ఉత్తరాయణం

ఎందుకీ బుజ్జగింపు చర్యలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలంగాణలో ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు యూనివర్సిటీ ప్రస్తుతం లేదు. అదేవిధంగా హైదరాబాద్‌లో ఉన్న తెలుగు అకాడమీ కూడా తెలంగాణకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది లేదు. ఇక ఉర్దూ అనేది జాతీయ భాష కాదు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో 90 శాతం మంది ప్రజలు మాట్లాడరు, లేదా అర్థం చేసుకోలేరు. కానీ ఆంధ్రుల భాష తెలుగు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు యూనివర్సిటీ, తెలుగు అకాడమీలు లేకుండా ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడమేంటి? అసలే అరకొర ఆదాయంతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ అంత అవసరమా? హిందీ మన జాతీయ భాష. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ కంటే హిందీ యూనివర్సిటీని నెలకొల్పితే సముచితంగా ఉంటుంది. తెలుగు దేశం పార్టీలో ‘తెలుగు’ పేరు ఉంది. అందువల్ల ప్రస్తుతం ఏపీలో హిందీ, తెలుగు యూనివర్సిటీలు, తెలుగు అకాడమీలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యావసరం. ఇప్పటికే మైనారిటీలను సంతోష పెట్టడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఉదాహరణకు 2013-14 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీకి కోటీ 14 లక్షల 58 వేల రూపాయలు కేటాయిస్తే, ఉర్దూ అకాడమీకి 18 కోట్ల 83 లక్షలు కేటాయించింది. అంతకు ముందు రెండేళ్లు కూడా ఇదే మాదిరి కేటాయింపు తేడాలున్నాయి. అదేవిధంగా 2013-14లో తెలుగు యూనివర్సిటీకి రూ.23 కోట్లు కేటాయించగా, ఉర్దూ యూనివర్సిటీకి రూ.97.87 కోట్లు కేటాయించారు.
నిజానికి ఉర్దూ పాకిస్తాన్ అధికార భాష. అంతే కాని భారత్, బంగ్లాదేశ్‌ల్లో కాదు. తెలుగు, ఇంగ్లీషు మీడియం గ్రాడ్యుయేట్లకే ఉద్యోగాలు లేక సతమతమవుతుంటే, ఉర్దూ మీడియం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు వస్తాయా? అప్పుడు కేవలం తాము మైనారిటీలం కాబట్టి తమకు ఉద్యోగాలు దొరకడం లేదని మైనారిటీలు ఫిర్యాదు చేస్తా రా? అందువల్ల రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి బుజ్జగింపు చర్యలు ఇక కట్టిపెట్టాలి. ఇటువంటి చర్యలు వివక్షా పూర్వమైనవి మాత్రమే కాదు, మెజారిటీ కమ్యూనిటీ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
- టి. హనుమాన్ చౌదరి, సికిందరాబాద్
ప్రమాదంలో హిందూమతం
నేడు హిందూ మతం ప్రమాదంలో పడింది. హిందూ మతం సనాతన ధర్మం. మొట్టమొదటి మతం హిందూ మతం. పద్దెనిమిది పురాణాలతో, రామాయణ, భారతాలలో హిందూ మతం విలసిల్లేది. హరికథ, బుర్రకథ, పురాణ పఠనం, కుంకుమార్చన... ఇవన్నీ ఒకప్పటి వైభవం. నేడు ఇవన్నీ లేవు. పూజ చెయ్యడం భారమని కొందరు భావిస్తుంటే, హిందూ మతాన్ని వదిలి వేరే మతాలు స్వీకరిస్తున్నవారు మరికొందరు. ఆదిశంకరులు భారతదేశమంతా పర్యటించి హిందూ మతాన్ని నిలబెట్టారు. కాని నేటి ‘స్వామీజీ’లు మతం పేరుతో భూకబ్జాలు, విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి హిం దూ ధర్మానికి చేటు తెస్తున్నారు. మరి కొందరు హిందువులే దేవతలను అవమానిస్తున్నారు. అర్ధంపర్ధం లేని సినిమాలు తీస్తూ హిందూ సంప్రదాయాన్ని నాశనం చేస్తున్నారు.
- వి.శకుంతల, విశాఖపట్నం
అమూల్యమైన అక్షరాలు
ఏ భాషకు సంబంధించిన అక్షరాలైనా తత్సంబంధిత భాషాప్రియులకు ప్రాణ సమానాలు. కొంతమంది భాషాప్రియులైతే అక్షరాలను ప్రాణం కంటే మిన్నగా భావిస్తారు. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న అక్షరాలు కాలక్రమంగా కనుమరుగవడం ఎంతవరకు సబబు?