీకాదే. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం చేసే సేవల్ని ఓటర్లు గమనిస్తూనే ఉంటారు. తప్పు అధికార పార్టీది అయినా రాబోయే ఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్ధిచెప్పడానికి వెనుకాడరు. ఓటు హక్కుకి ఉన్నంత శక్తి మరి దేనికి లేదు. ఒక వ్యక్తిని గెలిపించాలన్నా ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలావద్దా అనేది ఓటరు చేతిలో ఉంది. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్‌కి వత్తాసు పలికారు ఓటర్లు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ని చిత్తుచిత్తుగా ఓడించారు. కేంద్రంలో భారతీయ జనతాపార్టీకి అవకాశం ఇచ్చారు. ఆంధ్రాలో తెలుగుదేశానికి, తెలంగాణాలో కెసిఆర్ పార్టీకి అధికారం కట్టబెట్టింది ఓటర్లే. పోటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ల తీర్పుకోసం కళ్లుకాయలు కాచుకొని ఎదురు చూడవలసిందే. ఓట్లకోసం గెలుపుకోసం దేమునికి మొక్కినా ఫలితం ఉండదు. గెలిపించే ఆయుధం ఓటే. అందుకే ఓటరే భగవంతుడు.
అన్నీఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత గుర్తుంచుకోవాలి. ఇంతటి బలవంతుడైన ఓటరుకి తప్పలేదు ఒక శాపం. అదేనండి. గెలిపించిన వ్యక్తి అధికార పార్టీలోకి చేరిపోవడం. గెలిచిన ఈ నాలుగు అయిదేళ్ళు ప్రతిపక్షంలో ఎందుకుండాలి? ఉంటే లాభంకంటే నష్టమే ఎక్కువ. అధికారదర్పం ఉండదు. ప్రత్యేక హోదాలుండవు. ఎన్నికల్లో ఖర్చయినా రాబట్టుకోవాలావద్దా, అధికార పార్టీలో చేరితే ఏదోఒక పదవైనా రాకపోతుందా. ప్రతిపక్షంలోకన్నా అధికార పక్షంలో వుంటే ప్రజలకు ఇంత సేవ చేసుకోవచ్చు. మరల గెలవటానికి అవకాశాలు చూసుకోవచ్చు. ఇదే ఆలోచన ప్రతిపక్ష నాయకుల్లో ఎందుకువస్తోంది? రాజ్యాంగంలోని లోపాల్ని వీరు సద్వినియోగం చేసుకోవటానికి అవకాశం దొరుకుతోంది. అందువల్ల భారత రాజ్యాంగాన్ని మార్పుచేయాలి. పార్లమెంట్‌లో పార్టీలు మార్పు నిరోధించే బిల్లు పెట్టాలి. రాజ్యసభ అందుకు అంగీకరించాలి. తదుపరి రాష్టప్రతి ఆమోద ముద్ర పడాలి. చాలాకాలంగా ఇదే సమస్య నలుగుతూవస్తోంది. ఇతర పార్టీలో గెలిచిన అభ్యర్థి అధికార పార్టీలోకి చేరాలంటే ఏమి చేయాలి. తాను గెలిచిన పార్టీకి గెలుపొందిన నియోజకవర్గ ప్రాతినిధ్యాన్ని రద్దుచేసుకోవాలి. అధికార పార్టీ తరఫున తిరిగి అదే నియోజకవర్గంలో పోటీచేసి గెలవాలి. ప్రజలు తనవైపు ఉన్నారో లేదో తేటతెల్లవౌతుంది. ప్రతి రాష్ట్రంలోను ప్రతిపక్ష నాయకులు అధికారంకోసం పార్టీలు మారుతున్నారు. పార్టీల నిరోధక చట్టం ఎందుకు అమలుకావటం లేదు? ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చేర్పుల వ్యవహారం చాపకింద నీరులా మారుతోంది. ఆంధ్రాలో అధికార పార్టీ ఏనుగంత బలంగా ఉంది. అయనప్పటికీ వైకాపా ఎంఎల్‌ఏలను చేర్చుకుంటోంది. అటు తెలంగాణాలో బలమైన కెసిఆర్ పార్టీలోకి తెలుగుదేశం ఎంఎల్‌ఏలు జారిపోతున్నారు. అధికార పార్టీకి ఈ చేర్పులు అవసరమా? బలమైన ప్రతిపక్షం ఉండకుండా నిర్వీర్యం చేయాలన్నదే ఆశ. పదవుల పందేరాల్లో నమ్ముకున్న పార్టీ నాయకులకి అన్యాయం చేస్తారా?
ఓటర్లు గెలిపించిన వ్యక్తి ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఉన్నట్లుండి అధికారపార్టీ కండువా వేసుకున్నాడు. అప్పుడు ఓటరు పరిస్థితి ఏమిటి? గెలిపించిన వ్యక్తి ఇలా మోసంచేస్తాడని ఓటర్లు కలలోకూడా ఊహించరు. ఇది ఓటరుని కత్తితో పొడిచినంత పనియే. అధికార పార్టీలో చేరే వ్యక్తి రాజీనామా చేయాలి. తిరిగి తన నియోజక ప్రాంతంలో పోటీచేసి గెలవాలి. అప్పుడు అధికార పార్టీలో చేరాలి. కాని అలా జరగటంలేదు. ఎందుకు? రాజ్యాంగమే ఓటరుని మభ్యపెడుతోంది. ఓటుహక్కు నీది అంటోంది. ఓటుహక్కు వినియోగించుకోకపోవటం నేరమంటోంది చట్టం. మరి ఈ చట్టమే ఓటరు నిర్ణయం విఫలం అయితే నమ్మిన వ్యక్తిని గెలుపొందించే బాధ్యత ఓటరుదే. తాము గెలిపించిన నేత అధికార పార్టీలో దూకితే ఓటరు బాధ ఎవరికి పడుతుంది? పార్టీ మారిన వ్యక్తి తన పార్టీకి, నియోజకవర్గం సభ్యత్వానికి ముందుగా రాజీనామా చేయాలి కదా. తరువాత అధికారపార్టీ తరఫున మరల పోటీచేసి గెలవాలి. ఇందుకు ఓటర్లు గెలిపించడానికి సిద్ధపడతారా? నూటికి ఎనభై శాతం వరకు అంగీకరించరన్నదే అభిప్రాయం. ఈ లోపాన్ని రాజ్యాంగం ఎందుకు విస్మరిస్తోంది? రాజ్యాంగాన్ని కాలా నుగుణ అవసరాల మేరకు సరిచేయవలసిన బాధ్యత ఎవరిది? పార్లమెంటుదే. మరి పార్లమెంటులో ఉంటే రాజకీయ పక్షాలు తమకు ఇబ్బంది కలిగే అంశాలపై రాజ్యాంగ సవరణ ఎట్టిపరిస్థితుల్లో చేపట్టరు. పార్లమెంట్‌కో అసెంబ్లీకో ఎన్నికలు జరిగాయని భావిద్దాం. ఏ ఒక్కరికీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితులు నెలకొన్న సందర్భాలున్నాయి. ఒక పార్టీ అధికారాన్ని ఆశిస్తే ఇతర పార్టీ అభ్యర్థుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పరస్తున్నాయి. కాని ప్రతిపక్షంలో ఉన్న అభ్యర్థి తనంట తానుగా నిర్ణయం తీసుకొని అధికార పార్టీలో చేరడం సమంజసమా? తనను ఎన్నుకొన్న ప్రజల అభిప్రాయంమేరకే పార్టీ మారినట్లు ప్రకటించడం విడ్డూరమే. నాటి రాజ్యాంగ కర్తలు ఇటువంటి పరిస్థితులు దాపు రిస్తాయని వూహించలేకపోవడమే, ప్రస్తుత పార్టీ మార్పి డులు, అనైతిక రాజకీయాలకు ప్రధాన కారణం.

- మూలా అప్పారావు