ఉత్తరాయణం

రుణమాఫీ మహిళలకేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొలమున్న మహిళలు పొలం పెట్టి గాని బంగారము పెట్టిగాని బ్యాంకులలో ఋణము తీసుకుంటారు. అట్లాగే పొలమున్న పురుషులు కూడా పొలంగాని బంగారం గాని తాకట్టు పెట్టి ఋణం తీసుకుంటారు. స్ర్తిలకు మాత్రమే ఋణ మాఫీ చేస్తామనటం అన్యాయం. ఋణమాఫీ చేస్తే స్ర్తి, పురుషులందరికీ చేయాలి. ఎన్నికల హామీ నెరవేర్చాలి. లేకపోతే ఎవరికి ఋణమాఫీ చేయకూడదు. మరియు నిజాయితీగా బాకీ చెల్లించిన వారికి ఆ కట్టిన డబ్బు వాపసు చేయాలి అది న్యాయం. మరియు పెద్దపెద్ద భూస్వాములకు ఋణమాఫీ వద్దు. అవసరమైతే వడ్డీ మాఫీ చేయవచ్చు..
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ
ఎల్‌ఇడి బల్బుల అక్రమ పంపిణీ
విశాఖలో ఎల్‌ఇడి బల్బులు సరఫరా చేస్తున్నారన్న విషయం తెలుసుకొని అక్కడికి వెళితే మా కరెంటు బిల్లు పై అంతకు ముందే ఎవరో ఎల్‌ఇడి బల్బులు తీసుకొని వెళ్ళారని చెప్పారు. ఏ విధంగానూ పాలుపోలేదు. ఇప్ప టికైనా అధికార్లు ఎల్‌ఇడి బల్బుల అక్రమ పంపిణీని అడ్డుకోవాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
రచయతల తీరు బాగాలేదు
ఇటీవల దేశంలో మతపరమైన అసహనం పెరుగుతోందని నిరసన వ్యక్తంచేస్తూ కొంతమంది రచయితలు, మేధావులు తమ పురస్కారాలను ప్రభుత్వానికి ఇచ్చేయడం సబబుకాదు. ఈ లిస్టులో తాజాగా మాజీ సైనికులు కూడా చేరారు. ఇటువంటి అవార్డులను వివిధ వృత్తుల్లో అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన నిష్ణాతులకు ప్రభుత్వం గుర్తింపుగా యిస్తుండడం ఒక మంచి సంప్రదాయం. వృత్తిలో అపూర్వమైన ప్రతిభ కనబరచేందుకు, ఇతరులకు ఈ అవార్డుల ప్రదానం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. విచిత్రమేమిటంటే మతపరమైన అసహనం పెరగడానికి హిందూ మతాన్ని ప్రత్యక్షంగా కారణభూతాల్ని చేయడం వెనుక అనేక రాజకీయ, కుహనా శక్తుల క్షుద్ర రాజకీయ నాటకాలు వున్నాయన్నది జగమెరిగిన సత్యం. అవార్డు పొందిన రచయిత మైనారిటీ వర్గానికి చెందడం, అతను హత్య గురైతే ప్రప్రథమంగా మైనార్టీ ప్రభుత్వమని చెప్పుకునే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోతే, తిరిగి తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ సంఘటనకు బాధ్యుల్ని చేసి మత అసహనం పెంపొందిస్తోందని విమర్శలు చేయడం గురువింద గింజ సామెతను గుర్తుకు తెస్తోంది.రచయితలు, మేధావులు ప్రవర్తించాల్సిన తీరు సముచితంగా లేదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేయాలి
ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు తెరవాలి. పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చేర్పించాలనుకుంటారు. అయితే ఫీజులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. డొనేషన్లు, ఏక రూప దుస్తులు, టైలు అంటూ బాగా వసూళ్ళు చేస్తారు. కనుక ప్రతీ వీధిలో ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు స్థాపించాలి. రిటైరు అయిన వాళ్ళని కూడ కాంట్రాక్టు పద్ధతిలో బోధకులుగా తీసుకోవాలి. అయితే నేడు కార్పొరేట్ స్కూళ్ళు బాగా ఆర్జిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్ళు పూర్తిగా నిషేధించాలి.
- కె.వి.శేఖర్, దొండపర్తి
విషతుల్యమవుతున్న ఆహారం
ప్రస్తుతం వ్యవసాయ సాగుబడిలో అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా రైతులు అనేక రకాల కష్టాలకు గురవుతూ అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టాలుపాలు కావడంతోపాటుగా వివిధ రకాల రసాయనిక ఎరువులు, మందులు విపరీతంగా వినియోగించి ఆహార పంటలను విషతుల్యం చేస్తున్నారు. నేడు రైతులు పండిస్తున్న పంటలన్నీ ప్రమాదకర రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు అనేకమార్లు ప్రయోగించి పండించినవే. ఈ ఆహార పంటలను మనం నేరుగా ఆహారంగా తీసుకోవడం ద్వారా నెమ్మదిగా విషాన్ని తీసుకొనే విధంగా మారి అనేక వ్యాధులు ప్రబలం కావడానికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. ఈ ఆహార పంటలు వలన భయంకర క్యాన్సర్ వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ విషయాలను గ్రహించి రైతులకు బాగా ఉపయోగపడే సేంద్రియ ఎరువులు, అపాయకరం కాని, ప్రకృతి వినాశనం కాని ఔషధాలను వారిచే వినియోగించి, ప్రాణాంతకమైన రసాయన క్రిమికీటక ఔషధాలను తగ్గించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే విచ్చలవిడిగా రసాయన క్రిమి కీటక నాశనులు, రసాయన ఎరువులు వాడటం వల్ల భూగర్భ జలాలు, పంటలు విషతుల్యమైపోయాయ. అధిక దిగుబడుల పేరుతో చేపడుతున్న రసాయన సేద్యం వల్లనే ఈ ఇబ్బందులు. అందువల్లనే సేంద్రీయ వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతోంది. భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకుండా ఉండాలంటే సేంద్రీయ వ్యవసాయమే శరణ్యం.
- పెయ్యల శ్రీనివాసరావు, అలికాం
సమంజసమైన మార్పు
రైల్వే రిజర్వేషన్లు రద్దుచేసుకుంటే చార్జి రెట్టింపు చేయడం, రైలు బయలుదేరాక చార్జి వాపసు రద్దుచేయడం కొందరు ప్రయాణికుల్ని బాధించవచ్చు.