సంపాదకీయం

సేద తీరనున్న శరణార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పిఓకె- నుంచి జమ్మూకశ్మీర్‌లోకి పారిపోయి వచ్చిన శరణార్థుల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం రెండువేల కోట్ల రూపాయల పథకాన్ని రూపొందించిందట. 1947లో పాకిస్తాన్ మనదేశంపై దాడి చేసిన సందర్భంగా ప్రాణాలు కోల్పోకుండా బతికి బట్టకట్టిన వారు ఈ శరణార్థులు. 1948 తరువాత పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో మిగిలిఉన్న కశ్మీర్‌లో మూడు ప్రపధాన కేంద్రాలున్నా యి. మీర్‌పూర్ ప్రాంతం, ముజఫరాబాద్, ఉత్తరప్రదేశ్! ఉత్తరప్రాంతంలోను, ముజఫరాబాద్ ప్రాంతంలోను జిహాదీలు అత్యధిక సంఖ్యలో హత్యలను కొనసాగించారు. ఈ హత్యాకాండ నుండి తప్పించుకొని పారిపోయి జమ్మూ ప్రాంతానికి వచ్చి స్థిరపడి, దేశంలోని ఇతర ప్రాంతంలో కూడ వీరు జీవిస్తున్నారు. మీర్‌పూర్ ప్రాంతం నుండి లక్షకు పైగా శరణార్థులు జమ్మూ ప్రాంతానికి వచ్చేశారు. ఈ శరణార్థులందరూ జమ్మూకశ్మీర్‌లో ‘‘తృతీయశ్రేణి పౌరులవలె’’ అవమానకరమైన జీవన యాత్రను కొనసాగిస్తున్నారు. ఇలా పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్ నుండి నిర్మూలనకు గురై నిర్వాసితులైన శరణార్థులు ఇప్పటికైనా ప్రభుత్వాలకు గుర్తుకు రావడం ముదావహం. సమ గ్ర జమ్మూకశ్మీర్‌లో అనాదిగా నివసించిన ఈ భారతీయులు స్వదేశంలోనే శరణార్థులుగా జీవిస్తున్నారు. 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ మనదేశంపై దాడిచేసిన తరువాత జరిగిన పరిణామాలకు ఈ శరణార్థులు బలైపోయారు. జమ్మూకశ్మీర్‌లోని మూడవవంతు భూభాగం పాకిస్తాన్ అధీనంలోనే మిగిలిపోవడం ఈ నిర్వాసితుల కడగండ్లకు కార ణం. పాకిస్తాన్ అక్రమ ఆధీనంలోని కశ్మీర్‌లో జిహాదీల హత్యాకాండకు బలికాకుండా తప్పించుకొన్న ఈ అల్ప సంఖ్యాక హిందువులు ‘అధీన రేఖ-లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్‌ఓసీ-కి మన వైపున జమ్మూకశ్మీర్‌లోకి తరలిరావడం చరిత్ర. ప్రస్తుతం ము ప్పయి ఆరువేల మూడువందల నలబయి ఎనిమిది కుటుంబాల శరణార్థులను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం గుర్తించిందట. ఈ కుటుంబాల ఉపాధి కల్పనకోసం ప్రతి కుటుంబానికి ఐదున్నరలక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించనున్నదట. అయితే ఈ పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్ ప్రాంత శరణార్థులు కేవలం జమ్మూకశ్మీర్‌లో మాత్రమే లేరు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడ నివసిస్తున్నారు. అందరికీ పునరావాసం కల్పించడానికి దాదాపు తొమ్మివేల రెండువందల కోట్ల రూపాయలు కావాలన్నది వర్తమానపు అంచనా..
జమ్మూకశ్మీర్ ప్రజలలో అల్పసంఖ్యాకులైన హిందువులలో కొన్ని లక్షలమంది ఇలా శరణార్థులుగా మారడం జిహాదీ బీభత్సకాండతో ముడివడిన సమస్య. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉండి హిందువులు అల్పసంఖ్యాకులుగా మారిన చోటల్లా జిహాదీ ఉగ్రవాదులు మతోన్మాద సాయుధులు చెలరేగి అల్పసంఖ్యాకులను నిర్మూలించడం 1947 నుంచీ నడుస్తున్న వ్యథ. పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను నిర్మూలించిన రీతిలోనే జిహాదీలు పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో అల్పసంఖ్యాకులను నిర్మూలించారు. కశ్మీర్‌లోయ ప్రాంతం నుంచి కూడ హిందువులను, పండితులను, దశలవారీగా వెళ్లగొట్టడం జిహాదీలు జరిపిన ఘోరాలలో భాగం. ఇలా పాకిస్తాన్ దురాక్రమిత ప్రాంతం నుంచి నిర్వాసితులైన హిందువుల సంఖ్య ప్రస్తుతం మూడు లక్షలుగా ఉంది. కశ్మీర్‌లోయ ప్రాంతం నుంచి నిర్వాసితులైన పండితుల సంఖ్య ఐదులక్షల మందికి పైగానే ఉంది. కశ్మీరీ పండితులు జమ్మూలోను, ఢిల్లీలోను ఇతర ప్రాంతాలలోను జీవిస్తున్నారు. వీరు స్వదేశంలోనే శరణార్థులు. 370వ అధికరణం ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఈ ప్రతిపత్తిలో భాగంగా జమ్మూ కశ్మీర్‌కు మరో ప్రాంతీయ రాజ్యాంగ చట్టం ఏర్పడి ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు భారత రాజ్యాంగం ఒక్కటే ఉంది. జమ్మూ కశ్మీర్‌కు మాత్రం అదనంగా ప్రాంతీయ రాజ్యాంగం ఉండడం పాకిస్తాన్ దురాక్రమిత ప్రాంత నిర్వాసితుల కడగండ్లకు కారణం.
పీఓకే నుంచి హత్యకాకుండా తప్పించుకొని వచ్చిన ఈ వేలాది కుటుంబాలవారికి ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్ రాజ్యాంగం ప్రకారం శాశ్వత నివాసపు హోదా లభించనివారు భారతదేశపు పౌరులయినప్పటికీ జమ్మూకశ్మీర్ పౌరులుగా గుర్తింపు పొందడంలేదు. ఫలితంగా పాకిస్తాన్ దురాక్రమిత ప్రాంతం నుండి నిర్వాసితులైన ‘కశ్మీరీ’లు, కశ్మీర్ ప్రజలు కాకుండా పోయారు. వీరికి భారత పౌరసత్వం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వీరు అర్హులు. లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేయడానికి పోటీ చేయడానికి అర్హులు. కానీ వీరు శాసనసభ ఎన్నికలలోను, స్థానిక ఎన్నికలలోను వోట్లు వేయడానికి వీలులేదు. పోటీ చేయడానికి అర్హులు కారు. ఇతర ప్రాంతాల భారతీయుల వలెనే వీరుకూడ జమ్మూకశ్మీర్‌లో పౌరులుకాని పౌరులు. ఆస్తులు కొనడానికి భూమిని సంపాదించడానికి వీలులేదు. ఈ వైపరీత్యాన్ని జమ్మూకశ్మీర్‌లో ఎక్కువకాలం ప్రభుత్వం నిర్వహించిన షేక్ అబ్దుల్లా కుటుంబం వారు సృష్టించారు. షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లాల పరిపాలన కాలంలో పిఓకె శరణార్థులకు శాశ్వత నివాసపు హక్కు లభించలేదు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగంలోని ఆరవ అధికరణం శాశ్వత నివాసులను నిర్వచిస్తోంది.
1954 మే 14వ తేదీనాటికి జమ్మూ కశ్మీర్‌లో నివసిస్తున్న భారత పౌరులంతా శాశ్వత నివాసులు. పిఒకె శరణార్థులు 1954 నాటికి చాలా పూర్వమే 1947 లోను, 1948లోను జమ్మూ లో వచ్చి స్థిరపడినారు. అం దువల్ల వారి శాశ్వత నివాసపు హోదా సహజంగా లభించి ఉండాలి. దశాబ్దుల తరబడి లభించలేదు. అబ్దుల్లాల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ ప్రతిపత్తిని ఇవ్వలేదు. అంతేకాదు ఈ నిర్వాసితులు కశ్మీర్ లోయ ప్రాంతంలో స్థిరపడడానికి సైతం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు అనుమతి నివ్వలేదు. కానీ దశాబ్దుల తరబడి కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు సైతం ఈ శరణార్థులను వారికి సహజంగా లభించవలసిన హక్కులను పట్టించుకోలేదు. ఇదీ అసలు వైపరీత్యం.
కశ్మీరీ పండితులు పిఓకె నిర్వాసితులు తిరిగి తమ స్వస్థలాలకు స్వగృహాలకు వెళ్లి స్థిరపడడానికి వీలైన పరిస్థితులను కల్పించవలసిన కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు ఈ సంగతిని తప్ప మిగిలిన అన్ని పరిష్కారాలను కనుగొన్నారు. సైనిక దళాలపై రాళ్లు రువ్విన పాకిస్తాన్ తొత్తులను జైళ్లనుండి విడుదల చేయడానికి, జిహాదీ ఉగ్రవాదాన్ని విడనాడుతున్నట్టు ప్రకటించిన వారికి పురావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి 2004వ, 2014వ సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. పళనియప్పన్ చిదంబరం దేశ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో రూపొందిన అష్టసూత్ర ప్రణాళిలకలో నిర్వాసితుల ఉపాధిని కాక, మాజీ టెర్రరిస్టుల ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వడం బహిరంగ రహస్యం. ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం పిఓకె నిర్వాసితుల కడగండ్లను గుర్తించింది. పథకాలు అమలు చేయడం మాత్రమే కాక, ఈ నిర్వాసితులకు జమ్మూకశ్మీర్ శాశ్వత నివాసపు హక్కును కల్పించడం వల్ల మాత్రమే నిర్వాసితుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది..పిఒకెను తిరిగి స్వాధీనం చేసుకోవాలని మన పార్లమెంట్ ఉభయ సభలలోను 1994 ఫిబ్రవరి 22న తీర్మానం ఆమోదించారు. తీర్మానాలను అమలు జరపడం ప్రధానం...