మెయన్ ఫీచర్

సింగూరు తీర్పుపై సిపిఎం సాకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగూరు రైతులనుంచి ‘‘్భములు సేకరించిన పద్ధతిని’’ తప్పుపడుతూ సు ప్రీంకోర్టు ఆగస్టు చివరి రోజున ఇచ్చి న తీర్పును సరిగా అర్థం చేసుకోవడానకి బదులు సిపిఎం నాయకత్వం, తన చర్యలను సమర్థించుకునేందుకు సాకులను వెతుకుతున్నది. 2006లో సిపిఎం ప్రభుత్వం టాటాకార్ల పరిశ్రమకోసం 997 ఎకరాలను సేకరించడం తెలిసిం దే. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి భూసేకరణ తప్పదన్నది సిపిఎం వాదన. కాని అందుకోసం తమ వ్యవసాయ భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించనందున ప్రభుత్వం ‘‘బలవంతంగా’’ అనదగ్గ పద్ధతులలో భూమిని సేకరించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు పారిశ్రామికాభివృద్ధి అవసరమేనని ఏకీభవించింది. కాని అందుకు భూసేకరణ కోసం అనుసరించిన పద్ధతులను మాత్రం తప్పుపట్టింది. ఆ చర్యను కొట్టివేసి, భూములను రైతులకు తిరిగి ఇవ్వవలసిందిగా ఆదేశించింది.
తీర్పు దరిమిలా ఒకస్థాయిలో రాజకీయ చర్చను కావాలంటే చేయవచ్చు. కానీ అది తక్కువ ఎక్కువ అవసరం లేదేమో. ఎందుకంటే, సింగూరు-నందిగ్రాం భూసేకరణల పద్ధతులతో ఆగ్రహించిన ఆ రెండు ప్రాంతాల ప్రజలతో పాటు మొత్తం బెంగాల్, అప్పటినుంచి మొదలుకొని సిపిఎం పైన, మొత్తం వామపక్ష కూటమిపైన తన తీర్పులు వరుసగా చెబుతూ వస్తున్నది. సింగూరు-నందిగ్రాం ఉదంతాలు 2006-08 కాలానివి కాగా, అధికార కూటమి పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అ సెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, తిరిగి స్థా నిక సంస్థల ఎన్నికలు, మళ్లీ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా ఓడిపోతూ వచ్చింది. 2008 నుండి మొదలుకొని గత ఆరు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క ఎన్నికలలోనైనా వారు గెలవలేదు. బహుశా అంతకన్న ప్రమాదకరంగా వారి కార్యకర్తలు, నాయకులు వామపక్షాలను, ముఖ్యంగా సిపిఎంను వదలి ఇతర పార్టీలలోకి వెళుతున్నా రు. కొత్తగా వస్తున్నవారు లేరు. ఓట్ల శాతాలు ప డిపోతున్నాయి. ప్రథమ స్థానంలో ఉండిన సిపి ఎం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మూడవ స్థానానికి పతనమైంది. చాలాకాలంపాటు తమకు పెట్టనికోటగా ఉండిన మేథావులు, రచయితలు, కళాకారులలో చాలామంది దూరమయ్యారు. దేశవ్యాప్తంగా పతిష్ట సైతం దెబ్బతిన్నది. దేశంలోని ఇతర పార్టీలు తమకు ఒకప్పటివలె విలువ ఇవ్వడంలేదు. తమతో పొత్తులు కుదుర్చుకునే ఆసక్తి చూపుతున్న వారు ఒక్కరూ కనిపించడంలేదు. ఈవిధంగా పలు రూపాలలో రాజకీయ చర్చలు, తీర్పుల తర్వాత ఇప్పుడు సింగూరుపై సుప్రీంకోర్టు తీర్పును బట్టి మరోసారి రాజకీయ చర్చ అవసరంలేదు.
అదేసమయంలో చర్చించదగిన ఇతర అం శాలు కొన్నున్నాయి. సుప్రీం తీర్పుపై వారి ప్రత్యర్థి అయిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖలు ఏమిటన్నది వదలివేద్దాం. కాని స్వయంగా సిపిఎం, సిపిఐ స్పందనలు ఏమిటో చూడవలసి ఉంది. భూసేకరణలు వారివి, అం దువల్ల రాజకీయంగా నష్టపోయింది వారు, ఇప్పుడు కోర్టు తీర్పు వెలువడింది తమ చర్యలను గురించి అయినందున వారి స్పందనలు ఏమిటన్నది గమనించడం అవసరం. తీర్పు వెలువడిన రోజున సిపిఎం బెంగాల్ కార్యదర్శి సూర్యకాంత మిశ్రా మాట్లాడుతూ, తాము చేసి న దానికి క్షమాపణలు చెప్పే ప్రసక్తేలేదన్నారు. పారిశ్రామికాభివృద్ధికి భూసేకరణ అవసరమని, ఆ పని తాము చట్టప్రకారం చేసామని, అమలులో గలది 1894 నాటి (బ్రిటిష్ వారు చేసిం ది) భూసేకరణ చట్టం అయినందున దానిని అనుసరించామని అన్నారాయన. ఆయన సెప్టెంబర్ నాలుగున ఇదే విషయమై తిరిగి మాట్లాడుతూ భూసేకరణను గట్టిగా సమర్థించుకున్నారు. వ్యవసాయరంగంపై ఉపాధి వత్తిడి తగ్గించేందుకు పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించవలసి ఉంటుందని అన్నారాయన. అయితే, ఈపనిచేయడంలో రైతుల ప్రయోజనాలను కాపాడాలని ఒప్పుకుంటూ, భూసేకరణ క్రమంలో తప్పులు జరిగాయని అంగీకరించారు. అంతవరకు ఆయనను ప్రశంసించాలి.
సూర్యకాంత మిశ్రా వ్యాఖ్యలకు మధ్యన సెప్టెంబర్ రెండవ తేదీన సిపిఎం పాలిట్ బ్యూరో ఢిల్లీలో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. తమ తప్పును సమర్థించుకునేందుకు 1894 నాటి భూసేకరణ చట్టాన్ని అడ్డు తెచ్చుకోవడంలో కేంద్ర సిపిఎం నాయకత్వం మరొక అడుగు ముందుకు వెళ్లింది. రైతు ప్రయోజనాల పరిరక్షణకు ఆ చట్టంలోనే తగిన నిబంధనలు లేవని, తాము భూసేకరణ జరపాలంటే ఆ చట్టాన్ని అనుసరించక గత్యంతరం లేదని, కనుక ఆ చట్టం ప్రకారం సింగూరులో భూసేకరణ జరిపాము కనుక రైతులకు ఆ పరిస్థితి ఎదురైందనే అర్థంలో వివరణ ఇచ్చారు వారు. అనగా ‘‘నేరం నాదికాదు, చట్టానిది’’ అనడమన్నమాట. అదికూడా తాము తరచు నిందించే బ్రటిష్ వలస చట్టాలది. భూసేకరణ జరిపేనాటికి తాము బెంగాల్‌లో వరుసగా 30 సంవత్సరాల పాటు (1977-2007) అధికారంలో ఉన్నా రు. కాని తమ మార్క్సిస్టు పద్ధతిలో సమాంతర భూసేకరణ మార్గాలేవీ రూపొందించుకోలేదు. నిజానికి సింగూరు, నందిగ్రాం బాగా వార్తలకు ఎక్కాయిగాని, అంతకన్న ముందుకూడ వారు రైతులనుంచి బలవంతంగా భూసేకరణలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ వివరాలలోకి మనం పోవడం లేదక్కడ.
అయితే పాలిట్ బ్యూరో ఒక తెలివైన తర్కా న్ని ముందుకు తెచ్చింది. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తగిన నిబంధనలు లేని 1894 నాటి చట్టాన్ని రద్దు చేయాలని తామెప్పటినుంచో వాదిస్తున్నామని, ఆవిధంగానే 2013నాటి కొత్త పరిహార చట్టం వచ్చిందని అంటున్నారు. ఈ కొత్త చట్టాన్ని ఉల్లంఘించేందుకు ప్రస్తుత నరేంద్రమోదీ ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. ఇందుకు వారిని అభినందించాలి. కాని అదే సమయంలో వారు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంది. 1894 నాటి చట్టంలో రైతు ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన నిబంధనలు లేవని అప్పుడే గుర్తించినట్లయితే, ఆ చట్టానికి అతిరిక్తంగా సింగూరు రైతులకు ఇవ్వజూపిన అదనపు పరిహారాలు ఏమి టి? బ్రటిష్ వారి అవసరాల మేర లోపభూయిష్టమైన చట్టం తయారై ఉంటే, దాన్ని సింగూరు రైతులపై బలవంతంగా రుద్దవలసిన అవసరం ఏమున్నది? సింగూరు, నందిగ్రాంలలో వారి పార్టీ కార్యకర్తలు సైతం సాయుధులై వెళ్లి హింసాకాండలు, మహిళలపై అత్యాచారాలు సాగించింది బ్రిటిష్ చట్టం ఉపేక్షించిన ప్రయోజనాలను రైతులకు కలిగించేదుకోసమా? ఆ రెండు సందర్భాలు దేశవ్యాప్తంగా సంచలనమైన తర్వాత తాము తదుపరి అసెంబ్లీ ఎన్నికలలో (2011) ఓడిపోయేలోగా దిద్దుకున్న తప్పులేంటి? ఈ ప్రశ్నలలో దేనికి సమాధానం కూడా సిపిఎం, వామపక్ష కూటమికి అనుకూలంగా తేలేది కాదు. ఇనే్నళ్లలో వారు కనీసం సింగూరు, నందిగ్రామ్ రైతులకు క్షమాపణ అయినా చెప్పినట్టు లేదు. పైగా ఇప్పుడు సూర్యకాంత మిశ్రా, తాము క్షమాపణ చెప్పవలసిందేమీ లేదని బాహాటంగా ప్రకటిస్తున్నారు. పాలిట్ బ్యూరో కూడా పనికిరాని సాకులు వెతికింది తప్ప క్షమాపణలు చెప్పే సంస్కారాన్ని, సహృదయతను చూపలేదు. వారికి మార్క్సిస్టు మానవత్వం కాదుకదా బూర్జువా మానవత్వం అయినా లేకపోయింది. ప్రజాస్వామిక లక్షణాలు సిపిఎం కన్నా కొంత మెరుగని భావించే సిపిఐ స్పందన కూడా సారాంశంలో ఇంతకన్న భిన్నంగా లేకపోయింది. ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌ల ప్రకటనలు మన దృష్టికి రాలేదు.
బెంగాల్‌లో అధికారం నెరపింది లెఫ్ట్‌ఫ్రంట్ అయినా, నిజమైన ఆధిపత్యం సిపిఎంది అన్నది తెలిసిందే. ఆ పార్టీ ‘‘ఒక పెద్దన్న’’ వలె ప్రవర్తిందనే విమర్శ ఆ ఫ్రంట్‌లోని ఇతర వామపక్షాలు స్వయంగా చేసేదే. అదే పద్ధతిలో సింగూరు, నందిగ్రాం అకృత్యాలు వాస్తవానికి సిపిఎం చేసినటువంటివే. ఈ మాట అంటున్నది వారిని మరొకమారు నిందించేందుకు కాదు. కాని వారు మొత్తం దేశంలోనే అందరికి మించిన మార్క్సిస్టు నిష్టాగరిష్టులమని చెప్పుకుంటూ ఇటువంటి చర్యలకు ఎందువల్ల పాల్పడ్డారన్నది మనకు అర్థం కావలసిన విషయం. బెంగాల్‌ను 1977 నుంచి పాలించిన ఆ పార్టీ తొలినాళ్లలో వ్యవసాయం, రైతులు, కార్మికుల కోసం కొంత మంచి చేసిన మాటనిజం. కాని పారిశ్రామికాభివృద్ధి, ఉపాధికల్పన, పట్టణాభివృద్ధి, విద్య, వైద్యం వంటివి ముందుకు సాగలేదు. నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ స్తంభించడం మొదలైంది. దాంతో ఇదేకాలంలో గ్రామాల్లో, పట్టణాలలో అశాంతివల్ల, నక్సలైట్ ఉద్యమం పెచ్చరిల్లింది. ఆ పరిస్థితులలో పెట్టుబడులు, పరిశ్రమలు తరలిపోతుండటంతో భయపడిన సిపిఎం ప్రభు త్వం తన విధానాలనుంచి పక్కకు తొలగి ప్రైవే టు పెట్టుదారులతో సంయుక్త రంగంలో హాల్ది యా పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను నిర్మించింది. అప్పటినుంచి చరిత్ర కొత్తమలుపు తిరిగింది. ఒకవిధంగా సిపిఎం పతనానికి బీజాలు కూడా అప్పుడు పడ్డాయి. ఇది 1980ల నాటి మాట.
సిపిఎం కేంద్ర కమిటీ 1990లో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తూ సోషలిజం నిర్మాణంలో మార్కెట్‌కు కూడా పాత్ర ఉంటుందన్నది. తర్వా త రెండేళ్లకు 1992లో జరిగిన 14వ కాంగ్రెస్‌లో, సోషలిస్టు పరివర్తన కాలంలో మార్కెట్ అవసరమని ప్రకటిస్తూ తీర్మానించింది. సరిగ్గా ఈ దశలోనే ఒకవైపు సోవియెట్ యూనియన్ పతనం కాగా, చైనాలో మార్కెట్ ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు వచ్చింది. సోషలిజమన్నది అంతర్జాతీయంగా అయోమయంలో పడింది. ఇక్కడ బెంగాల్ ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టంభన గురించి పైనే చెప్పుకున్నాము. సిపిఎం మార్కెట్ ఎకానమీ తీర్మానాలకు ఈ నేపథ్యమంతా ఉంది. ఇదే క్రమంలో బెంగాల్ ప్రభుత్వంపై ఆధిపత్యం సాగిస్తుండిన సిపిఎం, 1994లో కొత్త పారిశ్రామిక విధానాన్ని తెచ్చింది. ఆ విషయం లెఫ్ట్ ఫ్రంట్‌లో గాని, ఫ్రంట్‌లోని ఇతర పార్టీల మం త్రులతోగాని, చివరకు సిపిఎం రాష్ట్ర కమిటీలోగాని చర్చించకపోవడం కొత్త మలుపు. ఆవిధంగా పదేళ్లు గడిచేసరికి ప్రైవేటు వారికి పూర్తి గా గేట్లు తెరవడంగా మారింది.
ఇక్కడ సోషలిజం, ప్రైవేటు పెట్టుబడుల మంచి చెడ్డల గురించి చర్చించడంలేదు. కాని రెండింటి మధ్య అంతర్జాతీయ సోషలిస్టు వ్యవస్థల వలెనే ఇక్కడ సిపిఎం కూడా విఫలమైంది. ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించి చైనావలెనే క్యాపిటలిజాన్ని మేనేజ్ చేయగలమనుకున్నారు. కాని అంతటి సమర్థత వీరికి లేదు కనుక క్రమంగా క్యాపిటలిజమే వారిని మేనేజ్ చేయసాగింది. ఇటువంటి క్రమం ఒకసారి మొదలవుతే దాని డైనమిక్స్ దానికి ఏర్పడుతాయి. మొసలినోట చిక్కిన ఏనుగును, కాపాడే విష్ణుమూర్తి ఎవరూ లేరు. ఈ కొత్త ఆర్థిక మార్పులలో భూసేకరణను, ‘‘ఏదో ఒక పద్ధతిలో’’ చేసి ప్రైవేటు పరిశ్రమలకు అప్పగించక తప్పదు. సింగూరులో టాటాలు, నందిగ్రామ్‌లో ఇండోనేషియన్లు ఎవరైనా కావచ్చు. ఈసరికి సిపిఎం ఆ ఊబిలో పూర్తిగా కూరుకుపోయింది. కనుకనే, ఇటువంటి ఉదంతాలు జరుగుతున్నా జ్యోతిబసు వంటి వాడు 2008లో జరిగిన ఆ పార్టీ బెంగాల్ శాఖ సమావేశంలో‘‘సోషలిజం ఇప్పుడు సాధ్యంకాద’’ని ప్రకటించారు.
మార్గాంతరమేమిటో సిపిఎం నాయకత్వానికి ఆ తర్వాత ఎనిమిదేళ్లలోను బోధపడలేదు. అటువంటి స్థితిలో సింగూరుపై సుప్రీంకోర్టు తీర్పునకు వారి స్పందనలు ఇంతకన్నా భిన్నం గా ఉండగల అవకాశం లేనేలేదు. చరిత్ర సుడిగుండంలో చిక్కుకొని సిద్ధాంతపు పడవనుంచి బయటికి కూడా పడిపోయిన వారిని ఏమని లాభం ఏమిటి?

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)