సబ్ ఫీచర్

బోధనలో ప్రతిస్పందనే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుని ఇంద్రియాలు బైటి జ్ఞానాన్ని మాత్రమే మెదడుకు అందచేస్తుంటాయని మనందరం అనుకుంటాం. అవే ఇంద్రియాలు మనిషి మెదడులోని ఆలోచనను కూడా తమ కదలికల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియచేస్తుంటాయి. చూడటం, పరిశీలించటం అనేది రెండు ప్రక్రియలు. ఈ రెండూ కళ్లే చేస్తాయి. ఆ చూపులోనే ఈ రెండింటి తేడా అర్థమవుతుంది. కొన్నిసార్లు ఒక దృశ్యాన్ని చూస్తాం. కానీ కొన్నింటిని పరిశీలిస్తాం. పరిశీలించినట్లయితే దానిలోపల ఉన్న విషయాలు కంటికి కనపడితే కన్ను దానిపై ఫోకస్ చేసి ఆ వస్తువుపై కేంద్రీకరించటం వలన దాగి వున్నటువంటి లక్షణాలు కంటికి కనపడతాయి. దాంతో ఆ కళ్లకు సంతృప్తి కలుగుతుంది. ఆ దృశ్యం కదలికలను చూసి అందుకు తగ్గట్టుగా పిల్లలు రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షనే ఆ పిల్లల థాట్ ప్రాసెస్ (ఆలోచన విధానానికి) కిటికీలు అవుతాయి. ఆ చూపుతో అనే్వషణ ఆరంభవౌతుంది. ఆ అనే్వషణ ఫలితమే ఈనాడు మనకు కనపడుతున్న ఆవిష్కరణలు.
ఇండియాకు వెళదామని బయలుదేరిన కొలంబస్ ఒక కొత్త భూమిపైన అడుగుపెట్టాడు. అదే భారతదేశం అనుకున్నాడు. కానీ ఆయన చూసిన కొత్త దృశ్యాలు కొత్త ఖండానే్న ఆవిష్కరింపజేశాయి. ఇంద్రియాలు రెండువైపులా ద్వారాలు. బయట ప్రపంచానికి, మెదడులో జరిగే ఆలోచనల ప్రపంచానికి కటకం లాగా ఈ కళ్లు పనిచేస్తాయ. చూసే దృశ్యాలు కొందరిలో అంతర్ముఖవౌతాయి. కొత్త విషయాన్ని చూడటం అంటే దైవాన్ని చూసినట్లే అంటారు. ఆలోచనల ప్రక్రియలను ఇంద్రియాలు బహిర్గతం చేస్తాయి. కాబట్టి ఉపాధ్యాయుడు వాక్యాలను గబగబగా ఉచ్ఛరిస్తూ ముందుకు పోవద్దు. మాట్లాడిన తర్వాత పిల్లల ముఖం చూస్తే వారి రియాక్షన్ పిల్లల ముఖ కవళికల్లో కనిపించాలి. ఆ పిల్లల్లో బహిర్గతమైన అంశాన్ని ఆలోచనా ప్రక్రియలను ఉపాధ్యాయుడు వారి ముఖాల్లో చూడాలి. అప్పుడు రెండో వాక్యం మాట్లాడాలి. బోధన అనేది ఒక వైపున మాత్రమే జరిగే ప్రక్రియ కాదు. అది ఇరువైపులా జరుగుతుంటుంది. ఉపాధ్యాయుడు ప్రతిక్షణం నేర్చుకుంటాడు. బోధనలు చేస్తుంటాడు. ఉపన్యాసానికి, బోధనకున్న తేడా ఉంది. ఉపాధ్యాయుడు ఉపన్యాసకుడు కాదు. బోధన మరియు అభ్యసనం రెండు జమిలిగా జరుగుతుంటాయి. ఉపాధ్యాయుని ప్రక్రియ కనపడుతుంది. విద్యార్థి ఉపాధ్యాయునికి వౌనగురువు. ఒకరి ఆలోచనా విధానాన్ని మరొకరు అందుకుంటారు. తరగతి గది ప్రక్రియను సుసంపన్నం చేస్తారు. చూడటం, పరిశీలించటం, హేతుబద్ధంగా నిర్ణయానికి రావటం ఇవన్నీ తన చూపుతో ఇంద్రియ జ్ఞానంతో వస్తాయి.
పాఠ్యాంశాన్ని బోధించే ఉపాధ్యాయుడు అనుక్షణం పిల్లల ప్రతిస్పం దనను గమనించాలి. అది వారి కళ్లలోనే కనిపిస్తుంది. బోధన సక్రమంగా పిల్లలకు అర్థమయ్యేరీతిలో సాగుతున్నప్పుడు వారి దృష్టి ఒకలాగా, అర్థం కానప్పుడు మరోలా ఉంటుంది. దీన్ని ఉపాధ్యాయుడు పసికట్టగలగాలి. అప్పుడు మాత్రమే గురు శిష్యుల మధ్య చక్కని అనుసంధానత సాధ్య మవుతుంది. ఈ అనుసంధానతే పరస్పర అవగాహనకు, నూతన ఆలోచ నల సృష్టికి దోహం చేస్తుంది. విద్యార్థి అవగాహన ఎంత విస్తృతమైతే నూత న ఆలోచనలు అంతటి చురుగ్గా ప్రభావయుతంగా ఉంటాయ. అపుడు మాత్రమే ఉపాధ్యాయుడు తన వృత్తికి న్యాయం చేసినట్టు. అట్లా కాకుండా కేవలం ఉపన్యాసధోరణిలో చెప్పుకుంటూ వెళితే, విద్యార్థి అవగాహన చేసుకోలేకపోవడమే కాక, పాఠ్యాంశం పట్ల ఆసక్తి తగ్గుతుంది. బోధన ఉద్దేశానే్న పూర్తిగా దెబ్బతీసే ప్రక్రియగా ఇది మిగిలిపోతుంది. అందువల్ల ఉపాధ్యాయులు పిల్లలను అర్థం చేసుకుంటూ బోధన కొనసాగించాలి.

- చుక్కా రామయ్య