మెయన్ ఫీచర్

క్రీడల్లో మనం తలెత్తుకోవాలంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగేళ్ల కోసారి జరిగే ఒలింపిక్ ఆట ల్ని దృశ్యమాధ్యమమైన టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆటగాళ్లని, ఆటల్ని ప్రత్యక్షంగా చూడడం జరుగుతున్నది. కొందరు ఆటగాళ్ల దేశాన్ని ప్రపంచ పటంలో వెతికినా తొందరగా గుర్తించని స్థితి. అయినా అలాంటి దేశాలు సైతం స్వర్ణాల్ని చేజిక్కించుకుని పెట్టుబడి దారి దేశాలకు, సంపన్న దేశాలకు వలస వాద దేశాలకు సవాళ్లని విసురుతూనే వున్నా యి. ఇలాంటి దేశాలనుంచే అభివృద్ధి చెంది న దేశాలకు వలస వెళ్లిన వారు సైతం ఈ బడా దేశాల్ని తలెత్తుకునేలా చేస్తున్నారు. చివరికి ఆర్థికంగా చితికి ఆకలి రాజ్యంగా పేరుగాంచిన ఇథియోపియా లాంటి దేశా లు కూడా ఒలింపిక్స్ క్రీడల్లో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు తూర్పున వెతికినా కనపడని దేశం ఫిజి. కేవలం తొమ్మిది లక్షల జనాభా కలిగిన ఈ చిన్న దీవి రగ్బీ ఆటలో, మొనగాడి దేశమైన బ్రిటన్‌ను ఓడించి రియోలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఉత్తర అమెరికా దక్షిణానగల కరేబియన్ సముద్రంలో వుండే ఓ చిన్న ద్వీపం జమైకా. 2008 బీజింగ్ ఓలింపిక్ నుంచి ఓ నల్ల జాతీయుడైన ఉస్సేన్ బోల్ట్ ప్రతీ ఒలింపిక్‌లో ఆ దేశ జండాను ఎత్తిపడుతునే వున్నాడు. ఈ దేశానికే చెందిన మరో నల్ల జాతీయురాలు ఎలేన్ రాంప్సన్ మహిళా స్ప్రింటర్‌గా రియోలో బంగారు పతకాన్ని మెడలో వేసుకుంది. మహిళల ప్రొడునోవా వాల్ట్ జిమ్మాస్టిక్‌లో 8వ స్థానంనుంచి 4వ స్థానానికి ఎదిగి పతకాన్ని జేజిక్కించుకోకున్నా ప్రాణాంతక విన్యాసం చేసి భారత పతాకాన్ని రియోలో ఎత్తిపట్టిన దీప కర్నాకర్ దేశంలోనే చిన్న రాష్టమ్రైన త్రిపురలో ఓ సాధారణ కుటుం బం నుంచి వచ్చింది. దీపతో పోటీపడిన అమెరికా జిమ్మాస్ట్ సిమోన్ బైల్స్ అమెరికా పౌరురాలే అయినా శే్వత జాతీయురాలు కాకపోవడం గమనార్హం. పైగా తండ్రికి దూరమై తల్లి తాగుడుకు బానిసకాగా, తాతమ్మల సంరక్షణలో పెరిగిన 19 సంవత్సరాల సాధారణ అమ్మాయి. ఇలాంటి వారిని అంతర్జాతీయ క్రీడాకేంద్రాల వేదికల్లో చూస్తుంటే తమ దేశంపట్ల వీరికి గల అభిమానం, ప్రేమ, అన్నింటికీ మించి దేశ ప్రజలుపెట్టిన గురుతర బాధ్యత వారిలో ద్యోతక మవుతాయి. పతకాలను మెడలో వేస్తున్నప్పుడు వారి కళ్లల్లోని ఆర్ధ్రత, కన్నీరు వారి అంతరంగానే్న కాక వారి కఠోర దీక్షకు అద్దం పడుతుంది.
మనదీ సువిశాల దేశమే! విభిన్న జాతులతో మానవ వనరులున్న దేశం. గతంలో కన్నా ఈసారి రియోకు అత్యధికంగా ఆటగాళ్లను పంపినా జనాభా ప్రాతిపదికన ప్రతి కోటి జనాభాకు ఒకరినే పంపగలిగాం. ఈమధ్యన పార్లమెంటుకు ఒలింపిక్ క్రీడలపై ఇచ్చిన నివేదికలో ప్రతీ భారత జాతీయుడిపై కేవలం 3 పైసల్ని ఖర్చు చేస్తున్న ట్టు ప్రస్తావించారు. పతకాల పంటను పం డిస్తున్న దేశాలు మనకన్నా పదింతలు, ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఈ లెక్కలు మనం ఆటలకిస్తున్న ప్రాధాన్యతను తేటతెల్లం చేస్తున్నాయ. జనాభా దామాషాలో ఇది స్వల్పమే అయినా, గతంతో పోలిస్తే ఈసారి బాగానే ఖర్చుపెట్టాం. ప్రతి ఒలింపిక్ క్రీడాకారునిపై 30 లక్షలనుంచి కోటిన్నర దాకా ఖర్చు చేయగా, 15-20 కోట్ల బడ్జెట్‌నుంచి 125 కోట్లకు పెంచాం. కానీ అధికారులకు, క్రీడల బ్యూరోక్రాట్లకే జేష్ట్భాగం ఖర్చు కావడం కనపడని సత్యం. ప్రతిరోజు అధికార గణానికి వంద డాలర్లు ఇవ్వగా ఆటగాళ్లకు 50 డాలర్లనే ఇచ్చేది. ఈసారి వీరికి కూడా వంద డాలర్లను ఇచ్చా రు. ఈ లెక్కన క్రీడాకారుల శిక్షణకై, వారి బాగోగులకై ఇస్తున్నదెంత అనేది ఎప్పుడూ వివాదాస్పదమే!
ఆటలతో సంబంధం లేనివారు రాజకీయ పలుకుబడితో ఈ వేదికలకు హాజరు కావ డం, వీరి ఖర్చును కూడా ఈ లెక్కల్లోనే చూపడం జరుగుతున్నది. అంతర్జాతీయం గా వ్యాపారాలు చేసుకునేవారు రాజకీయ నాయకులు క్రీడా సంఘాల్లో సభ్యులుగా వుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మానవ వనరులంటే ఏంటో తెలియని వారు, వీరి నైపుణ్యతల్ని గుర్తించలేని వారు మంత్రులుగా ఈ దేశంలో కొనసాగుతున్నారు. వీరికి సలహాలనిచ్చే అధికార యంత్రాంగానిదీ ఇదే తంతు. ఏ క్రీడా అకాడమీ రాజకీయాలకు అతీతంగా పనిచేయదు. పైగా ప్రతీ దాంట్లో రెండు మూడు సమాంతర సమాఖ్యలుంటాయి. సవతి పోరులా సమాఖ్యల మధ్యన పోరు మన క్రీడలకు, క్రీడాకారులకు ఎప్పుడూ గ్రహణం పట్టిస్తునే వుంటాయి.
స్వాతంత్య్రానికి ముందు 1928, 1932, 1936లలో వరసగా హాకీలో స్వర్ణాన్ని సాధించాం. అప్పుడు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌సింగ్, రూప్‌సింగ్‌లు ప్రాతినిధ్యం వహించారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వా త జరిగిన 1948 లండన్ ఒలింపిక్స్‌లో 1952 హేల్కిన్సీ ఒలింపిక్స్‌లో బల్బీర్‌సింగ్ స్వర్ణాన్ని సాధించిపెట్టి ధ్యాన్‌సింగ్ వారసత్వాన్ని ఎత్తిపట్టాడు. 1956లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఉద్ధమ్‌సింగ్ పాకిస్తాన్‌పై 15 గోల్స్ చేయడం గమనార్హం. ఇలా వరసగా ఆరుసార్లు స్వర్ణ పతకాన్ని మెడలో వేసుకున్న భారత్ 1960 రోమ్ ఒలింపిక్స్‌లో మొదటిసారి అదే పాకిస్తాన్ చేతిలో ఓడి రజత పతకానికి పరిమితమైంది. తర్వాత 1964 టోక్యోలో స్వర్ణాన్ని చేజిక్కించుకున్నా 1968 మెక్సికోలో, 1972 మ్యూనిచ్‌లో కాం స్య పతకాలకు పరిమితమైంది. 1976లో 1984 నుంచి 2004 దాకా పతకాలకు దూరమైంది. 1980లో మాస్కోలో ప్రత్యర్థులు ఒలింపిక్స్‌ను బహిష్కరించడంతో సునాయాసంగా స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. ఇదే చివరి హాకీ పతకం కాగా 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత పొందక పోగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో చివరి 12వ స్థానంలో నిలిచింది. ఈసారి క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంతో ఆడి పరాభవాన్ని చవిచూసింది. ఇప్పుడు కూడా ఆకాశ్‌దీప్‌సింగ్ ప్రారంభంలోనే బెల్జియంపై గోలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇలాంటి మన హాకీ కథనంలో స్పష్టంగా కనపడుతున్నది పంజాబీయులే! అక్కడి రాజకీయ అనిశ్చిత స్థితి యువతను మత్తు మందులవైపు మళ్లించగా, యావత్‌దేశ యువత క్రికెట్‌కు, సెల్‌ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. భార త హాకీ సమాఖ్య, హాకీ ఇండియా సంస్థల ద్విముఖ పోరులో భారత హాకీ ఇరుక్కుపోయింది. దీనికంతటికీ మన బురదమయమైన రాజకీయాలే కారణం కాదా!
క్రీడా స్థలాలు కాదుగదా, ప్రార్ధనా స్థలాలే కరువైన మన పాఠశాల వ్యవస్థ, ఉన్నా ఆట లాడడం నేరంగా భావించే విద్యా వ్యవస్థ, ఆటలాడి చెడుతున్నారని నిందించే తల్లిదండ్రుల మానసిక స్థితి, వ్యక్తిగత చొరవతో ఆడినా ప్రోత్సాహంలేని రాజకీయ సామాజిక వ్యవస్థలు, వెరసి మన క్రీడలకు గ్రహణం పట్టిస్తున్నాయి. క్రీడాకారుల్ని ఎదగకుండా చేస్తున్నాయి. గతంలో క్రీడలు చదువులో భాగంగా వుండగా ఇప్పుడు ఎకాడమీలకు పరిమితమవుతున్నాయి. అందు లోనూ క్రికెట్‌దే హవా! ఆటల టీచర్లు వున్నా ఆడలేక స్వయంగా బరువెక్కుతున్న వైనం! షాపింగ్‌మాల్స్ నుంచి మొదలుకుంటే గ్రామాల్లో జరిగే జాతర్ల దాకా పిల్లల్ని ఆకర్షించేవి క్రికెట్ బ్యాట్లే. తల్లిదండ్రులు కొనిచ్చేది రాజకీయ నాయకులు పంచేవి క్రికెట్ సామగ్రినే! పిచ్చయ్య బ్యాటంటే ఏంటో తెలియని యువతకు క్రీడలు అభిమానంగా కాలేకపోతున్నాయి.
అలా అని మనకు క్రీడాకారుల కొరత వుందా...? సిడ్నీ ఒలింపిక్స్‌లో బరువునెత్తి పరువు నిలిపిన కరణం మల్లీశ్వరి వుండేది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పంచ్‌లు గుద్ది మనకు కళ్లు తిరిగేలా చేసిన మేరీకోం వుంది. 1984లో పరుగుల రాణిగా గుర్తింపు పొందిన పిటి ఉష కూడా ఉండింది. ఒడిశా బుడత పరుగుల బుధియాసింగ్ ఓ దిక్కుమాలిన భువనేశ్వర్ స్పోర్ట్స్ కోచ్‌కై ఎదురు చూస్తున్నాడు. జాతీయ స్థాయికి ఎదగకముందే రాజకీయ గ్రహణం బుధియాకు పట్టింది. చెట్టుకొమ్మల్లో దాక్కున్న పిట్టని కొట్టే గుళేరుగాళ్లున్నారు. ఒకే బాణంతో చిన్న కుందేళ్లను వేటాడే చత్తీస్‌గఢ్ గిరిజన పసిపాపలున్నారు. సర్కస్ ఫీట్లు చేసేవాళ్లు, సైకిల్ తోక్కేవారు, ఈతగాళ్లు, బరువుల్ని ఎత్తే పోతుగాళ్లు వున్నారు. మన చదువులు వీరిని గుర్తించే స్థితిలో లేవు. రాజస్థాన్ కోట కోచింగ్ కేంద్రాలనుంచో, కార్పొ రేట్ చదువుల బట్టీలనుంచో డాక్టరుగా, ఇంజనీరుగా, ఐఐటియన్లుగా ఎదిగితే మనకు ఎనలేని సంతోషం. మన పత్రికలు వీటినే ఎత్తిపట్టి రాస్తాయి. మన విద్యావేత్తలు వీటిగురించి మాట్లాడితే విద్యామంత్రులు తాళాలు కొడతారు. ప్రభుత్వ విద్యారంగానికి ప్రైవేటు విద్యారంగం ఆదర్శంగా మారితే, యువత మునిగేది కార్పొరేట్ మత్తులోనే!
మన దేశానికి స్వాతంత్య్రం లభించి 70వ ఏట ప్రవేశించాం. ఇప్పటివరకు మ నం పాల్గొన్న ఒలింపిక్స్ 33 కాగా, సాధించిన పతకాలు మొత్తంగా 28మాత్రమే! ఇందులో 8 హాకీ బంగారు పతకాలు కాగా మరోటి అభినవ్ బింద్రా షూటింగ్‌లో సాధించిన బంగారు పతకంతోపాటు 7 రజతాలు, 12 కాంస్యాలు మాత్రమే. 15వ ఏట 2000 సిడ్నీ ఒలింపిక్‌లో అడుగుపెట్టిన అమెరికా స్విమ్మర్ మైఖేల్ పెల్ఫ్స్ 2008 బీజింగ్ ఒలింపిక్‌నుంచి నేటి రియో ఒలింపిక్స్ దాకా సాధించిన పతకాలు మొత్తం 28 కాగా అందులో బంగారు పతకాలే 23 కావడం గమనార్హం! మిగతావి మూడు రజతాలు కాగా రెండు కాం స్యాలు! ఇప్పుడున్న మన రాజకీయ స్థితి లో తలకిందులుగా తపస్సు చేసినా మనం ఓ పెల్ఫ్స్‌ను తయారు చేయగలమా అనేది అందరు వేసుకోవాల్సిన ప్రశ్న! ఇలా వేసుకుంటే తప్ప 2020లో జరిగే టోక్యో ఒలింపిక్‌లో తలెత్తుకోలేమేమో!
ప్రశ్న వేసుకోకున్నా పర్వాలేదు గానీ మనస్పూర్తిగా దీపను పంపించినా అదే ఓ స్వర్ణ పతకంగా భావించాలి. బుధియాల్ని గుర్తించి ప్రోత్సహిస్తే పది స్వర్ణాలతో సమానమే! రియో ఒలింపిక్స్ సందర్భంగా బ్రెజిల్ ప్రజలు మాత్రం ఇలాంటి ప్రశ్నలే వేసుకుంటున్నారు మరి!

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162