ఉత్తరాయణం

ఆ పరిమళాలు ఏవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో తీయనిది, అమృత తుల్యమైనది శాశ్వతమైనదీ స్నేహబంధం. రక్తబంధుత్వంకన్నా ఎక్కువ ప్రేమతో కష్టసుఖాల్లో తోడుంటూ జీవితాంతం కలిసి ఉంటారు స్నేహితులు. ఒకప్పుడు పల్లె ప్రాంతాలలో స్నేహితుల బాల్య జీవితం ఎంతో ఆహ్లాదంగా గడచిపోయేది. రోజూ సాయంత్రంవేళల్లో, సెలవు రోజులలో అందరూ ఒకచోట చేరి రకరకాల పల్లెటూరి ఆటలను ఆడేవారు. తోటలలో, పొలాలలో తిరిగేవారు. ఈత కొడుతూ ఆనందించేవాళ్ళు. రానురాను టి.వి. ఛానెల్స్ పెరిగిపోయాయి. కంప్యూటర్లు, సోషల్ మీడియా, మొబైల్ గేమ్స్ ఎక్కువై పిల్లలు, యువత వాటికి బానిసలవుతున్నారు. ఒకరితో ఒకరికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఇక క్రీడ అంటే క్రికెట్ తప్ప వేరేది ఉండటం లేదు. వెనుకటి వైభవం పల్లెల్లోనూ, పట్టణాలలోనూ రావాలి. స్నేహబంధపు పరిమళాలు అంతటా వ్యాపించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
బ్రాండ్ అంబాసిడర్లు అవసరమా?
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో డబ్బుని ఇచ్చి కొన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ‘బ్రాండ్ అంబాసిడర్లు’గా నియమించుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఏటా ఎలాగూ కొన్ని వేల కోట్లు ఖర్చుచేసి మరీ విధానపరమైన అంశాలను, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాల వంటి వాటిని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నప్పుడు వేరేగా బ్రాండ్ అంబాసిడర్లు ఎందుకు? వారి ప్రచారం ఎందుకు? ప్రభుత్వాలు వ్యాపార సంస్థలు కావు కదా. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన నాయకుడిని మించిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు కాగలరు? బ్రాండ్ అంబాసిడర్లవలన ప్రభుత్వాధినేతలు వారి ప్రాధాన్యతను వారే తగ్గించుకుంటున్నట్లుగానే అవుతోంది.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్
మరుగుదొడ్లు ఏర్పాటుచేయండి
మన రాష్ట్రంలో మరుగుదొడ్లు కట్టడం చాలా మట్టుకు జరిగింది. ఇంకా కొన్ని జిల్లాలలో మరుగుదొడ్లు కట్టాలి. ఆరుబయట మలవిసర్జనవలన అనారోగ్యాలకు ప్రజలు గురవుతున్నారని ప్రభుత్వంవారు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టారు, మంచిదే. కాని అనాధులు ప్లాటుఫారాలు మీద పడుకునేవారికి చెట్ల క్రింద గుడారాలు వేసుకుని నివసించే వారికి కూడా మరుగుదొడ్లు నిర్మించినట్లయితే అనారోగ్యాలకు గురి అవ్వ రు. అందువలన గ్రామాలలో, పట్టణాల్లో అనాధులకు, బిచ్చ గాళ్లకు ఏ ప్రాంతాలలో మరుగుదొడ్లు నిర్మిస్తే బాగుంటుందో ప్రభుత్వంవారు ఆలోచించాలి.
- ఎం.బి.సత్యం, రామచంద్రపురం కాలనీ
వేతనాలు చెల్లించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాఖా గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, అధికారులకు 010 పద్దుపై ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లించేందుకు రాష్ట్ర సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై గ్రంథాలయ సంస్థ సిబ్బంది సంఘాలు ఉన్నతాధికార్లకు పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకుండాపోయింది. ఈ పద్దు క్రింద వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జీతాలు రెండు, మూడు నెలలకొకసారి అందుతున్న దయనీయ స్థితి కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని దాదాపు అన్ని శాఖల్లోని సిబ్బంది 010 పద్దు కింద వేతనాలు, ఇతర అలవెన్సులు సకాలంలో పొందుతున్నారు. అయితే గ్రంథాల య ఉద్యోగులు ఈ అదృష్టానికి నోచుకోలేకపోతున్నా రు. వీరికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
పుట్టపాక చేనేతకు పురస్కారం
నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారులు మర్రి రాధాకృష్ణ మూర్తి, కొలను బుచ్చిరాములు ఈ ఏడాది చేనేత జాతీయ అవార్టుకు ఎంపిక కావడం హర్షదాయకం. 108 రకాల డిజైన్లతో కూడిన చీర వీరికి పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.
- ఎస్. వీరభద్రరావు, గొల్లపాలెం