సంపాదకీయం

సమాజ్‌వాదీ నాటకం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే సంవత్సరం జరుగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అధికార సమాజ్ వాదీ పార్టీ -సపా- పరాజయం పా లు కాక తప్పదన్న ప్రచార ఉద్ధృతి నాలుగైదు రోజులుగా తగ్గిపోయింది. సపాలో రాజుకుంటున్న రగడ ఇందుకు కారణం! మాధ్యమాలవారి దృష్టి మాత్రమే కాక ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షాల దృష్టి కూడా సపా లోని కుటుంబ కలహంపై కేంద్రీకృతమైంది! ఉత్తరప్రదేశ్‌లో సపా అధికారంలోకి వచ్చినప్పటినుంచి అరాజకం తాండవిస్తోందన్నది జగమెరిగిన వాస్తవం. 2012వరకు ఐదేళ్లపాటు మాయావతి ముఖ్యమంత్రిత్వంలో సాగిన బహుజన సమాజ్ పార్టీ-బసపా- పాలన అవినీతికి ఆలవాలమైందన్న ఆరోపణలు వరదలెత్తాయి. ఈ వెల్లువలోనే బసపా కొట్టుకొనిపోయింది. 2012 నాటి ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి ములాయంసింగ్ యాదవ్ నాయకత్వంలోని సపా విజయం సాధించడానికి ఇదీ నేపథ్యం. యువకుడు విద్యాధికుడు ములాయంసింగ్ తనయుడు అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అవినీతికి ఆస్కారం లేని పరిపాలనను అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని ప్రభుత్వం సమకూర్చడం ఖాయమన్న బాజా భజంత్రీలు అప్పుడు మారుమోగాయి! కానీ అచిరకాలంలోనే అవినీతి మాత్రమే కాక అరాజకాలకు హింసాకాండకు లైంగిక బీభత్సకాండకు మతోన్మాదానికి ఉత్తరప్రదేశ్ బలి అవుతున్న దృశ్యాలు నిరంతరం ఆవిష్కృతం కావడం మొదలైంది! ఈ అవినీతిమయ అరాజకం ఇప్పటికీ నడిచిపోతూనే ఉంది! 2013లో చెలరేగిన భయంకర అ సాంఘిక బీభత్స కాండకు ముజఫర్‌నగర్, శ్యామల్ జిల్లాలలో దాదాపు యాభయిమంది హతమైపోవడం పరాకాష్ఠ. మతోన్మాదులు రగిలించిన హింసాజ్వాలలనుండి తప్పించుకొనడానికై దాదాపు వంద గ్రా మాలకు చెందిన నలబయి వేలమంది తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వయం గా ఈ వైపరీత్యాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో ధ్రువీకరించింది. సపా ములాయంసింగ్ యాదవ్ కుటుంబ సంస్థగా మారిపోయింది. అందువల్లనే ఆయన కుమారులు, తమ్ముళ్లు, కూతు ళ్లు, కోడళ్లు పార్టీ పదవులను, ప్రభుత్వ పదవులను హక్క్భుక్తం చేసుకోగలగడం...
తండ్రులు కేంద్రంలోను, తనయులు రాష్ట్ర రాజకీయాలలోను అధికారం చెలాయించడం అన్ని కుటుంబ పార్టీలలోను సర్వసాధారణ సంప్రదాయం అయిపోయింది. లేదా తండ్రి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నిర్దేశిస్తుంటాడు, కుమారులు కుమార్తెలు కేంద్రంలో పదవులను వెలగబెడుతుంటారు. దక్షిణాన డిఎంకె నిర్వాహకులైన ఎమ్.కరుణానిధి కుటుంబం వారు మొదలుకుని ఉత్తరాన జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వాహక అబ్దుల్లాల కుటుంబాల వరకు అన్ని ప్రాంతీయ పార్టీలలోను ఇదే తంతు నడుస్తోంది. కర్నాటకలో దేవగౌడ కుటుంబం, బిహార్‌లో లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం తెలంగాణాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం, ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుని కుటుంబం ఎంతో కొంత ఈ వారసత్వ రాజకీయ స్పూ ర్తిని పెంపొందిస్తుండడం మన ప్రజాస్వామ్య విలక్షణ చరిత్రలో భాగం! అందువల్ల ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ యాదవ్ కుటుంబం పార్టీని సొంత ఆస్తిగా చేసుకొనడంలో ఆశ్చర్యం లేదు...ఈ కుటుంబ వారసత్వ రాజకీయాలకు అతిప్రధాన స్పూర్తి కేంద్రం జవహర్‌లాల్ నెహ్రూ-ఇందిరాగాంధీ పరివారం అన్నది ప్రపంచ ప్రసిద్ధం..అందువల్ల ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం ములా యం సింగ్ కుటుంబంలో రాజుకున్న కలహం గురించి వ్యాఖ్యానించే నైతిక అధికారం కాంగ్రెస్ వంటి ప్రత్యర్థులకు లేదు. అందువల్లనే 2012లో విజయం సాధించిన ములాయంసింగ్ యాదవ్ కుమారుడిని ముఖ్యమంత్రిగా అభిషేకించగలిగాడు. అనేక ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన ములాయంసింగ్ ఇలా సమయస్ఫూర్తితో వారసుడిని ధ్రువీకరించగలిగాడు. ఎందుకంటె ములాయం దృష్టి ప్రధాని పదవిపై కేంద్రీకృతం కావడం 2012 నాటి మాట. మూడవ కూటమో, నాలుగవ కూటమో 2014 నాటి లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను, కాంగ్రెస్‌ను కూడా ఓడించగలదన్నది ములాయం సింగ్ అప్పటి అంచనా. అందువల్లనే తన స్థాయికి ముఖ్యమంత్రి పదవి చిన్నదని ఆయ న భావించాడు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేశాడు. అఖిలేశ్ యాదవ్ ఖాళీ చేసిన పార్లమెంట్ పదవి ఆయన భార్యకు లభించింది. ములాయం కుటుంబంలోని ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ అఖిలేశ్ మంత్రివర్గంలో సభ్యుడయ్యాడు. అప్పటినుంచి ఇప్పటివరకు శివపాల్ యాదవ్‌కు, అఖిలేశ్ యాదవ్‌కు మధ్య ఆధిపత్య స్పర్థ అంతర్నిహితంగా కొనసాగుతూనే ఉంది. ఇది అంతర్యుద్ధంగా రాజుకొనడం వర్తమాన ఘట్టం...
కానీ ఈ అంతర్యుద్ధాన్ని ములాయం సింగ్ యాదవ్ మొగ్గలోనే తుంచివేయకుండా కొనసాగడానికి వీలు కల్పించడం ఆశ్చర్యకరం. ఎందుకంటె పార్టీలో ఇప్పటికీ ఆయన సర్వాధికారి, సర్వ నిర్వాహకుడు, సర్వ నియంత్రకుడు. అందువల్ల ఈ గృహకలహాన్ని ప్రభుత్వ వైఫల్యాలనుంచి, అరాజకం నుంచి, సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వీలుగా అభినయిస్తున్నారన్న ఆరోపణలో తర్కం లేకపోలేదు. భాజపా వారు ప్రధానంగా ఈ ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు, గత మూడేళ్లకు పైగా ములాయంసింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వపు పనితీరును తరచు బహిరంగంగా విమర్శిస్తున్నాడు. పార్టీ అధినేత తమ పార్టీ ప్రభుత్వాన్ని, తన కుమారుడి ముఖ్యమంత్రిత్వాన్ని ఇలా విమర్శించడం అతితెలివైన అభినయం అన్నది ప్రత్యర్థుల ఆరోపణ. ప్రధానంగా ముజఫర్ నగర్ బీభత్సకాండను నిరోధించడంలో తమ పార్టీ ప్రభుత్వ వైఫల్యాన్ని ములాయంగసింగ్ పదేపదే దుయ్యబట్టాడు. రాజకీయమైన ఒత్తడికి లొంగిన పోలీసులు నేరస్థులను నిర్బంధించడంలోను, నిరోధించడంలోను తీవ్రమైన అలసత్వం వహించారన్నది ధ్రువపడిన వాస్తవం. ఇలా స్వీయ ప్రభుత్వాన్ని అభిశంసించడం ద్వారా ములాయంసింగ్ పార్టీకి ప్రజలలో పలుకుబడిని పెంచడానికి కృషి చేశాడు. కానీ ఈ వ్యూహం ఇప్పటికే ఒకసారి ఘోరంగా బెడిసికొట్టింది. 2012లో మాయావతి ప్రభుత్వ వైఫల్యాలను సొమ్ము చేసుకొని శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎస్‌పి 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఘోరపరాజయం పాలైంది. యుపిలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో 73చోట్ల భాజపా కమ ల కేతనాన్ని ఎగురవేయడం సమాజ్‌వాదీ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేసింది...
రానున్న శాసనసభ ఎన్నికల్లో ఈ చరిత్ర పునరావృత్తం కాకుండా ఉండాలంటే సమస్యల, ప్రభుత్వ వైఫల్యాల ప్రాధాన్యం తగ్గిపోవాలి. పార్టీ ప్రాధాన్యం పెరగాలి. ఇలా పార్టీకి ప్రచారం కల్పించుకోవడంలో భాగంగా ఒకవైపున అఖిలేశ్ యాదవ్, మరోవైపుశివపాల్ యాదవ్ పరస్పరం కత్తులు దూస్తున్నారు. ఉభయులకు కత్తులిచ్చింది ములాయంసింగ్ యాదవ్ మాత్రమేనన్నది ఉత్తర ప్రదేశ్‌లోని జనశ్రుతి..ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ పార్టీ అధ్యక్ష పదవినుంచి అఖిలేశ్‌ను తప్పించాడు. ఆ పదవిని శివపాల్‌కు కట్టబెట్టాడు. ముఖ్యమంత్రి బాధ్యతలను మరింత ధ్యానంతో నిర్వర్తించడానికి వీలుగా తండ్రిగారు తనకు పార్టీ బాధ్యతను తప్పించాడని అఖిలేశ్ యాదవ్ పైకి చెబుతున్నాడు. అలాగే శివపాల్ పార్టీ పదవిని సమర్ధవంతంగా నిర్వహించడానికి వీలుగా ఆయనకున్న మంత్రివర్గ బాధ్యతలను అఖిలేశ్ తగ్గించాడట. పార్టీలోనే ఔనని కొందరు...కాదని కొందరు..