సబ్ ఫీచర్

స్వరాజ్యం కోసం తపించిన తిలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన అనర్గళమైన వాగ్ధాటితో, అనితర ధైర్య సాహసాలతో, త్యాగాలతో జాతికి స్ఫూర్తినిచ్చిన చైతన్యమూర్తి బాలగంగాధర తిలక్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటుచేసిన విప్లవవీరుడు. తిలక్ రంగంలోకి ప్రవేశించకముందు భారత జాతీయ కాంగ్రెస్ కలాపాలు సమావేశాలకు, తీర్మానాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. తిలక్ అవలంబించిన దృఢ వైఖరి వల్లనే కాంగ్రెస్ ఒక శక్తివంతమైన సంస్థగా రూపొందింది. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని గర్జించి జీవితాంతం దేశ స్వాతంత్య్రానికోసం పోరాడిన తిలక్‌ను జాతి ‘లోకమాన్యు’డని గౌరవించింది. దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి, జాతిని బానిసత్వం నుంచి విముక్తం చేయాలన్నది ఆయన జీవితాశయం.1856 జూలై 23న రత్నగిరిలో ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టిన తిలక్, కేసరి, మరాఠీ అనే రెండు పత్రికలను స్థాపించారు. తిలక్ తన వృత్తిని పత్రికా రంగం, గ్రంథ రచన అని చెప్పుకునేవారు. జాతీయ పోరాటంలో కేసరి పాత్ర అమోఘం. ఆయన పాండిత్య, ప్రజ్ఞాపాటవాలు అద్భుతం. ‘ఉత్తర ధృవమే వేదాల జన్మభూమి. క్రీస్తు పుట్టుకకు పూర్వం ఆరువేల సంవత్సరాలకు పూర్వమే ఇది జరిగిందని సోదాహరణంగా తేల్చి చెప్పారు. భగవద్గీతపై ఆయన రచించిన భాష్యం-856 పేజీల గీతా రహస్యం అనే ఉద్గ్రంథం మొదట కూర్చే ఆరు వేల ప్రతులు ఒక పక్షంలోనే అమ్ముడుపోయాయంటే అది ఎంత ప్రజాభిమానమైన గ్రంథమో తెలుసుకొనవచ్చు అన్ని భారతీయ భాషల్లో దాని అనువాదాలు వెలువడ్డాయి.
తిలక్ దృష్టి క్రియాశీలక రాజకీయాలవైపు మరలగానే గణపతి ఉత్సవాల నిర్వహణ చేపట్టి మతం ద్వారా రాజకీయ భావ ప్రచారాన్ని ప్రారంభించారు. శివాజీ ఉత్సవాలు కూడా జరిపించారు. దీనితో ప్రజల్లో ముఖ్యం గా పశ్చిమ భారతదేశంలో రాజకీయ చైతన్యం పెల్లుబికింది. 1889లో బొంబాయి కాంగ్రెస్ మహాసభకు ప్రతినిధిగా హాజరైన తిలక్ అక్కడనే లాలాలజ్‌పత్‌రాయ్, బిపిన్‌చంద్రపాల్‌ను కలుసుకున్నారు. ఇక నుంచి ఈ మువ్వురి భారతదేశ చరిత్రలో లాల్-బాల్-పాల్‌గా ప్రసిద్ధులైనారు. వీరితోనే కాంగ్రెస్‌లో అతివాదుల శకం ప్రారంభమైంది.1896-97లో దేశమంతటా తీవ్రమైన కరువూ కాటకాలు సంభవించాయి. ఎంతో మంది ప్రజలు ఆకలి చావులకు బలైనారు. ఆ సమయంలో తిలక్ నడుం బిగించి అన్నార్తులకు చేతనైన సహాయమందించారు. 1897లో బొం బాయి నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించడంతో పరిస్థితి మరింత విషమించింది. లోపభూయిష్టమైన ప్రభుత్వ చర్యలను తిలక్ తీవ్రంగా ఖండించి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. ప్లేగు వ్యాధి నివారణ చర్యలలో అలసత్వం ప్రదర్శించిన ప్లేగు నివారణ అధికారి రాండ్‌ను ప్రజలు హత్య చేశా రు. ఈ నేరాన్ని తిలక్‌పై మోపి ప్రభుత్వం ఆయనను బంధించి 18 నెలలు జైల్లో ఉంచింది. 1905లో జరిగిన బెంగాల్ విభజనను తన పత్రిక కేసరిలో అదే పనిగా విమర్శిస్తున్న తిలక్‌ను ప్రభుత్వం అరెస్టుచేసి మాండలే జైల్లో ఉంచింది. ఆరేళ్ళ తరువాత ఆయనను జైలునుంచి విడుదల చేసారు. తర్వాత హోమ్‌రూల్ ఉద్యమంలో పాల్గొన్నారు. అనిబిసెంటుతో కలిసి పనిచేసారు.దేశంలో సంపూర్ణ మద్యనిషేధం విధించాలని కోరిన సంఘసంస్కర్త తిలక్. తన తండ్రి తనకు 16వ ఏటనే పెళ్ళిచేయకపోతే తాను బ్రహ్మచారిగానే ఉండిపోయేవాడినేమో అని చెప్పుకునేవారు. బాల్య వివాహాలను నిరసించేవారు. వితంతు వివాహాలను ప్రోత్సహించేవారు.కుటుంబ బాదరబందీలు లేని వారే గొప్ప పనులు చేయగలరని అభిప్రాయపడేవారు. తిలక్ జీవితం చాలా నిరాడంబరంగా సాగింది. ఆయనకున్న అలవాటు పోక చెక్కలు నమలడం ఒక్కటే. వేసవి రోజుల్లో మాత్రం ఐస్ వేసిన సోడా తాగడం యిష్టపడేవారు. మంచి టీ అంటే యిష్టమే. స్వరాజ్యంకోసం తపించి పోయిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ దాన్ని చూడకుండానే 1920 ఆగస్టు ఒకటవ తేదీన కన్నుమూసారు.

- జి.వెంకటరామారావు