సబ్ ఫీచర్

తరగతి గది క్రమశిక్షణా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవాళ నేను 10 నిమిషాలు ఆలస్యంగా లేచాను. నేను వాకింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది నాకు ఉమెన్స్ కాలేజీ దగ్గర కనబడేవారు. మరికొందరు విసి లాడ్జి దగ్గర కనబడేవారు. ఇంకొందరు మంది ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర తారసపడేవారు. ఇవాళ వారెవ్వరూ కనపడలేదు. నేను ప్రశ్నించుకున్నాను. 10 నిమిషాలు ఆలస్యం చేయటంవలన నాకు వీరందరు కనపడలేదు కదా! ప్రపంచమంతా ఒక క్రమంగా పనిచేస్తుంటే నేను క్రమంతప్పితే క్రమశిక్షణ లేని మనిషినే అంటారు. ప్రకృతి అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో కొనసాగుతుంది. మనకోసమై ప్రకృతి తన క్రమాన్ని మార్చుకోదు. క్రమం లేనివాడు అవకాశాలు పోగొట్టుకుంటాడు.
చదువుకునే కాలంలో చదువుకోవాలి. ఆ కాలాన్ని వృధాచేస్తే భవిష్యత్తులో వచ్చే అవకాశాలు పోతాయి. యవ్వనంలో చేసేపనులు యవ్వనంలో చేయాలి. సూర్యుణ్ణి చూసన్నా నేర్చుకోవాలి. ప్రకృతి ఒక క్రమంగా తన కార్తెలను మార్చుకుంది. ప్రకృతిలో క్రమం తప్పటం వల్లనే వూహించని పరిణామాలు వస్తున్నాయి. మనం ఎన్నో ప్రయోగాలు చేసి ప్రకృతిలోపల కార్బన్‌మోనాక్సైడ్‌ను నింపుతున్నాం. దానివలన ప్రకృతి, భూమండలం మనిషికి నివాసయోగ్యం కాకుండాపోతున్నది. తీరా ఈనాడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత భూమండలం వదిలిపోవాల్సిన పరిస్థితి వస్తుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. తరగతికి ఆలస్యంగా వస్తే ఆ విద్యార్థికి మాత్రమే నష్టంకాదు. మొత్తం తరగతికే నష్టం. ఆలస్యంగా రావడం వల్ల తరగతిలో జరుగుతున్న చర్చను ఫాలో కాలేడు. ఆలస్యంగా రావటంవల్ల ప్రశ్నలు అడుగుతాడు. మిగతా పిల్లలంతా విసుక్కుంటారు. క్రమం తప్పిన మనిషి తరగతి క్రమాన్ని కూడా తప్పిస్తాడు. క్రమం తప్పిన శాస్తవ్రేత్త కూడా భూమండలాన్ని, ప్రకృతిని విషపూరితం చేస్తాడు. పేదవానికి నివాసయోగ్యం కాకుండా చేస్తాడు. అందువల్లే వాతావరణం మారుతున్నది. కార్తెలు మారుతున్నాయి. వూహించిన దానికన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్‌లో వున్న డ్రైనేజీ 30 సెంటీమీటర్లకన్నా అధిక వర్షపాతాన్ని భరించలేదు.
క్రమం లేని వ్యక్తి మొత్తం తరగతి గదినే గందరగోళ పరిచినట్లే క్రమం లేని పెట్టుబడిదారి వ్యవస్థ ప్రపంచంయొక్క వాతావరణాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఇవాళ అమెరికావల్ల 85 శాతం కార్బన్ మోనోక్సైడ్ వాతావరణంలో కలిసిపోతూ వస్తుంది. 15 శాతం ప్రజల లాభంకోసమై 85 శాతం ప్రజల జీవనాన్ని భంగం చేయటం క్రమశిక్షణా రాహిత్యం కాదా? వాతావరణంలో మార్పురావటం పెట్టుబడిదారి వ్యవస్థ క్రమశిక్షణా రాహిత్యమే కదా! ప్రపంచం అంతా ఒక గ్రామంగా మారిపోయింది. కానీ గ్రామంలో ఉండే క్రమశిక్షణ మాత్రం ప్రపంచం నేర్చుకోలేదు. టెక్నాలజీ పెరిగినకొద్ది సామాజిక పరిశోధనలు కూడా పెరిగితే మానవత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లోపల సాంకేతికమైన పరిశోధనలు ఎట్లా జరుగుతున్నాయో సామాజిక శాస్త్రాల్లో అదే మోతాదులో పరిశోధనలు జరుగకపోవటమే ఈ అమానుషాలకు కారణం. టెక్నాలజీకి సోషియాలజికి (సామాజిక శాస్త్రాలకు) సరైన బ్యాలెన్స్ ఉంటేనే మానవ కళ్యాణం జరుగుతుంది. ప్రస్తుతం ఆ సమతుల్యం ఉండటం లేదు. అందువల్లనే ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ రకాల ఉపద్రవాలను ఎదుర్కొంటున్నాయ. అన్నీ తెలిసి చేస్తున్న తప్పిదాలు మానవ మనుగడను ప్రశ్నిస్తున్నాయ. మనుగడ దెబ్బతింటున్నప్పటికీ మానవుల్లో మార్పు కానరావడంలేదు. ప్రకృతికి, మానవుడికి మధ్య అద్భుతమైన సంబంధం మనకు గ్రామాల్లోనే కనిపిస్తుంది. వివిధ జీవరాసుల జీవనం కూడా ప్రకృతికి అనుగుణంగానే కొనసాగుతుంది. దురదృష్టవశాత్తు ప్రస్తుతం పట్టణాల్లో ఆ సంబంధం దెబ్బతిని మొత్తం వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతోంది.

- చుక్కా రామయ్య