జనాంతికం - బుద్దా మురళి

ఆ రోజులే వేరు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాంచారయ్య మనవడిని అని చెప్పుకోవడానికి మించిన అదృష్టం ఈ జీవితానికి ఇంకోటి లేదు’’
‘‘నాంచారయ్య నటుడా? గొప్ప సాహితీకారుడా? గురజాడ సమకాలీనుడా? దాశరథి క్లాస్‌మెట్‌నా? శ్రీశ్రీ మిత్రుడా? ’’
‘‘అలాంటిదేమీ లేదు’’
‘‘స్వాతంత్య్ర సమర యోధుడా? వీర సైనికుడా?’’
‘‘కాదు ’’
‘‘మరేంటి?’’
‘‘మహాత్మాగాంధీని దూరం నుంచి చూశాడు.. సింప్లీసిటీకి మారుపేరైన గాంధీజీని చూసిన నాంచారయ్య మనవడిని అని చెప్పుకోవడం నా పూర్వ జన్మ సుకృతం’’
‘‘నడుముకు వాచీ ధరించే బాపూజీని చూసిన నాంచరయ్య మనవడిగా నువ్వింత సంబర పడితే, అసలు వాచీనే లేని బాబూజీ పాలనలో ఉన్నందుకు నేనెంత మురిసిపోవాలి’’
‘‘నీ కన్నీ వెటకారాలే! ననే్నమైనా అనుకానీ మహనీయుల సింప్లిసిటీపై సెటైర్లు వేస్తే ఊరుకునేది లేదు. నువ్వెన్నయినా చెప్పు ఆ రోజులే వేరు’’
‘‘ఏ రోజులు ఉద్యోగం లేక ఎవడు అప్పిస్తాడా? అని ఊర్లు పట్టి తిరిగిన రోజులా? బాబూ ధర్మం అని ఇండియా అమెరికా వాడ్ని బతిమిలాడుకున్న రోజులా? భద్రత కోసం రష్యా సంకలో చేరిన రోజులా? ’’
‘‘నీకు మనుషులు, మనుషుల అభిరుచుల గురించి పట్టదా? పాత రోజుల్లో త్యాగాలు చేసేందుకు పోటీ పడేవాళ్లు అనుమానంగా ఉంటే పాత సినిమాలు చూడు’’
‘‘ఏంటో ఆ త్యాగం’’
‘‘ఆ రోజుల్లో హీరోయిన్ మరో అమ్మాయి కోసం హీరోను త్యాగం చేసేది. నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం అని శ్రీశ్రీ చెప్పినట్టు చెప్పాలంటే తెలుగు సినిమాల కథల చరిత్ర సమస్తం త్యాగాల మయం. ఈ రోజుల్లో ఈ త్యాగాన్ని మనం ఊహించగలమా?’’
‘‘లేదు అస్సలు ఊహించలేం ఈ రోజుల్లో అయితే ప్రేమించిన యువతిని ఎలా వదిలించుకోవాలా? అని ఆలోచించే స్వార్థపరులే. ఆరోజుల్లో హీరోను సైతం త్యాగం చేసి దుఃఖాన్ని దిగమింగి భారమైన హృదయంతో కొండల వైపు నడుస్తూ వెళ్లే వాళ్లు. హీరోయిన్లు ఎందుకలా త్యాగం చేస్తారో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదోయ్’’
‘‘త్యాగంలోనే జీవిత పరామర్థం ఉంది. అందుకే తల్లిపాత్ర, తండ్రి పాత్రలు త్యాగాలకు సింబల్‌గా ఉండేవి. పోటీ పడి త్యాగాలు చేసి కడుపు మాడ్చుకునే వాళ్లు. మధ్యలో హీరో వదిన కూడా త్యాగాల్లో నేనేం తక్కువ తినలేదు అని తాను తినకుండా మరిదిని గారాబం చేస్తూ ఎర్ర చీరకు నల్ల అతుకు వేసుకుని కట్టెల పొయ్యిపై వండుతూ కట్టెల పొగ, కన్నీళ్లు రెండు కలిసిపోయి ఎంత కదిలించేవో ఆ దృశ్యాలు. ఇప్పుడు సినిమాల్లో చివరి సీన్లో హీరో విలన్ గ్యాంగ్ మధ్య భీకరమైన పోరాటం జరిగినట్టు ఆ కాలంలో తెలుగు సినిమాల్లో ప్రతి పాత్ర త్యాగంలో పోటీ పడేది. హీరోయిన్ హీరోను త్యాగం చేస్తే, హీరో క్యాన్సర్ రోగంతో హీరోయిన్‌ను త్యాగం చేసేవాడు. హీరో స్నేహితులు, దగ్గుదమ్ముతో ఉన్న తల్లి,తండ్రి, కుంటి తమ్ముడు, గుడ్డి చెల్లెలు త్యాగాల్లో పోటీ పడేవాళ్లు. కానీ హీరో/హీరోయిన్ మేన మామకు మాత్రం త్యాగాల వాసన గిట్టేది కాదు. అందుకే అప్పటి నుంచి మామలను నమ్మొద్దు అని నిర్ణయించుకున్నాను.’’
‘‘మరీ అలా తీసిపారేయకు. ఈ రోజుల్లో కూడా త్యాగాలకు కొదవ లేదు. దానికి సరైన ప్రచారం లభించడం లేదు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న నాయకులు రోజుకు రెండు ఇడ్లీలు, వంద గ్రాముల పాలు, చెంచాడు పెరుగు తింటూ తమ జీవితాన్ని ప్రజలకు త్యాగం చేస్తున్నారు. ఆ కాలంలో రాజకీయ నాయకులు దేశం కోసం సర్వం త్యాగం చేసే వారు. ఇప్పుడు దేశమే నాయకుల కోసం సర్వం త్యాగం చేస్తోంది. మొన్నటికి మొన్న ఒక ఎంపి వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు. అంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఆమె నియమ నిబంధనలను త్యాగం చేసినట్టే కదా? ’’
‘‘ఇది త్యాగమా?? అలా అంటే చాలా మంది సిగ్గు, నీతి, నియమాలను త్యాగం చేస్తున్నారు?’’
‘‘త్యాగాన్ని గుర్తించక పోతే ఎలా? ప్రతి రాజకీయ నాయకుడు తమ కుటుంబం మొత్తాన్ని రాజకీయాలకు, ప్రజలకు త్యాగం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరినీ కళామతల్లికి త్యాగం చేస్తున్న హీరోల త్యాగనిరతిని ఎంత పొగిడినా తక్కువే?
‘‘పిల్లలను కంటే స్వార్థం పెరుగుతుందని జీవితాలను త్యాగం చేసిన వారి కథలు విన్నాం, చదివాం కానీ పిల్లలను కనడం కూడా త్యాగమేనా? ’’
‘‘త్యాగాన్ని త్యాగమయులే అర్థం చేసుకుంటారు. నీలాంటి వారికి అర్థం కాదు’’
‘‘చూస్తుంటే నరుూమ్‌ది కూడా త్యాగం అనేట్టుగా ఉన్నావ్’’
‘‘ అనుమానం ఎందుకు? రోజుకో చోట ఉంటూ తిన్న చోట తినకుండా కంటికి కునుకు లేకుండా నరుూమ్ క్షణ క్షణం భయం భయంగా బతకడం అంటే జీవితాన్ని త్యాగం చేయడమే కదా?’’
‘‘వామ్మో’’
‘‘నిజం మాట్లాడితే ఇలానే ఉంటుంది. బావ కళ్లల్లో ఆనందం చూడాలని మొద్దు శీను అనుకున్నట్టు కృష్ణయ్యను సిఎం కుర్చీలో చూడాలని, కృష్ణయ్య కళ్లల్లో ఆనందం చూడాలని నరుూమ్ అనుకోవడం వల్లనే ఎన్‌కౌంటర్ చేశారు’’
‘‘ఎన్‌కౌంటర్ వెనక మతలబు ఉందంటావా?’’
‘‘నరుూమ్ ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ ఒక్క గొప్ప అవకాశాన్ని కోల్పోయింది. మేధావులంతా ఒకేరకంగా ఆలోచిస్తారు అనడం అక్షర సత్యం అనడానికి నయిమ్ సంగతే సాక్షం. కృష్ణయ్యను సిఎంను చేయాలని బాబు కల కన్నారు. నరుూమ్ సైతం అదే కల కన్నారు. నరుూమ్ హోంమంత్రిగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుంటే అమరావతిపాలకుడు అక్కడి నుంచి కృష్ణయ్యను దీవిస్తుంటే ఆ దృశ్యం చూసేందుకు ఎంత అద్భుతంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకో’’
‘‘హోంమంత్రా’’
‘‘ వెటకారం కాదు హోంమంత్రిగా నరుూమ్‌ను మించి ఈ దేశంలో ఎవరికీ అర్హత లేదు. పోలీసు వ్యవస్థ లోటు పాట్లు, బంది పోట్ల ఎత్తుగడలు, మాఫియా రహస్యాలు, నాయకుల నేర చరిత్ర, పాలనా వ్యవస్థలోని రంధ్రాలు, తీవ్రవాదులు ఆసుపాసులు నరుూమ్‌కు తెలిసినంతగా మొత్తం పాలనా వ్యవస్థకు కూడా తెలియదు. తెలంగాణను ఎక్కడికో తీసుకు వెళ్లాలని చూస్తుంటే మీరేమో అక్కడికి రారు. ఇక్కడే ఉంటారు. మీ ఖర్మ మీ ఇష్టం’’