సబ్ ఫీచర్

గ్రామ పంచాయతీల్లో అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్మాగాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ స్థాయిలో గ్రామానికి ప్రథమ పౌరుడు అను చెప్పుతుంటాము కదా. నేడు ఏ గ్రామంలో చూసినా ఏ మండలంలో చూసినా ఏ జిల్లాలో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా సర్పంచ్‌లలో 80% మంది అవినీతికి పాల్పడుతూ వుంటే అధికార యంత్రాంగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఎక్కడవేసిన గొంగడి అక్కడనే అనే చదంగా వ్యవహరిస్తున్నారు.
ఇదేనా గ్రామ స్వరాజ్యం అంటే? ఎన్నికల సమయంలో నేను నిస్వార్ధంతో పనిచేస్తా గ్రామాన్ని అన్ని హంగులతో అభివృద్ధిపరుస్తా అని సర్పంచ్ అభ్యర్థులు చెబుతూ ఉంటారు. మరో సమస్య ఏమిటంటే వార్డు మెంబర్లు, ఎన్నికలలో ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తా మం టారు. గెలిచిన తరువాత ఆ వార్డులను మర్చిపోతారు. గ్రామ సర్పంచ్ ఏమి చేస్తున్నాడో కూడా వార్డు మెంబర్లకు తెలినే తెలియదు. గ్రామస్థాయి సర్పంచ్‌కు ఇష్టం వచ్చిన రీతిలో తీర్మానాలు వ్రాసుకోవడం వార్డు మెంబర్ల సంతకాలు లేకుండానే అందరిని హాజరు అని వ్రాసుకోవడం జరుగుతుంటుది. ప్రతి గ్రామానికి వచ్చే నిధులు ప్రతి వార్డు మెంబర్లకు తెలియచేయడం లేదు. గ్రామ సర్పంచ్‌లు ఎవరికి వారే యమునా తీరో అవినీతికి పాల్పడుతూ అధికార్లకు తెలియని పనులకు చేసినట్లుగా రికార్డులు తయారుచేయడం జరుగుతున్నది. అదే రికార్డును ఆడిటర్ ఆడిట్ చేసి వెళ్లడం షరామామూలై పోయంది. కనీసం ఆడిటరైనా ఆడిట్ చేసే ముందు వార్డు మెంబర్లకు తెలియజేసి అందరి సమక్షంలో ఆడిట్ చేయాలి. ఏవార్డులో పనులు చేపట్టినా వార్డు మెంబరుకు తెలియపరచాలి. అతనికి తెలియకుం డా ఏ పనులు చేపట్టరాదు. అభివృద్ధి నిధులు ఏవి అయినా, వార్డు మెంబర్ల సమక్షంలోనే పనులు ప్రతిపాదించాలి. తర్వాతనే పనులు ప్రారంభించాలి. ప్రతి పైసాకు లెక్కలు రాయాలి.
గ్రామ సర్పంచ్‌లు ఇష్టం వచ్చే రీతిలో వార్డు మెంబర్లకు తెలియకుండానే పనులు చేయడం బిల్లులు తీసుకోవడం సాధారణమైపోయంది. ప్రతి మీటింగ్‌లో అయినా గ్రామానికి వచ్చిన నిధులు లెక్క చెప్పకుండానే ఏదో ఒక సమస్యను సర్పంచ్‌లు లేవనెత్తడం గ్రామ సభ గందరగోళంగా జరగడం షరా మామూలైంది. లెక్కలు చెప్పడం లేదు. అంటే అందులో ఏముంది. ఆ పనీ ఈ పనీ చేసినా అని చెప్పడం తప్ప సక్రమంగా జవాబు ఇచ్చిన సందర్భాలు లేవు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వార్డు మెంబర్లకు విలువ లేనప్పుడు వార్డు మెంబర్ల వ్యవస్థను రద్దుచేయాలి. లేదా వార్డుమెంబర్లకు అభివృద్ధి నిధులపై అజమాయిషీ కల్పించే విధంగా చట్టం చేయాలి. ప్రతి సర్పంచ్ తన స్వంత ఖాతా లెక్కలు చూసుకోవడం తప్ప అభివృద్ధి కోసం కృషిచేసిన సందర్భాలు లేవు. సర్పంచ్ కాకముందు చాలా పద్ధతిగా ఉన్నట్టు నమ్మిస్తారు. తాము ఎన్నికైతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ నమ్మబలుకుతారు. నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇక ఆవూసే ఉండదు. బినామీ పేర్ల మీద అక్రమంగా సంపాదించిన సొమ్మును కూడపెట్టుకోవడం విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం మొదల వుతుంది. గెలిచిన తర్వాత లక్షల విలువ కలిగిన ఇండ్లను కట్టుకొంటారు.
పంచాయతీల అభివృద్ధికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను సక్రమంగా ఖర్చు చేయరు. సగం నిధులు సర్పంచ్‌ల సొంత ఖర్చులకు మరో సగం అభివృద్ధికి ఖర్చుచేస్తూ ఉంటారు. అయతే ఇది అందరి విషయంలో నిజం కాదు. కొందరు నిజాయతీగా గ్రామాలను అభివృద్ధి చేస్తారు. ఎన్ని నిధులు వచ్చినా ప్రతి పైసా లెక్క పోకుండా అభివృద్ధి పనులు చేస్తారు. ప్రతి పనిని అందరు వార్డు మెంబర్ల సహాయంతో చేపడతారు. అటువంటి సర్పంచ్‌లే చరిత్రపుటలకెక్కుతారు.

- జాడి ముఖర్జీ