సంపాదకీయం

పట్టుబడిన పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో నివసిస్తున్నాడన్న వాస్తవాన్ని ఐక్యరాజ్యసమితి కూడ నిర్ధారించడం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనదేశం జరుపుతున్న పోరాటానికి బలం చేకూర్చిన పరిణామం. ఈ వాస్తవాన్ని మన ప్రభుత్వం 1993నుంచీ పదే పదే చెబుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం పదే పదే నిరాకరిస్తోంది. మన ప్రభుత్వం సమర్పించిన సాక్ష్యాధారాల ప్రాతిపదికగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఉపసంఘం వారు పాకిస్తాన్‌లో దావూద్ ఉనికిని ధ్రువీకరించడం మనకు లభించిన దౌత్య విజయం... భద్రతా మండలికి చెందిన ఈ 1267వ ఉపసంఘం చేసిన నిర్ధారణ వల్ల పాకిస్తాన్ ప్రభుత్వం రెండు దశాబ్దులకు పైగా అబద్ధాలను చెప్పిందని ప్రపంచ దేశాలకు ఆధికారికంగా స్పష్టమైంది! 1993లో మన ముంబయిలో భయంకర బీభత్స కాండను జరిపించిన దావూద్ అప్పటినుంచి పాకిస్తాన్‌లోనే ఉన్నాడు. పాకిస్తాన్ కేంద్రంగా బీభత్స కలాపాలను జరిపిస్తూనే ఉన్నాడు. పాకిస్తాన్‌లో తొమ్మిది చోట్ల దావూద్‌కు నివాసాలు చిరునామాలు ఉన్నట్టు మన ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నిర్ధారణ వివరాలను పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియజేసింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సాక్ష్యాలు సాక్ష్యాలు కావని యధావిధిగా బుకాయించింది. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అభియోగాలను ధ్రువపరిచే సాక్ష్యాధారాలు చూపించమని పాకిస్తాన్ ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కోరుతోంది. కానీ మన ప్రభుత్వం స్పష్టమైన సాక్ష్యాలు అందచేసిన తరువాత ఇవి సాక్ష్యాలు కాదు, వీటి వల్ల నేరాలు ధ్రువపడవు...అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటిస్తోంది ఈ ప్రహసనం దశాబ్దుల తరబడి వివిధ బీభత్స ఘటనల వ్యవహారంలోను, వివిధ బీభత్స జిహాదీ ముఠాల విషయంలోను, అనేక మంది కరుడుగట్టిన బీభత్సకారుల విషయంలోను పునరావృత్తం అవుతోంది. 1993లో ముంబయిలో జరిగిన భయంకరమైన పేలుళ్ల నాటి నుండి ఈ సంవత్సరం ఆరంభంలో పంజాబ్‌లోని పఠాన్‌కోట వద్ద వైమానిక దళం ప్రాంగణంలో జరిగిన బీభత్సకాండ వరకు వందలాది పాకిస్తానీ దశ్చర్యల గురించి పైశాచిక కాండల గురించి మన ప్రభుత్వం సాక్ష్యాధారాలను అందచేసింది. ఈ సాక్ష్యాలను పాకిస్తాన్ ప్రభుత్వం తోసిపుచ్చడం చరిత్ర. దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే వున్నాడన్న నిజాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరించడం ఈ దశాబ్దుల వంచన క్రీడలో భాగం. దావూద్ ఇబ్రహీంనుండి జాయిష్ మొహమ్మద్ ముఠాలోని మొదటి ఉగ్రవాది మసూద్ అఝార్ వరకు, జమాత్ ఉద్ దవా ముఠాకు చెందిన హఫీజ్ సరుూద్ వరకు-పాకిస్తాన్ ప్రభుత్వం నీడలో అసంఖ్యాక భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఎదుగుతున్నారు. సమితి నిర్ధారణలో పాకిస్తాన్ వంచక భాండం బద్దలైంది!
ఇలా, ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ఆధికారికంగా నిర్ధారించడం ఉగ్రచరిత్రలో మరో ఘట్టం, దావూద్ ఇబ్రహీం అనే భయంకర బీభత్స కారుడు పాకిస్తాన్‌లో నివసిస్తున్నాడన్న నిర్ధారణ కొత్తది కాదు. 1993లో ముంబయిలో దారుణ మారణకాండ జరిపించిన దావూద్ అప్పటినుంచి పాకిస్తాన్ ప్రభుత్వ అతిథిగా కొనసాగుతుండడం జగమెరిగిన సత్యం. జగమెరిగిన ఈ సత్యం ఐక్యరాజ్యసమితికి తెలుసు, భద్రతామండలికి తెలుసు. ఈ సత్యాన్ని సత్యం కాదని పాకిస్తాన్ ప్రభుత్వం 1993నుంచి ఇప్పటి వరకూ ప్రకటిస్తూనే ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా అబద్ధాలను చెబుతుండడం గురించి కూడ ఐక్యరాజ్యసమితికి తెలుసు, అగ్రరాజ్యాలకు తెలుసు. అయినప్పటికీ అమెరికా వంటి అగ్రదేశాలు కాని ఐరోపా దేశాలు కాని పాకిస్తాన్‌ను అభిశంసించలేదు! ఐక్యరాజ్యసమితి దావూద్ ఇబ్రహీం ప్రపంచ ఉగ్రవాది-గ్లోబల్ టెర్రరిస్ట్ అని దశాబ్ది క్రితమే నిర్ధారించింది. అయినప్పటికీ సమితి తరఫున దావూద్‌ను అరెస్టు చేయడానికి ప్రపంచ నిఘా సంస్థ ఇంటర్‌పోల్‌ను ఎవ్వరూ కోరిన దాఖలా లేదు. అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం-ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్-లో అతగాడికి వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు కాలేదు. అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉండిన బిన్‌లాడెన్ కోసం గాలించింది. మట్టుపెట్టింది. బిన్‌లాడెన్ అల్‌ఖాయిదా జిహాదీ మఠా అధినేత. అఫ్ఘానిస్థాన్‌ను అనేక ఏళ్లపాటు జిహాదీ సామ్రాజ్యంగా మార్చగలిగిన లాడెన్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతుడైన బీభత్సకారుడు! అలాంటప్పుడు అమెరికా ప్రభుత్వం దావూద్ ఇబ్రహీంను ఎందుకని పట్టుకోలేదు? అంతర్జాతీయ బీభత్సంపై అంతర్జాతీయ సమరం జరుపుతున్న అమెరికా దృష్టిలో అంతర్జాతీయ భద్రత అంటే తమ జాతీయ భద్రత మాత్రమే! అందువల్లనే దావూద్ ఇబ్రహీం, మసూద్ అఝార్, హఫీజ్ సరుూద్ వంటి ఉగ్రవాదుల జోలికి అమెరికా వెళ్లదు. దురద పుట్టినవారే గోక్కోవాలి అన్నది అంతర్జాతీయ నీతి!
ఈ నీతిని మన ప్రభుత్వం అమలు జరిపినప్పుడు మాత్రమే మన దేశాన్ని బద్దలు కొట్టడానికి యత్నిస్తున్న జిహాదీలను, మావోయిస్టులను, ఈశాన్య ప్రాంతంలో విచ్చిన్నకాండ జరుపుతున్న ఉగ్రవాదులను అదుపు చేయడానికి వీలు కలుగుతుంది! దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్‌లో తొమ్మిది చోట్ల నివాసాలున్నాయి. ఈ వివరాలు ప్రముఖంగా ప్రచారమవుతున్నాయి. మన ప్రభు త్వం ఈ తొమ్మిది చిరునామాలను సమితికి సమర్పించిందట. అయితే భద్రతామండలి ఉపసంఘం వారు ఆరు చిరునామాలను మాత్రమే ధ్రువీకరించారు. మిగిలిన మూడు చిరునామాలను నిరాకరించడానికి ప్రాతిపదిక ఏమిటన్నది తెలియరాలేదు. అమెరికా తమ దేశంపై దాడులు జరిపించిన బిన్ లాడెన్‌కు పాకిస్తాన్‌లో ఉన్న స్థావరంపై దాడి జరపగలిగింది. ఇది అంతర్జాతీయ న్యాయ నిబంధనలకు విరుద్ధం కానప్పుడు మన దేశం కూడా పాకిస్తాన్‌లో దావూద్ నక్కి ఉన్న స్థావరాలపై నివాసాలపై దాడి జరిపి అతగాడిని మన దేశానికి పట్టుకుని రావడం కూడ దౌత్య నిబంధనలకు విరుద్ధం కాదు. ఒక దేశ ప్రజలను హత్య చేసిన నేరస్థుడు మరో దేశంలో నిర్దోషి కాజాలడు.
మన ప్రభుత్వం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఇలాంటి పట్టిపరిమార్చే విధానాన్ని అమలు చేయగలదా? అన్నది ప్రశ్న! అలా పిశాచ స్వభావుడైన దావూద్‌ను ఈ పట్టిపరిమార్చే-హాట్ పర్స్యూట్-వ్యూహం ద్వారా తరలించుకొని రాగలిగితే అంతర్జాతీయ సమాజం నిరసించదు హర్షిస్తుంది. చిన్న దేశమైన ఇజ్రాయిల్ ఇలాంటి సాహస కృత్యాలను అనేకసార్లు జరిపింది. దావూద్ ముఠావారు 1993 మార్చిలో ముంబయిలో రెండు గంటల కాల వ్యవధిలో పనె్నండు పేలుళ్లను జరిపారు. దాదాపు మూడు వందలమందిని హత్య చేశారు, పది హేను వేల మందిని హత్య చేసారు. ఈ బీభత్సకాండకు సంబంధించిన నేరస్థులలో అత్యధికులకు ఇదివరకే శిక్షలు అమలుజరిగాయి. ఆ బీభత్స కాండతో సంబంధం లేదని ధ్రువపడినప్పటికీ, ముఠాతో పరిచయాలు ఉండిన నేరానికి నటుడు సంజయ్‌దత్ జైలు శిక్షను అనుభవించి విడుదల అయ్యాడు. కానీ దావూద్ మాత్రం చేసిన ఘోర పాపానికి ఫలితం అనుభవించకపోవడం ఘోరమైన న్యాయ వైపరీత్యం...పాకిస్తాన్ పట్టుబడింది! దావూద్ పట్టుబడేది ఎప్పుడు??