సంపాదకీయం

ఉగ్ర గృహానికి వెళ్లాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌లో పాకిస్తాన్‌కు వెడుతున్నారా లేదా అన్న ప్రశ్నలు ప్రచారం అవుతుండడం మన విధానంలోని వైరుధ్యాలకు నిదర్శనం. ఆగస్టు ఆరవ తేదీన పాకిస్తాన్‌కు వెళ్లిన దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా అవమానించింది! దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సమాఖ్య- సార్క్-దేశాల దేశ వ్యవహారాల మంత్రుల సమావేశంలో రాజ్‌నాధ్‌సింగ్ చేసిన ప్రసంగాన్ని బయటికి పొక్కకుండా చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశాన్ని బుద్ధిపూర్వకంగా కవ్వించింది. రాజ్‌నాధ్ ప్రసంగం వినడానికి మాధ్యమాల ప్రతినిధులకు అనుమతి లభించలేదు. ఇలా దుర్బుద్ధితో అవమానించిన పాకిస్తాన్ ప్రభుత్వానికి నిరసన తెలుపడానికై రాజ్‌నాధ్‌సింగ్ అర్ధాంతరంగా పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చారు! ఆ తరువాత జరగవలసి ఉండిన సార్క్ ఆర్థిక మంత్రుల సమావేశానికి వెళ్లరాదని మన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నిర్ణయించారు. ఇదే పద్ధతిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడ పాకిస్తాన్‌కు వెళ్లడం లేదన్నది దేశ ప్రజలకు కలిగిన విశ్వాసం. కానీ పాకిస్తాన్‌లోని మన రాయబారి గౌతమ్ బంబావాలే ఇప్పటి సమాచారం ప్రకారం మా ప్రధానమంత్రి సార్క్ శిఖరాగ్ర సభలో పాల్గొనడానికై ఎదురు చూస్తున్నారు...అని కరాచీలో ప్రకటించాడట! పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ బీభత్సకాండను నిరోధించాలని ప్రధాని మోదీ చైనాలోని హాంగ్ ఝోవూలో జి-20 దేశాలకు పిలుపునిస్తుండిన సమయంలోనే ఈ బంబావాలే వాణిజ్య గోష్ఠులను నిర్వహించడానికై కరాచీకి వెళ్లడమే విచిత్రం! వెళ్లినవాడు వాణిజ్యవేత్తల సమావేశాలలో ప్రసంగించి ఇస్లామాబాద్‌కు తిరిగి రావలసి ఉండింది. కానీ ఆయన మాధ్యమాల ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ప్రారంభించాడట! అందువల్ల మోదీ పర్యటన గురించి నోరు జారి ఆ తరువాత నాలుక కరుచుకున్నాడు. ఆ తరువాత ప్రధాని స్థాయి వంటి ప్రముఖుల పర్యటనల గురిం చి ఇంత ముందుగా నిర్ణయాలు తీసుకోము అని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస స్వరూప్ స్పష్టీకరణ ఇచ్చాడట! ఈ స్పష్టీకరణ వల్ల వ్యవహారం స్పష్టం కాలేదు. మరింత గందరగోళం మాత్రమే నెలకొనడానికి వికాస స్వరూప్ ప్రకటన దోహదం చేస్తోంది. సగం పాత్ర నీటితో నిండి ఉంది...అని బంబావాలే చెప్పినట్టయింది. భవిష్యత్తులో మార్పులు జరగకపోతే నరేంద్ర మోదీ నవంబర్‌లో పాకిస్తాన్‌కు వెళ్లడం ఖాయమన్నది బంబావాలే ఉవాచ! అబ్బే ఆయన చెప్పింది తప్పు. సగం పాత్ర ఖాళీగా ఉంది! అని వికాస స్వరూప్ వివరించినట్టయింది! ఎందుకంటే నరేంద్ర మోదీ ఇప్పటి వరకు జరిగిన నిర్ణయం ప్రకారం, పాకిస్తాన్‌కు వెళ్లరు అని వికాస స్వరూప్ చెప్పి ఉండాలి...
ఇలా ఉభయ అధికారులు కూడ మోదీ నవంబర్‌లో పాకిస్తాన్‌కు వెడతారా వెళ్లరా అన్న విషయమై సమానమైన సందిగ్ధతను మాత్రమే ఆవిష్కరించారు! జిహాదీ బీభత్సకాండకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం జిహాదీలను ఉసిగొల్పడం మాననంత వరకు పాకిస్తాన్ ప్రభుత్వంతో ఎలాంటి దౌత్య, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోబోదన్నది దేశ ప్రజలకు కలిగిన విశ్వాసం. ఈ విశ్వాసానికి అనేక ప్రాతిపదికలు ఏర్పడి ఉన్నాయి. నరేంద్ర మోదీ గత రెండేళ్లకు పైగా అంతర్జాతీయ ద్వైపాక్షిక వేదికలపై పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తున్నారు. కొన్నిసార్లు పరోక్షంగాను మరికొన్నిసార్లు ప్రత్యక్షంగాను ఆయన పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న ఉగ్రమృగాలను నిరసించి ఉన్నారు. సెప్టెంబర్ నాలుగవ అయిదవ తేదీలలో హాంగ్‌ఝోవోలో జరిగిన జి-20 శిఖర సభలో సైతం మోదీ దక్షిణాసియాలో ఒకే ఒక్క దేశం బీభత్సకాండను పెంపొందిస్తోంది..అని స్పష్టం చేసి ఉన్నారు. ఆ ఒక్క దేశం పాకిస్తాన్ అన్నది జగమెరిగిన సత్యం. ఇలా బీభత్సకాండను నిరసిస్తున్న మన దేశానికి బీభత్సకారులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌తో చర్చలు ఏమిటి...? చర్చలు జరగవలసిందే, కానీ జిహాదీ ఉగ్రవాదాన్ని విడనాడుతున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం నిరూపించుకున్న తరువాత మాత్రమే మన ప్రభుత్వం చర్చలకు పూనుకోవాలి! విడనాడనంత వరకు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సైనిక చర్యలను, దౌత్య చర్యను, వ్యూహాత్మక చర్యలను మాత్రమే మన ప్రభుత్వం తీసుకోవాలి....
ఇలా తీసుకోగలదన్న విశ్వాసాన్ని మన ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో దేశ ప్రజలకు కలిగించింది. బర్మాలో నక్కి ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మన సైనిక దళాలు వైమానిక దళాలు దాడులు జరిపాయి. ఇలా ఉగ్రవాదులను తుదముట్టించడానికై పొరుగు దేశాలలోకి, ఇతర శత్రుదేశాలలోకి చొచ్చుకునిపోయే వ్యూహం-హాట్ పర్సూట్ వల్ల మాత్రమే బీభత్సకాండ అణగారిపోతుందన్నది ప్రపంచంలోని అనేక దేశాలు నిరూపించిన సత్యం! బర్మాలో నక్కి ఉండిన ఉగ్రవాదులు చైనా ప్రభుత్వ ప్రేరితులు..పదే పదే మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాలలోకి చొరబడుతున్న ఈ ఉగ్రవాదులు అనేకమంది సైనికులను, పౌరులను హత్య చేయించడం చరిత్ర! హాట్ పర్సూట్‌కు మన ప్రభుత్వం పూనుకున్న తరువాతనే గత ఏడాదికి పైగా ఈశాన్యంలో దేశ విద్రోహుల హింసాకాండ తగ్గుముఖం పట్టింది. హాట్ పర్సూట్ తరువాతనే మన ఈశాన్య ప్రాంతంలో ఉగ్రహత్యలకు పాల్పడుతున్న బీభత్సకారులతో తమకు సంబంధం లేదని చైనా ప్రభుత్వం స్పష్టీకరించింది. ఇతర దేశాలలో నక్కి ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై సైతం మన ప్రభుత్వం హాట్ పర్సూట్ వ్యూహాన్ని సంధించగలదన్న భావం దేశ విదేశాలలో అప్పుడు ప్రచారమైంది, మోదీ ప్రభుత్వం పట్ల విదేశాలలో గౌరవం పెరిగింది. ఆ నేపథ్యంలో, మేము బర్మా ప్రభుత్వం కాదు, మా దేశంలోకి చొరబడే దుస్సాహసానికి పూనుకోకండి..అని పాకిస్తాన్ ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అంతేకానీ తమకు జిహాదీ ఉగ్రమృగాలతో సంబంధం లేదని మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టీకరించలేదు...
ఇలాంటి బీభత్స రాజ్యాంగ వ్యవస్థ నెలకొన్న పాకిస్తాన్‌లోకి మన ప్రభుత్వ అధినేతలు ఎందుకు వెళ్లాలి? వెళ్లినందువల్ల మనం అంతర్జాతీయ సమాజం దృష్టిలో తాలిక లేని తేలిక ప్రభుత్వంగా నిలబడుతున్నాము. కందకు లేని దురద కత్తిపీటకు మాత్రమే కాదు అసంఖ్యాక ఇతర శాకాలకు సైతం ఉండదు..పాకిస్తాన్‌ను విమర్శిస్తున్న మన ప్రధాని మన ప్రతినిధులు విదేశాలను పాకిస్తాన్ ఉగ్రదేశమేనని ఒప్పించగలగాలి. అందుకు మొదట పాకిస్తాన్ ఉగ్రదేశమనీ మనం ప్రకటించాలి! అలాంటి ఉగ్రదేశంతో మనకు చర్చలేమిటి? ఆ దేశానికి వెళ్లి మన నేతలు విందులు కుడిచి రావడంవల్ల, పాకిస్తాన్ నేతలకు ఇక్కడ ఆతిథ్యాలను ఇవ్వడంవల్ల మన మాటలను ఇతర దేశాల వారు పట్టించుకోరు. దశాబ్దులుగా బాహాటంగా సార్క్ దేశాలు కాని, ఇతర దేశాలు కాని పాకిస్తాన్ నిర్వహిస్తున్న భారత వ్యతిరేక బీభత్సకాండను దుయ్యబట్టకపోవడానికి మన విధానం మాటిమాటికీ మారడమే కారణం. ఉగ్రవాదానికి బలి అవుతున్న మనం ఒకవైపున పాకిస్తాన్ నాయకులతో కరచాలనాలు చేస్తున్నప్పుడు ఇతరులు ఎందుకు చేయరు...??