సబ్ ఫీచర్

శాస్ర్తియంగా విద్యా బోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి హైస్కూల్‌లో పనిచేస్తున్నప్పుడు లెక్కల సార్ తెలిదేవర వెంకట్రావ్ నాకు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ఏ విషయమైనా ఆలోచించి మాట్లాడాలి అనేవారు.
ఆలోచన లేకుండా మాట ఎలా వస్తుందని నేను అన్నాను.
ఆలోచన అంటే ఏం చెప్తావని మళ్లీ అడిగాడు.
నా మొఖం తెల్లబోయింది. ఏం చెప్పలేకపోయాను.
ఆలోచన అంటే చెప్తానని తెలిదేవర మా ఇంటి మేడమీదకు తీసుకుపోయాడు. ఈ ఇంట్లో ఎన్ని రోజులనుంచి ఉంటున్నావని అడిగాడు. ఎన్నిసార్లు ఈ మేడ ఎక్కావు. ఎన్ని మెట్లు ఎక్కేవాడివి అని అడిగాడు.
తెల్వదు అన్నాను.
ఈ ఇంటి పైకి 13 మెట్లున్నాయన్నాడు. నువ్వు చూస్తున్నావు కానీ పరిశీలించటం లేదన్నాడు. ‘‘నేను చూస్తాను. నేను మరిచిపోతాను. నేను పరిశీలిస్తాను, నేను అవగాహన చేసుకుంటాను.’’ నేను ఏదైనా చేస్తేనే నాకు జ్ఞాపకముంటుంది’’అని చైనా సామెతలు చెప్పాడు.
వాక్యం మాట్లాడే ముందు మైండ్‌లో పరిశీలించాలి. ఈ మాట లేదా వాక్యం పర్యవసానం ఏముంటుందని ఆలోచించాలి. అప్పుడే ఆ వాక్యాన్ని నోటితో మాట్లాడాలి. తరగతి గదిలో మన ఆలోచనలు వ్యక్తం చేసేటప్పుడు ఒక క్షణం పరిశీలించుకోవాలి. మననం చేసుకోవాలి. నోటికొచ్చిందల్లా మాట్లాడితే అది పిల్లలపైన ప్రభావం ఉండదు. అందుకే నేను తరగతి గదికి వెళ్లేముందు నోట్స్ రాసుకుంటాను. దాన్ని పరిశీలించుకుంటాను. అప్పుడు తరగతి గదికి వెళ్లి పిల్లల ముందు మాట్లాడతాను. నేను తరగతి గదిలో మాట్లాడే మాటలు 40 మంది విద్యార్థులు వింటారు. పిల్లల్లో ఏకసంథాగ్రాహులుగా ఉంటారు. మనం ఏది చెబితే దానే్న వాళ్లు మననం చేసుకుంటారు. గుర్తుంచుకుంటారు. అందువల్ల ప్రతి విషయంపై పరిశీలన ఉండాలి. ఆ అంశంపై భిన్న ఆలోచనలను ఉపాధ్యాయుడు అవగతం చేసుకోవాలి. తరగతి గదిలో పాఠం చెప్పటమంటే లోతుగా పిల్లలను పరిశీలించాలి. అప్పుడే ఒక్కొక్కరి భావాలు టీచర్‌కు అవగతమవుతాయి. ఆ స్థితిలోనే పిల్లల ముఖంలోని కవళికలనుబట్టి బోధించిన పాఠం ఏమేరకు అర్థమయ్యిందో ఉపాధ్యాయుడు తెలుసుకోగలుగుతాడు. తరగతి వెలుపల ప్రకృతిని చూస్తాం. కానీ పరిశీలించం. కానీ తరగతి గదిలో పిల్లలు టీచర్ మాటలను పరిశీలిస్తారు. పరిశీలన పర్యవసానంగా ఉపాధ్యాయుడు చెప్పిన అంశంపై పిల్లల రియాక్షన్ ఉంటుంది. అది పిల్లలు బైటకు చెప్పకపోవచ్చును. పిల్లల్లో ప్రతిస్పందన రావాలి. అప్పుడే తరగతి గదిలో ఆలోచనల రసాయనిక చర్య జరుగుతుంది. పిల్లలకు బోధన సులభమైన భాషలో జరగాలి. ఉపయోగించే పదాలు ముందరే ఉపాధ్యాయుడు ఏరి పెట్టుకోవాలి. ఆ పదాల్లో వున్న భావన పిల్లలు గ్రహించగలగాలి. అది గ్రహించగలిగినప్పుడే పిల్లల్లో పాఠంపై ప్రతిస్పందన ఉంటుంది. పిల్లల్లో ప్రతిస్పందన రాలేదంటే ఉపాధ్యాయుడు బోధకుడు కాకుండా ఉపన్యాసకుడైనట్లుగా గుర్తించాలి. పిల్లల్లో ఆ ప్రతిస్పందనలనుంచే ప్రశ్న లు జనిస్తాయి. పిల్లల దగ్గర నుంచి ప్రశ్నలు రావటమంటే ఉపాధ్యాయుడు చెప్పిన వాక్యాలు లేదా పాఠం పరశీలింపబడుతున్నదని అర్థం.
కొన్నిసార్లు ప్రతిస్పందన పిల్లల ముఖాలపై స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదే మాదిరిగా ఇలాంటి రియాక్షన్స్ అన్నీ కలిస్తేనే విద్యార్థులు ఉపాధ్యాయుడు చెప్పే అంశాలపై ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ నిర్ణయాలే పిల్లలు తమ నోట్స్‌లో రాసుకుంటారు. అదే పిల్లలు పాఠాన్ని అర్థం చేసుకున్న దాని ఫలితంగా చూడాలి. తరగతి గది విద్యార్థిలో నిత్యం పరిశీలన, నిర్థారణ, అవగాహన అనే మూడు ప్రక్రియలు జరుగుతాయి. ఈ మూడు ప్రక్రియలు జరిగితేనే లెర్నింగ్ జరిగినట్లుగా గుర్తించాలి. ఇదే క్రియేటివ్ లెర్నింగ్. చాలాసార్లు తరగతి గదుల్లో బోధనవల్ల టీచింగ్ జరుగుతుంది కానీ లెర్నింగ్ జరగదు అంటారు. సిలబస్ పూర్తయిందంటారు. కానీ పిల్లల్లో క్రియేటివ్ లెర్నింగ్ జరుగకపోతే సిలబస్ వొంటపట్టదు. పిల్లల్లో లెర్నింగ్ జరిగితే దానివల్ల పలితం వస్తే అది శాస్ర్తియమైన బోధన అవుతుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో అడుగుపెట్టకముందు ఎంత హోంవర్క్ చేస్తే పిల్లలు ఇంటికి వెళ్లాక అంత హోంవర్కు చేస్తారు. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఎంత దూరంలో ఉంటాడో విద్యార్థికూడా ఉపాధ్యాయునికి అంతే దూరంలో ఉంటాడు.

- చుక్కా రామయ్య