సబ్ ఫీచర్

ఆరోగ్యానికి ‘యోగ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుఖమైన జీవనానికి పునాది ‘యోగ’. యోగ అనేది ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు. కొంతమంది ఈ ‘యోగ’ను సాధన చేయలేమని అపోహపడి చేయాలనే ఆసక్తివున్నా ‘శక్తి’చాలదని భయపడి దాని జోలికి వెళ్ళరు. కానీ యోగతో ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చునన్న నిజాన్ని గ్రహించరు. ఆసనాలువేయడం ఎంతో కష్టం అని అనుకుంటారు, సాధన చేయడానికి ఆసక్తి చూపరు. దీని విలువ తెలిసి ‘యోగా’ అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిందని తెలుసుకోలేకపోవడం గుర్తించకపోవడం శోచనీయం. మోదీ యోగాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళారు. గత యేడాదినుంచి ఈ యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకొంటున్నాం.
ఈ యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. శశంకాసనం ఉత్తాన మండుకాసనం, కపాలభాతి ప్రాణాయామం. బ్రామరీ ప్రాణాయామం, నాడీ శోధనప్రాణా, వృక్షాసనం వక్రాసనం, తాడాసనం, పాద హస్తాసనం, ఉష్ట్రాసనం, ఉత్తాన సదాసనం, అర్ధచక్రాసనం. త్రికోణాసనం శలభాసనం, సేతుసంధాసనం. ఇలా ఎన్నోరకాలైన ఆసనాలు వున్నాయి. ప్రతీ ఆసనంలోనూ ఎంతోకొంత ఆరోగ్యం దాగివుంటుంది. వాటిని సరైన క్రమంలో చేయగల్గితే ఆయుష్యును పెంచుకొని ఆరోగ్యాన్ని పొందవచ్చు. రక్తప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండాలంటే శశాంక ఆసనాన్ని అవలంభిస్తే సరి. అంతేకాదు నిద్రలేమి తగ్గి, బరువుతగ్గాలంటే ఉత్తాసమండాకాసనం చేస్తే తిరుగుండదు. స్థూలకాయం, మధుమేహం ఉన్నవారు ప్రాణాయామం అనే ఆసనాన్ని చేయకూడదు. ఆసనాల్లో ఎన్నో రకాలున్నాయి. తాడాసనం వేయడంవల్ల నరాల్లో పటుత్వం లభిస్తుంది. ఊపిరితిత్తులకూ వ్యాయామం లభిస్తుంది. శరీరంలోని అధిక ఉష్ణోగ్రత తగ్గాలంటే శీతలీ ప్రాణాయామం అవసరం. ఇలా వివిధ రకాలైన ఆసనాల ద్వారా మానవ జీవనంలోని ఆరోగ్య సూత్రాలకు ‘ఆసనాలే’ మూలం.
ఈ యాంత్రిక మానవ జీవనం ఎన్నో ఒత్తిడుల మయం. నిత్యం ఎన్నో టెన్షన్స్‌తో ఉరుకులు, పరుగులతో ఉద్యోగ విధిని నిర్వహించే భార్యాభర్తలు ఎందరో! అనేక రకాలైన ఒత్తిడులవలన ఎందరో రోగాల బారిన పడుతుండగా మరికొందరు మద్యపానానికి బానిసలై రోగాల బారిన పడుతున్నారు. చెడు అలవాట్లవలన విలువైన బంగారు జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారనటంలో అతిశయోక్తిలేదు. కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగావుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ‘యోగా’ను అలవాటుచేసుకుంటే ఆరోగ్యాన్ని పొందగలరు. అందుకే అన్ని వయసులవారు అన్నివర్గాలవారూ ఈ యోగాను అలవాటుచేసుకోవాలి. ఆరోగ్యంతోపాటు ఆనందాన్ని సొంతం చేసుకోవాలి.

- ఈవేమన