ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పాకిస్తాన్‌ను శిక్షించి తీరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుక్కతొక వంకర అనేది మరోసారి రుజువైంది. యురిలోని సైనిక శిబిరంపై ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన దాడి పాకిస్తాన్ కుక్కతోక వంకర విధానానికి మరో నిదర్శనం. ఇస్లామిక్ తీవ్రవాదం ద్వారా భారత దేశంపై ప్రచ్చన్న యుద్ధం కొనసాగిస్తున్న పాకిస్తాన్ వైఖరిలో మార్పు రానేరాదు. పాకిస్తాన్ తనంత తాను మంచి మార్గంలోకి రానప్పుడు గట్టిగా బుట్టి చెప్పటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించకతప్పదు. యురి సైనిక శిబిరంపై ఇస్లామిక్ తీవ్రవాదుల ద్వారా దాడి చేయించి దాదాపు ఇరవై మంది సైనికులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్‌కు వీలైనంత త్వరగా బుద్ది చెప్పాలి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్న తరువాత యురిలో ఆదివారం జరిగింది అతిపెద్ద ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి.
పటాన్‌కోట్ దాడి మాదిరిగానే యురి సైనిక శిబిరం దాడి విషయంలో కూడా పాకిస్తాన్ మరోసారి కల్లబొల్లి కముర్లు చెబుతుంది. అందుకే యురి శిబిరం దాడికి పాకిస్తాన్‌పై నిందారోపణ చేసే బదులు అదను చిక్కించుకుని పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా బుద్ది చెప్పాలి. పఠాన్‌కోట దాడి జరిగినప్పుడు చేసినట్లు ఇప్పుడు యురి సైనిక శిబిరంపై జరిగిన దాడికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించి పాకిస్తాన్‌కు పంపించే ప్రక్రియ నర్వహించకూడదు. ‘‘పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదుల ద్వారా యురి సైనిక శిబిరంపై దాడి చేసింది ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామ’’ని అధికారికంగా ప్రకటన చేయాలి. ఈ ప్రకటన చేసిన అనతి కాలంలోనే పాకిస్తాన్‌కు బుద్ది చెప్పాలి. ఇస్లామిక్ ఉగ్రవాదుల ద్వారా భారత దేశంలోని ముఖ్యమైన సైనిక కేంద్రాలపై దాడులు చేయించటం ద్వారా నైతిక నష్టం కలిగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.
భారత దేశంతో ప్రత్యక్ష యుద్దానికి దిగితే ఓటమి ఖాయమనేది పాకిస్తాన్ పాలకులకు బాగా తెలుసు. ప్ర త్యక్ష యుద్దానికి దిగకుండా ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడు ల ద్వారా భారత దేశాన్ని దెబ్బ తీసేందుకు పాకిస్తాన్ ఒక స్పష్టమైన సైనిక వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ తన ఈ వ్యూహంలో విజ యం సాధిస్తోంది. పాకిస్తాన్ అమలు చేస్తున్న ఈ వ్యూ హం వెనక చైనా హస్తం కూడా ఉండి ఉంటుంది. ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడుల ద్వారా భారత దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతూ జమ్ముకాశ్మీర్‌ను భారత దేశం నుండి వేరు చేసే లక్ష్యాన్ని సాధించాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నానికి చైనా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. జమ్ముకాశ్మీర్‌ను వేరు చేయ టం ద్వారా భారత దేశాన్ని నీరు కార్చాలన్నది పాకిస్తాన్, చైనాల లక్ష్యం. రెండు దేశాల ఈ వ్యూహాన్ని దెబ్బ తీసేందుకు భారత దేశం అత్యంత సమర్థ వ్యూహంతో ముందుకు సాగవలసి ఉంటుంది.
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి జరిగిన కొన్ని నెలలకే యురిలోని సైనిక శిబిరంపై దాడి చేయటం పాకిస్తాన్ సైనిక ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ ఇక మీదట కూడా ఇలాంటి దాడులు చేయటం ఖాయం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇకనైనా పాకిస్తాన్ విషయంలో అత్యంత స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవటంతోపాటు దానిని పకడ్బందీగా అమలు చేయా లి. నరేంద్ర మోదీ అకస్మాత్తుగా లాహోర్ వెళ్లి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌తో తేనీరు సేవించటం వంటి దౌత్య నీతి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదనేది కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. సైనికుల గుప్పిల్లో ఉన్న పాకిస్తాన్‌లోని ప్రజా ప్రభుత్వంతో దౌత్యనీతి కొనసాగించటం అర్థరహితం. నవాజ్ షరీఫ్ లేదా మరో ప్రజా నాయకుడికి పాకిస్తాన్‌లో ఎలాంటి ప్రాధాన్యత లేదు. పాకిస్తాన్‌లో అధికారం చెలాయించేది సైన్యం మాత్రమే. పాకిస్తాన్ సైన్యం ఏ దశలో కూడా భారత దేశంతో శాంతిని కోరుకోదు. అందుకే శాంతి స్థాపనకు ఎలాంటి ప్రయత్నం చేయదు. ఇస్లామిక్ తీవ్రవాదులను మరింత ప్రోత్సహించటం ద్వారా భారత దేశాన్ని దెబ్బ తీసేందుకు పాకిస్తాన్ సైన్యం పని చేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ సైనిక వ్యూహాన్ని దెబ్బ తీయాలంటే భారత దేశం కూడా సైనిక చర్యల ద్వారానే ముందుకు సాగాలి. ముల్లును ముల్లుతోనే తీయగలుగుతాం. పాకిస్తాన్ సైన్యం ఇస్లామిక్ ఉగ్రవాదుల ద్వారా కొనసాగిస్తున్న దాడులను తిప్పకొట్టటంతోపాటు అరికట్టాలంటే సైనిక చర్యల ద్వారానే ఇది సాధ్యమవుతుంది.
యురి సైనిక శిబిరంపై దాడి చేసిన ముష్కరులను వదిలి పెట్టేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినంత మాత్రాన ఎంత మాత్రం సరిపోదు. ప్రధాన మంత్రి చేసిన ప్రకటన అతి త్వరలోనే కార్యరూపం ధరించాలి. పాకిస్తాన్‌తో సత్సంబందాలను నెలకొల్పేందుకు మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి ఎన్నో ప్రయత్నాలు చేశారు. నవాజ్ షరీఫ్‌ను కలుసుకునేందుకు ఆయన లాహోర్ వరకు బస్సు యాత్ర చేశారు. పాకిస్తాన్ వెళ్లే వారి కోసం పాస్ పోర్టులు, వీసాల నిబంధనలను సులభతరం చేశారు. వాజ్‌పేయి తీసుకున్న ఇలాంటి పలు చర్యల మూలంగానే జమ్ముకాశ్మీర్‌లోని ముస్లింలు ఆక్రమిత పాకిస్తాన్‌కు సులభంగా వెళ్లి రాగలుగుతున్నారు. అయితే సత్సంబంధాల కోసం వాజ్‌పేయి చేసిన ప్రతి ప్రయత్నాన్ని పాకిస్తాన్ పాలకులు వమ్ము చేశారు. లాహోర్ బస్సు యాత్రకు ప్రతిగా కార్గిల్ ఆక్రమణకు పాల్పడ్డ పాకిస్తాన్ సైన్యం, పాలకులు మారుతారని ఆశించటం తప్పు. అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్‌తో వ్యవహరించాలి. దెబ్బకు దెబ్బ తీయటం ద్వారా పాకిస్తాన్‌ను దారికి తీసుకురావాలి తప్ప దౌత్యం ద్వారా సత్ఫలితాలను ఆశించకూడదు.

చిత్రం.. యురి ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి సందర్భంగా వెలువడుతున్న దట్టమైన పొగ