సబ్ ఫీచర్

ర్యాగింగ్‌ను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాశాలలో చేరిన విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడం పరమ కిరాతక చర్య. ఆనవాయితీ చర్య. ర్యాగింగ్ అనేది పైశాచిక క్రీడ. శాడిస్టుల పని. విద్యార్థులకు అవమానం కల్గిస్తుంది. బాధ, భయం, భీతి, దిగులు కల్పిస్తోంది. సామాజిక ఆమోదం లేని పనులకు రాక్షస రూపం ర్యాగింగ్ ప్రక్రియ.
ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆగ్రికల్చర్, పీజీ కళాశాలలు, బిఎడ్, డి.ఇడి., ఎం.బి.ఏ. విశ్వవిద్యాలయాల అధ్యయన కేంద్రాల్లో ర్యాగింగ్ విష బీజాలు నాటుతున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల పోలీసులు, వివిధ శాఖల అధికారులు ర్యాగింగ్‌ను అడ్డుకట్టవేయడానికి ముందస్తు ప్రచారం మొదలుపెట్టారు. ర్యాగింగ్ అడ్డుకట్టకు వినూత్న విధానాలు అవలంబిస్తోంది.
విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే సమయంలో ర్యాగింగ్ వ్యతిరేక విధానాలను ఆయా కాలేజీ నిర్వాహకులు నిర్వహించాలి. ప్రతి కాలేజీలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీని ఏర్పాటుచేసి, పోషకులు, అధ్యాపకులతో కమిటీ వేయాలి. కళాశాలల నియమ నిబంధనలతోపాటు ర్యాగింగ్ గూర్చి ప్రముఖంగా ప్రచారం నిర్వహించాలి. పోలీసులు, కళాశాల యాజమాన్యాల ఫోన్ నెంబర్లను కళాశాలల గోడల మీద అందరికి అందుబాటులో ఉండేటట్లు ప్రదర్శించాలి. ప్రతి కాలేజీలో విద్యార్థుల ఫిర్యాదుల పెట్టెలను పెట్టి వికృతచేష్టలు చేస్తున్న వారి ప్రవర్తనలో పరివర్తన వచ్చేటట్లు వ్యవహరించాలి.
విద్యార్థులు కళాశాలకు వస్తున్న మార్గంలో ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోవాలి. నేరుగా ఫిర్యాదు చేయని వారి కోసం, కాగితంలో సమస్యను రాసి ఫిర్యాదు బాక్స్‌లో వేయాలి. కళాశాలలు పరిష్కరించని కేసులను పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పరిష్కరిస్తున్నారు. బాధితుల పేర్లను గోప్యంగా ఉంచి, నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల ద్వారా ర్యాగింగ్ నిరోధానికి తగిన ఏర్పాటుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేరుగా పోలీసు ఠాణాకు వెళ్ళని వారికోసం వాట్సప్ ద్వారా ఫిర్యాదులకు స్వీకరిస్తున్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తున్నది. తెలంగాణలో పోలీసులు ‘షీ టీమ్’లను ఏర్పాటుచేసి విజయం సాధించారు. వాట్సప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల మీద సత్వర చర్యలు తీసుకోవటంలో బాలికలు, మహిళల్లో ధైర్యం పెరిగింది. పోలీసు సబ్ డివిజన్ కేంద్రాలకు ప్రత్యేక నియంత్రణ కేంద్రాలు ఏర్పాటుచేశారు.
విద్యార్థులపై జరుగుతున్న దాడులు, ప్రేమపెళ్ళి పేరిట మోసాలు, కళాశాలల్లో ర్యాగింగ్ వికృత క్రీడను అడ్డుకోవడానికి అన్ని జిల్లాల పోలీసులు ప్రాజెక్టు ప్రజ్ఞతో భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులతో పోలీసు అధికారులు సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసి కరపత్రాలు, గోడ ప్రతులు, సీడీలను విడుదల చేసి ర్యాగింగ్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ర్యాగింగ్ చేసినట్లు రుజువైతే విద్యాసంస్థనుంచి శాశ్వతంగా తొలగించవచ్చు లేదా టెంపరరీగా తొలగించవచ్చు. ఇతర సంస్థలో ప్రవేశాలు రద్దుచేయవచ్చు. పాసుపోర్టు పొందకుండా, ఉద్యోగం పొందకుండా చేయవచ్చ. పోటీ పరీక్షలు రాయకుండా, ఉపకార వేతనాలు పొందకుండా చేయవచ్చు. ర్యాగింగ్ వికృతచేష్టలు చేసిన వారికి రెండున్నర లక్షల దాక జరిమానా విధించవచ్చునని ఆదేశాలు వచ్చాయి. ఎందరో ర్యాగింగ్‌వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి చరమగీతం పాడాలి.
ర్యాగింగ్ వల్ల మనోవేదనకు గురైన విద్యార్థి భవిష్యత్తు దెబ్బతింటుంది. అతని తల్లిదండ్రులకు వేదనే మిగులుతుంది. ఎంతో ఖర్చుపెట్టి, మంచి చదువులు చదివించాలన్న తల్లిదండ్రుల కలలుకల్లలుగానే మిగిలిపోతాయ. జీవితాలతో ఆటలాడుకునే రీతిలో సాగే ఈ ర్యాగింగ్‌లను రద్దు చేయాలి.

- రావుల రాజేశం